న్యూజిలాండ్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం
July 11th, 01:15 pm
‘మళ్లీ ఏ పుష్కరానికో...’ అంటుంటాం భారత్‌లో మనం. గత నలభై ఏళ్లలో భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ రావడం ఇదే మొదటిసారి. దీనిని నా అదృష్టంగా భావిస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజలందరికీ, మీలో ప్రతి ఒక్కరికీ 140 కోట్ల మంది భారతీయులు అందించిన హృదయపూర్వక శుభాకాంక్షలను మోసుకొచ్చాను.న్యూజిలాండ్‌లో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
July 11th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆక్లాండ్‌లో జరిగిన “కియా ఓరా మోదీ” కార్యక్రమంలో న్యూజిలాండ్‌లోని ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన భారీ సభనుద్దేశించి ప్రసంగించారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి గౌరవ క్రిస్టోఫర్ లక్సన్ ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయత, శక్తి, ఉత్సాహం నిండిన 10,000 మందికి పైగా ప్రవాస భారతీయులు ఈ సభలో పాల్గొన్నారు.ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకల త్రివిధ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
June 21st, 12:51 pm
ఈ రోజు అనేక విధాలుగా ప్రత్యేకమైనది. యావత్ ప్రపంచమూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటోంది. ఇలాంటి విశిష్ట సందర్భంలో పవిత్ర బెంగాల్ భూమికి వచ్చే అవకాశం లభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారత దేశ ఆలోచనలకు కొత్త దిశను అందించిన, భారత దేశ పునరుజ్జీవాన్ని వేగవంతం చేసిన, సముద్ర మార్గాల ద్వారా శతాబ్దాలుగా దేశాన్ని ప్రపంచంతో అనుసంధానించిన భూమి ఇది. ఈ రోజు ఇదే మట్టిపై ఆత్మనిర్భర్ భారత్, సురక్షిత భారత్, వికసిత భారత్ లక్ష్యాలతో ముడిపడి ఉన్న ఓ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. కొంతసేపటి క్రితమే ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టాం. జూన్ 21ని ప్రపంచ హైడ్రోగ్రఫీ దినోత్సవంగా నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. అదే రోజున భారతదేశపు అత్యంత అధునాతన హైడ్రోగ్రఫీ నౌక ఐఎన్ఎస్ సంశోధక్‌ను సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టడం కాకతాళీయం. ఈ సందర్భంగా భారత నౌకాదళానికి, ఈ ప్రాజెక్టులకు పనిచేసిన శాస్త్రవేత్తలకూ, ఇంజనీర్లకూ, కార్మికులకూ, నా ప్రియమైన దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రే యుద్ధ నౌకలను నావికాదళంలోకి ప్రవేశపెట్టిన ప్రధాని
June 21st, 12:50 pm
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో గల శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి, నిర్మించిన మూడు యుద్ధనౌకలను అధికారికంగా నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. వీటిలో అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్ఎస్ దూనగిరి', పెద్ద సర్వే నౌక 'ఐఎన్ఎస్ సంశోధక్’, జలాంతర్గామి నిరోధక నౌక 'ఐఎన్ఎస్ అగ్రే'లు ఉన్నాయి. ఈ నౌకల చేరిక భారత కార్యాచరణ సామర్థ్యాలను గణనీయంగా పెంచడమే కాకుండా సముద్రాలపై నిఘాను బలోపేతం చేస్తుంది. అలాగే భౌగోళిక రాజకీయ ముప్పుల నుంచి మన తీరప్రాంత జలాలకు రక్షణను మరింత పటిష్ఠం చేస్తుంది. ఈ మూడు నౌకలను భారత నావికాదళానికి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో' రూపొందించగా కోల్‌కతాలోని 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్, ఇంజనీర్స్' (జీఆర్ఎస్‌ఈ) సంస్థ నిర్మించింది. వీటి నిర్మాణంలో 200కు పైగా ఎంఎస్ఎంఈలతో కూడిన భారతీయ పరిశ్రమలు విస్తృతంగా భాగస్వామ్యమయ్యాయి. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానం లేదా పరికరాలను కలిగి ఉన్న ఈ నౌకలు 'ఆత్మనిర్భరత' పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి.మార్కెటింగ్ సీజన్ 2026-27లో ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు క్యాబినెట్ ఆమోదం
May 13th, 03:23 pm
