ప్రధానమంత్రికి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ పురస్కారంతో సీషెల్స్ సత్కారం
June 28th, 03:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సీషెల్స్ అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ పాట్రిక్ హర్మినీ ఇవాళ ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్’ విశిష్ట పురస్కారంతో సత్కరించారు. కాలుష్య రహిత భూగోళం లక్ష్యంగా నాయకత్వం వహిస్తున్నందుకు, వర్ధమాన దేశాల ప్రయోజనాల కోసం గళమెత్తిన ఆయనను ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ బిరుదుతో గౌరవించారు. అలాగే, నీలి ఆర్థిక వ్యవస్థ వికాసం, వాతావరణ ప్రభావ ఉపశమన చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ, వర్ధమాన చిన్న ద్వీపదేశాల అభివృద్ధి ఆకాంక్షలను ప్రోత్సహించడంలో ఆయన దీర్ఘకాలిక నిబద్ధతకు గుర్తింపుగా ప్రధానమంత్రికి ఈ గౌరవం లభించింది. ఈ విశిష్ట పురస్కారం ప్రత్యేకంగా ఏర్పరచి, ఒక అంతర్జాతీయ నాయకుడికి ప్రదానం చేయడం ఇదే తొలిసారి.అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన వారికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి
June 25th, 10:53 am
అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామిక విలువలను రక్షించిన వారందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రద్ధాంజలి ఘటించారు. భారతదేశ చరిత్రలో అత్యంత నిరాశామయ అధ్యాయాలలో ఎమర్జెన్సీ ఒకటి అని ఆయన అన్నారు. ఆ సమయం... మౌనంగా ఉండిపోకుండా, రాజ్యాంగంలోని ఆదర్శాలను నిలబెట్టిన అసంఖ్యాక పౌరుల అసాధారణ ధైర్య, సాహసాలను, ధీరత్వాన్ని చాటిందని కూడా ఆయన అన్నారు.అర్మేనియా పార్లమెంట్ ఎన్నికల్లో సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించడంతో నికోల్ పాశిన్యాన్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని
June 08th, 04:51 pm
అర్మేనియా పార్లమెంట్ ఎన్నికల్లో సివిల్ కాంట్రాక్ట్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో నికోల్ పాశిన్యాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందనలు తెలియజేశారు. మరోసారి దక్కిన ప్రజామోదం ఆయన నాయకత్వంపై, దార్శనికతపై అర్మేనియా ప్రజలకు ఉన్న శాశ్వతమైన నమ్మకాన్నీ, విశ్వాసాన్నీ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధానమంత్రి పర్యటన
May 15th, 03:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికారిక పర్యటన చేపట్టారు. ఆయనకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సువేందు అధికారికి ప్రధానమంత్రి అభినందనలు
May 09th, 02:06 pm
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ సువేందు అధికారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు.నేపాల్ ప్రధానిగా శ్రీ బాలేంద్ర షా ప్రమాణస్వీకారం.. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
March 27th, 01:27 pm
నేపాల్‌కు ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాలేంద్ర షాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘ఈ పదవీ బాధ్యతలు నేపాల్ ప్రజలు మీ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకానికి అద్దం పడుతున్నాయి. భారత్, నేపాల్ ప్రజల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మైత్రినీ, సహకారాన్నీ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి మీతో కలిసి పనిచేయాలనుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.థాయిలాండ్ ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ అనుటిన్ చార్న్‌విరాకుల్‌కు ప్రధానమంత్రి అభినందనలు
March 20th, 02:11 pm
థాయ్‌లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ అనుటిన్ చార్న్‌విరాకుల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.The greatest pride of my life is that I am a karyakarta of the Bharatiya Janata Party: PM Modi at BJP HQ
January 20th, 11:16 am
Prime Minister Narendra Modi today addressed party leaders and karyakartas during the felicitation ceremony of the newly elected BJP President, Nitin Nabin, at the party headquarters in New Delhi. Congratulating Nitin Nabin, the Prime Minister said, “The organisational election process reflects the BJP’s commitment to internal democracy, discipline and a karyakarta-centric culture. I congratulate karyakartas across the country for strengthening this democratic exercise.”PM Modi addresses BJP karyakartas at felicitation of New Party President
January 20th, 11:15 am
Prime Minister Narendra Modi today addressed party leaders and karyakartas during the felicitation ceremony of the newly elected BJP President, Nitin Nabin, at the party headquarters in New Delhi. Congratulating Nitin Nabin, the Prime Minister said, “The organisational election process reflects the BJP’s commitment to internal democracy, discipline and a karyakarta-centric culture. I congratulate karyakartas across the country for strengthening this democratic exercise.”Prime Minister pays tributes to all people who took part in Quit India Movement
