ఉత్కళ దివస్ సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
April 01st, 10:31 am
ఈ రోజు ఉత్కళ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక వైభవానికి కాలాతీతమైన చిహ్నంగా ఒడిశా నిలుస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఒడియా సంగీతం, కళలు, సాహిత్యం దేశాన్ని అనేక విధాలుగా సుసంపన్నం చేశాయన్నారు. ‘‘సంకల్పం, నిరాడంబరత్వం, ఆత్మీయతకు పేరుగాంచిన ఒడిశా ప్రజలు.. వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేశారు. భవిష్యత్తులో ఒడిశా పురోగతిలో నూతన శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను’’ అని శ్రీ మోదీ తెలిపారు.అస్సాంలోని సిల్చార్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
March 14th, 11:10 am
సంస్కృతి, ధైర్యం, ఉత్సాహం నిండిన బరాక్ లోయ కుటుంబాల మధ్యకు రావడం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభవాన్నిస్తుంది. బరాక్ లోయకు ముఖద్వారంగా సిల్చార్‌ను పిలుస్తారు. చరిత్ర, భాష, సంస్కృతి, వ్యాపారం అన్నీ కలసి ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువచ్చాయి. ఇక్కడ బెంగాలీ మాట్లాడతారు. అస్సామీ ప్రతిధ్వనిస్తుంది. ఇతర గిరిజన సంప్రదాయాలు విరాజిల్లుతున్నాయి. ఈ వైవిధ్యాన్ని బలంగా మార్చుకుంటూ, సోదరభావం, సామరస్యంతో ఈ ప్రాంతాన్నంతా మీరు అభివృద్ధి చేస్తున్నారు. ఇది బరాక్ వ్యాలీకున్న అసమానమైన సామర్థ్యం.అస్సాంలోని సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 14th, 10:45 am
అస్సాంలోని సిల్చార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. సంస్కృతి, చైతన్యానికి నిలయమైన బరాక్ లోయను సందర్శించడం తనకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుందని పేర్కొన్నారు. సిల్చార్ నగరం ఈ లోయకు ఒక ప్రవేశ ద్వారం వంటిదని.. ఇక్కడ చరిత్ర, భాష ఒక ప్రత్యేకమైన ప్రాంతీయ గుర్తింపును తీసుకొచ్చాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. బెంగాలీ, అస్సామీ, గిరిజన సంప్రదాయాలు సామరస్యంతో వర్ధిల్లే ఈ ప్రాంత వైవిధ్యమే దీని అసలైన బలమని శ్రీ మోదీ తెలిపారు. ‘‘బరాక్ లోయ వైవిధ్యమే దాని గొప్ప ఆస్తి. ఇది పౌరుల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
February 20th, 07:37 pm
ప్రముఖ బెంగాలీ రచయిత శ్రీ మణిశంకర్ ముఖోపాధ్యాయ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.శ్రీ డీ జ్ఞానసుందరం మృతికి ప్రధాని సంతాపం
January 26th, 09:48 pm
డీ జ్ఞానసుందరం మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రముఖ రచయిత శ్రీ వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత... ప్రధానమంత్రి సంతాపం
December 23rd, 07:35 pm
ప్రసిద్ధ రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత శ్రీ వినోద్ కుమార్ శుక్లా కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. హిందీ సాహిత్య లోకానికి ఆయన అమూల్య సేవలు చిరస్మరణీయమని శ్రీ మోదీ పేర్కొన్నారు.ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
November 01st, 02:27 pm
ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త రామ్‌దరశ్ మిశ్రా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.ప్రముఖ కన్నడ రచయిత, తత్వవేత్త శ్రీ ఎస్ఎల్ భైరప్ప మృతికి ప్రధానమంత్రి సంతాపం
September 24th, 04:29 pm
ప్రముఖ కన్నడ నవలా రచయిత, తత్వవేత్త శ్రీ ఎస్ఎల్ భైరప్ప మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మనస్సాక్షిని కదిలించిన, దేశ అంతరాత్మను తాకిన మహోన్నత వ్యక్తిగా ఆయన్ను అభివర్ణించారు.తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 27th, 12:30 pm
పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 27th, 12:25 pm
తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ఘనాలో ప్రధానమంత్రి అధికారిక పర్యటన: కుదిరిన ఒప్పందాలు
July 03rd, 04:01 am
సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (సీఈపీ)పై ఎంఓయూ: కళ, సంగీతం, నృత్యం, సాహిత్యం, వారసత్వం వంటి రంగాల్లో సాంస్కృతిక అవగాహనను ఇచ్చి పుచ్చుకోవడం, ప్రస్తుత స్థాయి కంటే వీటిని మరింత ముందుకు తీసుకుపోవడం.గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని
May 09th, 02:27 pm
గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
December 26th, 10:16 am
మలయాళ సినిమా, సాహిత్య రంగాల్లో ప్రముఖ వ్యక్తి అయిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. మానవ భావోద్వేగాలపై లోతైన అన్వేషణతో సాగిన శ్రీ ఎంటీ వాసుదేవన్ నాయర్ రచనలు తరాలను తీర్చిదిద్దాయని, భవిష్యత్తులోనూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధాని శ్రీ మోదీ అన్నారు.