మార్కెటింగ్ సీజన్ 2026-27లో 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను పెంచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహరాలపై క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది.టీఎంసీ కేవలం దూషిస్తుంది, బెదిరిస్తుంది, అబద్ధాలు ప్రచారం చేస్తుంది: పశ్చిమ బెంగాల్‌లోని బ్యారక్‌పూర్‌లో ప్రధాని మోదీ
April 27th, 12:00 pm
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బ్యారక్‌పూర్‌లో జరిగిన భారీ సభలో ప్రసంగించి, తన శక్తివంతమైన, భావోద్వేగపూరిత ప్రసంగంతో జనసమూహంలో ఉత్సాహాన్ని నింపారు. చరిత్ర నుండి వర్తమానం వరకు ప్రస్తావిస్తూ, 1857 నాటి భారతదేశపు మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి పుట్టినిల్లు అయిన బ్యారక్‌పూర్ వారసత్వాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు, దానిని మరోసారి మార్పుకు ప్రతీకగా నిలిపారు. బెంగాల్‌లో మార్పుకు బ్యారక్‌పూర్ మార్గం సుగమం చేస్తోంది అని ఆయన అన్నారు.ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం బ్యారక్‌పూర్‌ను ఉత్తేజపరిచింది
April 27th, 11:30 am
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు బ్యారక్‌పూర్‌లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించి, తన శక్తివంతమైన, భావోద్వేగభరితమైన ప్రసంగంతో జనసమూహాన్ని ఉత్తేజపరిచారు. చరిత్ర నుండి వర్తమానం వరకు ప్రస్తావిస్తూ, 1857 నాటి భారతదేశపు మొదటి స్వాతంత్ర్య యుద్ధానికి పుట్టినిల్లు అయిన బ్యారక్‌పూర్ వారసత్వాన్ని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు, దానిని మరోసారి మార్పుకు ప్రతీకగా నిలబెట్టారు. బెంగాల్‌లో మార్పుకు బ్యారక్‌పూర్ మార్గం సుగమం చేస్తోంది అని ఆయన అన్నారు.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
March 24th, 02:05 pm
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, దాని వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు, నేను పార్లమెంటు ఎగువ సభ ముందు, నా తోటి పౌరుల ముందు నిలబడి, ఈ ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాను. మూడు వారాలకు పైగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మన వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లాంటి అత్యవసర వస్తువుల సాధారణ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. వారి భద్రత, జీవనోపాధి భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇది కూడా భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, రాజ్యసభ నుంచి శాంతి, చర్చల ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజెప్పేలా ముక్తకంఠంతో మన స్వరం వినిపించడం అవసరం.పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలను ఉద్దేశించి రాజ్యసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 24th, 02:00 pm
పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ, ఇవాళ రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మూడు వారాలుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొందని, ఇది భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘర్షణలు భారత వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపుతున్నట్లు పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ, అక్కడ పనిచేస్తున్నారని.. వారి భద్రత, జీవనోపాధి ప్రధానంగా ఆందోళన కలిగించే అంశంగా మారినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన విదేశీ నౌకల్లో అధిక సంఖ్యలో భారత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అత్యంత అవసరం అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేసారు.గత ప్రభుత్వాలు దశాబ్దాలుగా మత్స్యకారులను నిర్లక్ష్యం చేశాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వారిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, వారి సామర్థ్యాలను అపరిమితంగా పెంచుతోంది: ప్రధాని