August 09th, 08:44 am
The Prime Minister, Shri Narendra Modi today paid tributes with deep gratitude to all brave people who took part in the Quit India Movement under the inspiring leadership of Mahatma Gandhi.భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలతో సమావేశమైన ఇరు దేశాల ప్రధానమంత్రులు
July 24th, 07:38 pm
చారిత్రాత్మక భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, ఔషధాలు, రత్నాలు - ఆభరణాలు, వాహనాలు, ఇంధనం, తయారీ, టెలికాం, టెక్నాలజీ, ఐటీ, సరకు రవాణా, వస్త్రాలు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.శ్రీ కె.కామరాజ్ గారి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
July 15th, 10:50 am
శ్రీ కె. కామరాజ్ గారి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి ఈ రోజు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. కామరాజ్ గారి ఉదాత్తమైన ఆదర్శాలతో పాటు సామాజిక న్యాయ సాధనకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం...మనకు ఎంతో ప్రేరణనిస్తాయని ప్రధానమంత్రి అన్నారు.మారిషస్ అధికారిక పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి ముందస్తు సందేశం
March 10th, 06:18 pm
నా మిత్రుడు, మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం ఆహ్వానం మేరకు ఆ దేశ 57వ జాతీయ దినోత్సవంలో పాలు పంచుకునేందుకు నేను రెండు రోజుల అధికారిక పర్యటన చేపట్టబోతున్నాను.న్యూఢిల్లీలో సోల్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 21st, 11:30 am
భూటాన్ ప్రధానమంత్రి, నా సోదరుడు దషో షెరింగ్ టోబ్‌గే, సోల్ (స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్‌షిప్) బోర్డు చైర్మన్ సుధీర్ మెహతా, వైస్ చైర్మన్ హన్స్ముఖ్ అధియా, జీవితాల్లో, ఆయా రంగాల్లో నాయకత్వాన్ని అందించడంలో విజయం సాధించిన ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, ఇంకా ఇక్కడ నేను చూస్తున్న అలాంటి గొప్ప వ్యక్తులు, అలాగే భవిష్యత్తు ఎదురుచూస్తున్న నా ఇతర యువ సహచరులారా…సోల్ నాయకత్వ సదస్సు మొదటి సంచికను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 21st, 11:00 am
స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ (సోల్) సదస్సు-2025 మొదటి సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు, భవిష్యత్తులో నాయకులుగా ఎదగబోతున్న యువతకు శ్రీ మోదీ స్వాగతం పలికారు. కొన్ని కార్యక్రమాలు మనసుకు దగ్గరగా ఉంటాయని ఈ రోజు జరుగుతున్న సదస్సు కూడా అలాంటిదే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘దేశ నిర్మాణానికి మెరుగైన పౌరులను తయారు చేయడం, ప్రతి రంగంలోనూ అద్భుతమైన నాయకులను తీర్చిదిద్దడం అవసరం’’ అని ప్రధాని అన్నారు. ప్రతి రంగంలోనూ గొప్ప నాయకులను తయారుచేయడం ప్రస్తుతం చాలా అవసరమని ఆయన తెలిపారు. ఈ దిశగా సాగుతున్న వికసిత్ భారత్ అభివృద్ధి ప్రయాణంలో స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్‌ను ఓ ముఖ్యమైన మైలురాయిగా వర్ణించారు. ఈ సంస్థ పేరుకి తగినట్టుగానే తనలో భారతీయ సామాజిక జీవన ఆత్మను నిలుపుకొని, దానిని కొనసాగిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. ఆధ్యాత్మిక అనుభవ సారాన్ని సోల్ అందంగా ప్రదర్శిస్తుందని ఆయన అన్నారు. సోల్ సంస్థకు సంబంధించిన అన్ని విభాగాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంస్థకు భవిష్యత్తులో గుజరాత్‌లో ఉన్న గిఫ్ట్ సిటీలో విస్తృతమైన క్యాంపస్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.Be an example; don't demand respect, command respect. Lead by doing, not by demanding: PM Modi on PPC platform
February 10th, 11:30 am
At Pariksha Pe Charcha, PM Modi engaged in a lively chat with students at Sunder Nursery, New Delhi. From tackling exam stress to mastering time, PM Modi shared wisdom on leadership, wellness, and chasing dreams. He praised the youth for their concern about climate change, urging them to take action. Emphasizing resilience, mindfulness, and positivity, he encouraged students to shape a brighter future.‘పరీక్షా పే చర్చా-2025’ లో భాగంగా విద్యార్థులతో ముచ్చటించిన ప్రధానమంత్రి
February 10th, 11:00 am
సుందర నర్సరీలో ఈరోజు ఏర్పాటైన ‘పరీక్షా పే చర్చా’ (పీపీసీ) ఎనిమిదో సంచిక కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. దేశం నలుమూలల నుంచీ వచ్చిన విద్యార్థులతో ఆహ్లాదకర వాతావరణంలో ముచ్చటించిన ప్రధాని, ఈ సందర్భంగా అనేక అంశాలను స్పృశించారు. శీతాకాలంలో శరీరంలో వేడిని కలిగించే నువ్వుల మిఠాయిని ప్రధాని విద్యార్థులకు పంచారు.కువైట్ విదేశాంగ మంత్రితో ప్రధాని భేటీ
December 04th, 08:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో కువైట్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా అలీ అల్ - యాహ్యా ఈ రోజు సమావేశమయ్యారు.క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి
August 09th, 08:58 am
మహాత్మా గాంధీ నాయకత్వంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకొన్న వారందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గురించిన ఒక వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు.