రైల్వే ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం
September 24th, 03:10 pm
రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరుకు గుర్తింపుగా 10,91,146 మంది ఉద్యోగులకు 78 రోజుల పనితీరు ఆధారిత బోనస్ (పీఎల్‌బీ) రూ. 1865.68 కోట్ల చెల్లింపునకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.