March 11th, 01:00 pm
అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సంస్థ మత్స్యకారులకు 50 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. కేరళ వ్యాప్తంగా ఉన్న సభ్యులను, మత్స్యకారులను అభినందిస్తూ, ప్రధాని ఇలా పునరుద్ఘాటించారు, “ఐదు దశాబ్దాలుగా, ఈ సంస్థ మత్స్యకారుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం పనిచేసింది. ఈ ప్రయాణం మీ కృషి, అంకితభావం మరియు సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.”అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు
March 11th, 12:30 pm
అఖిల కేరళ ధీవర సభ స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ సంస్థ మత్స్యకారులకు 50 ఏళ్ల సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక మైలురాయి అని అన్నారు. కేరళ వ్యాప్తంగా ఉన్న సభ్యులను, మత్స్యకారులను అభినందిస్తూ, ప్రధాని ఇలా పునరుద్ఘాటించారు, “ఐదు దశాబ్దాలుగా, ఈ సంస్థ మత్స్యకారుల హక్కులను పరిరక్షించడానికి నిరంతరం పనిచేసింది. ఈ ప్రయాణం మీ కృషి, అంకితభావం మరియు సేవా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.”న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధానమంతి ప్రసంగానికి తెలుగు అనువాదం
January 27th, 04:32 pm
ఇండియన్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్‌లో యూరోపియన్ యూనియన్ మండలి, కమిషన్ అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య పర్యటన కాదు. ఇది భారత్-యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో కొత్త శకానికి నాంది పలికింది. భారత గణతంత్ర దినోత్సవాల్లో యూరోపియన్ యూనియన్ నాయకులు ముఖ్య అతిధులుగా పాల్గొనడం ఇదే తొలిసారి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కుదరిన ఒప్పందం దేశ చరిత్రలోనే అతి పెద్ద ఎఫ్‌టీఏ. ఈ రోజు ఇండియా-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరమ్‌లో పెద్ద సంఖ్యలో సీఈవోలు పాల్గొన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయానికి చిహ్నాలుగా నిలుస్తున్నాయి.న్యూఢిల్లీలో జరిగిన ఇండియా-ఈయూ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 27th, 04:30 pm
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్-యూరోపియన్ యూనియన్ బిజినెస్ ఫోరంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండియా-యూరోపియన్ యూనియన్ (ఈయూ) బిజినెస్ ఫోరంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. భారత్‌లో యూరోపియన్ యూనియన్ కౌన్సిల్, కమిషన్ల అధ్యక్షుల పర్యటన సాధారణ దౌత్య సందర్శన కాదని, అది భారత్-ఈయూ సంబంధాల్లో నూతన శక ప్రారంభాన్ని సూచిస్తుందన్నారు. భారత గణతంత్ర దినోత్సవాల్లో ఈయూ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం ఇదే తొలిసారని శ్రీ మోదీ వెల్లడించారు. దేశ చరిత్రలో అతి పెద్ద స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాన్ని భారత్, యూరోపియన్ యూనియన్ కుదుర్చుకున్నాయని తెలియజేశారు. అనేక మంది సీఈవోలతో పెద్ద స్థాయిలో భారత్-యూరోపియన్ యూనియన్ వ్యాపార వేదికను నిర్వహించామన్నారు. ఈ విజయాలన్నీ ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య ఏర్పడిన అపూర్వమైన సమన్వయాన్ని సూచిస్తున్నాయని వివరించారు.భారత్-ఒమన్ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 18th, 04:08 pm
ఏడేళ్ల తర్వాత ఒమన్‌ను సందర్శించటం, ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం లభించటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా.భారత్ ఒమన్ వాణిజ్య వేదికకు హాజరైన ప్రధానమంత్రి
December 18th, 11:15 am
