ప్రధానమంత్రి అధ్యక్షతన గిర్‌లో నేడు నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌లైఫ్ ఏడో సమావేశం

March 03rd, 04:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లో గిర్ నేషనల్ పార్కును సందర్శించారు. అక్కడ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ ఏడో సమావేశాన్ని నిర్వహించగా, ఆ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా, వన్యప్రాణుల్ని చూడడానికి ఈ రోజు ఉదయం గిర్‌ వెళ్లాను.. అది రాజసం ఉట్టిపడే ఆసియా సింహాల ఆవాసమని మనకందరికీ తెలుసు; గిర్ చేరుకోవడంతో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా కలసి పూర్తి చేసిన పనుల జ్ఞ‌ాపకాలెన్నో మదిలో మెదిలాయి: ప్రధానమంత్రి

March 03rd, 12:03 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వన్యప్రాణులను చూడడానికి గిర్ వెళ్లారు. రాచఠీవి ఉట్టిపడే ఆసియా సింహాల నివాసంగా గిర్ సుపరిచితమే.