ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని సందర్శించి, పేలుడు ఘటన బాధితులను కలిసిన ప్రధానమంత్రి

November 12th, 03:21 pm

ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన బాధితులను పరామర్శించేందుకు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.