మస్కట్ లో జరిగిన భారత్- ఒమన్ వాణిజ్య వేదికను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు. ఈ సమావేశానికి ఒమన్ వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ ఖైస్ అల్ యూసఫ్, ఒమన్ వాణిజ్య, పరిశ్రమల చాంబర్ చైర్మన్ శ్రీ షేక్ ఫైసల్ అల్ రావాస్, భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి శ్రీ పియూష్ గోయల్, సీఐఐ అధ్యక్షుడు శ్రీ రాజీవ్ మెమాని హాజరయ్యారు. ఈ వేదికలో రెండు దేశాల నుంచి ఇంధనం, వ్యవసాయం, రవాణా, మౌలిక సదుపాయాలు, తయారీ, ఆరోగ్యం, ఆర్థిక సేవలు, హరిత అభివృద్ధి, విద్య, అనుసంధాన రంగాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
November 25th, 10:20 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, అత్యంత గౌరవనీయులైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ శ్రీ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి శ్రీ ఆదిత్యనాథ్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు గౌరవనీయ మహంత్ శ్రీ నృత్య గోపాల్ దాస్, గౌరవనీయ సాధు సమాజం, ఇక్కడ హాజరైన భక్తులు సహా ఈ చారిత్రక సందర్భంలో దేశవిదేశాల నుంచి పాలు పంచుకుంటున్న కోట్లాది రామ భక్తులు సహా సోదరీసోదరులారా!అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 10:13 am
దేశ సామాజిక- సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లో ఓ చిరస్మరణీయ సందర్భాన్ని గుర్తుచేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పవిత్రమైన శ్రీరామ జన్మభూమి ఆలయ శిఖరంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ఎగురవేశారు. ఈ ధ్వజారోహణోత్సవం ఆలయ నిర్మాణం పూర్తవ్వడాన్ని సూచిస్తుంది. అలాగే భారత సాంస్కృతిక వేడుకలకు, జాతీయ ఐక్యతకు కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుపుతుంది. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. ‘‘నేడు యావత్ భారత్, ప్రపంచం శ్రీరాముడి స్ఫూర్తితో నిండిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రతి రామ భక్తుడి హృదయంలో ఒక ప్రత్యేక సంతృప్తి, అపారమైన కృతజ్ఞత, అనంతమైన ఆనందం ఉన్నాయని ఆయన అన్నారు. శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయని, శతాబ్దాల బాధ ముగిసిపోతోందని, శతాబ్దాల సంకల్పాలు నేడు నెరవేరుతున్నాయని తెలిపారు. ఇది 500 సంవత్సరాలుగా జ్వలిస్తూనే ఉన్న యజ్ఞానికి ముగింపు ఇది అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విశ్వాసంలో ఎప్పుడూ చలించని, నమ్మకంలో ఒక్క క్షణం కూడా విచ్ఛిన్నం కాని యజ్ఞం ఇది అని అన్నారు. నేడు శ్రీరాముడి గర్భగుడిలోని అనంతమైన శక్తి, శ్రీరాముడి కుటుంబ దివ్య వైభవం ఈ ధర్మ ధ్వజం రూపంలో అత్యంత దివ్యమైన, గొప్ప ఆలయంలో ప్రతిష్ఠించినట్లు స్పష్టం చేశారు.ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
January 15th, 11:08 am
జనవరి 15వ తేదీని సైనిక దినోత్సవంగా జరుపుకొంటాం. దేశాన్ని రక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన ప్రతి వీర సైనికుడికి నేను ఈ సందర్భంగా సెల్యూట్ చేస్తున్నాను, ఈ రోజున భరతమాత రక్షణలో నిమగ్నమైన సైనికులను, మహిళలను నేను అభినందిస్తున్నాను.PM Modi dedicates frontline naval combatants INS Surat, INS Nilgiri & INS Vaghsheer to the nation
January 15th, 10:30 am
PM Modi dedicated three frontline naval combatants, INS Surat, INS Nilgiri and INS Vaghsheer, to the nation on their commissioning at the Naval Dockyard in Mumbai. “It is for the first time that the tri-commissioning of a destroyer, frigate and submarine was being done”, highlighted the Prime Minister. He emphasised that it was also a matter of pride that all three frontline platforms were made in India.స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్ లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ పాఠం
January 03rd, 08:30 pm
లబ్ధిదారు: అవును సర్, దొరికింది. మీకు మేం చాలా కృతజ్ఞులమై ఉంటాం. గుడిసెలో నుంచి మంచి చోటుకు మమ్మల్ని తీసుకువచ్చారు మీరు. ఇంత మంచి చోటు దొరుకుతుందని మేం ఎన్నడూ అనుకోలేదు, మా కలను మీరు నిజం చేశారు.. అవును, సర్.