సుస్థిరాభివృద్ధిలో సహకారానికి భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్త ప్రకటన
April 20th, 10:55 pm
వాతావరణ మార్పులు, సముద్ర, ఆర్కిటిక్ అంశాల్లో ఆచరణాత్మక సహకారం ద్వారా ప్రపంచ సుస్థిరాభివృద్ధి సవాళ్ల పరిష్కారానికి ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్- రిపబ్లిక్ ఆఫ్ కొరియా సంయుక్తంగా ప్రకటించారు.భారత్-దక్షిణ కొరియా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంయుక్త కార్యాచరణ ప్రణాళిక
April 20th, 10:53 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, దక్షిణ కొరియా (ఆర్‌ఓకే) అధ్యక్షులు గౌరవనీయ లీ ఈ మయంగ్ ఈ నెల 19 నుంచి 21 వరకు భారత్ పర్యటనకు వచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే ఆయన తొలి విదేశీ సందర్శనలో భాగంగా భారత్ రావడం విశేషం. ఆయన వెంట కొరియా ప్రభుత్వ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రసిద్ధ కంపెనీల సీఈఓలు సహా ఒక ఉన్నత స్థాయి బృందం కూడా వచ్చింది.నౌకానిర్మాణం, షిప్పింగ్, నౌకా రవాణాపై భాగస్వామ్యానికి భారత్-ఆర్‌వోకే సమగ్ర విధానం
April 20th, 10:51 pm
భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా కొరియా రిపబ్లిక్ (ఆర్‌వోకే) అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో 2026 ఏప్రిల్ 20న సమావేశమయ్యారు. ఈ చర్చల్లో నౌకా నిర్మాణం, షిప్పింగు, నౌకా రవాణా భాగస్వామ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఉభయపక్షాలు ఫలవంతమైన, విస్తృతమైన ఆలోచనలను పంచుకున్నాయి.కొరియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
April 20th, 01:05 pm
భారతదేశానికి తొలిసారి వచ్చిన అధ్యక్షుడు లీని స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉంది. . ఆయన జీవితం పట్టుదల, సేవ, అంకితభావాలకు స్ఫూర్తిదాయక నిదర్శనం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇది ఆయన తొలి భారత పర్యటన అయినప్పటికీ, మా మొదటి సమావేశం లోనే దేశంపై ఆయనకున్న అభిమానం, ఆత్మీయత స్పష్టంగా కనిపించింది.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
June 18th, 03:17 pm
కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్, కొరియా రిపబ్లిక్ కలసి పనిచేయాలని కోరుకొంటున్నాయని శ్రీ మోదీ అన్నారు.కొరియా రిపబ్లిక్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని
June 04th, 08:38 am
కొరియా రిపబ్లిక్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.