న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.రిపబ్లిక్ ప్లీనరీ సదస్సులో ప్రధాని ప్రసంగం
March 06th, 08:05 pm
మీరంతా అలసిపోయి ఉంటారు.. అర్నబ్ గొంతు వినీవినీ మీ చెవులూ అలసిపోయుంటాయి. కూర్చో అర్నబ్.. ఇంకా ఎన్నికల సీజన్ మొదలవలేదు. ముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రిపబ్లిక్ టీవీకి శుభాకాంక్షలు. ఇంత పెద్ద పోటీని నిర్వహించి క్షేత్రస్థాయిలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా వీరందరినీ మీరిక్కడికి తీసుకొచ్చారు. జాతీయ స్థాయి చర్చల్లో యువత భాగస్వామ్యం ఆలోచనల్లో కొత్తదనాన్ని రేకెత్తిస్తుంది. అది వ్యవస్థలో నవోత్తేజాన్ని నింపుతుంది. దాన్నే మనమిప్పుడు ఇక్కడ ఆస్వాదిస్తున్నాం. ఓ రకంగా యువత భాగస్వామ్యంతో బంధనాలన్నింటినీ విచ్ఛిన్నం చేయగలం, హద్దులకు అతీతంగా విస్తరించ గలం. దానితో అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదు. చేరుకోలేని గమ్యమంటూ ఏదీ లేదు. ఈ సదస్సు కోసం రిపబ్లిక్ టీవీ కొత్త ఆలోచనలతో పనిచేసింది. ఈ కార్యక్రమం విజయవంతమవడం పట్ల మీ అందరికీ అభినందనలు. మీకు నా శుభాకాంక్షలు. ఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉంది. ఒకటి- నేను కొన్ని రోజులుగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఆ లక్ష మందీ కూడా తమ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తులై ఉండాలి. కాబట్టి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు నా లక్ష్య సాధనకు రంగం సిద్ధం చేస్తున్నాయి. రెండు- వ్యక్తిగతంగా నాకో ప్రయోజనముంది. అదేమిటంటే 2029లో ఓటు వేయబోతున్న వారికి 2014కు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ఏ అంశాలుండేవో తెలియదు. పదీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవని వారికి తెలియదు. 2029లో ఓటు వేసే సమయానికి.. గతంతో పోల్చి చూసుకునే సదుపాయం వారికి ఉండదు. ఆ పరీక్షలో నేను పాసవ్వాలి. ఆ దిశగా యువతను సన్నద్ధులను చేసేలా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకుంది.PM Modi addresses Republic Plenary Summit 2025
March 06th, 08:00 pm
PM Modi addressed the Republic Plenary Summit in Delhi. Shri Modi highlighted that the world is now recognising this century as India's century and the country's achievements and successes have sparked new hope globally. He stated that India, once perceived as a nation that would sink itself and others, is now driving global growth.Politics is about winning people's hearts, says PM Modi in podcast with Nikhil Kamath
January 10th, 02:15 pm
Prime Minister Narendra Modi engages in a deep and insightful conversation with entrepreneur and investor Nikhil Kamath. In this discussion, they explore India's remarkable growth journey, PM Modi's personal life story, the challenges he has faced, his successes and the crucial role of youth in shaping the future of politics.పారిశ్రామికవేత్త నిఖిల్ కామత్‌తో తన తొలి పాడ్‌కాస్ట్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ
January 10th, 02:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన తొలి పాడ్‌కాస్ట్ ద్వారా పారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నిఖిల్ కామత్‌తో వివిధ అంశాలపై ముచ్చటించారు. ఈ సందర్భంగా తన బాల్యం గురించి వాకబు చేసినపుడు ఎలాంటి దాపరికం లేకుండా ఆయనతో చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. ఉత్తర గుజరాత్‌లోని మెహసానా జిల్లా పరిధిలోగల వద్‌నగర్ అనే చిన్న పట్టణంతో ముడిపడిన తన మూలాలను ప్రముఖంగా ప్రస్తావించారు. గైక్వాడ్ల రాజ్యంలో భాగమైన ఈ పట్టణం విద్యారంగంపై నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. అక్కడ ఓ చెరువు, తపాలా కార్యాలయం, గ్రంథాలయం వంటి సౌకర్యాలు కూడా ఉండేవని చెప్పారు. గైక్వాడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భాగవతాచార్య నారాయణాచార్య ఉన్నత పాఠశాలల్లో తన విద్యాభ్యాసం నాటి రోజులను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఈ జ్ఞాపకాల్లో భాగంగా ఒక ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఈ మేరకు వద్‌నగర్‌లో చాలాకాలం బసచేసిన చైనా తత్త్వవేత్త షాన్‌జాంగ్‌పై తీసిన చలన చిత్రం గురించి తానొకసారి చైనా రాయబార కార్యాలయానికి రాశానని గుర్తుచేసుకున్నారు. అలాగే 2014లో తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక ఒక అనుభవాన్ని ప్రస్తావిస్తూ- భారత పర్యటనకు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గుజరాత్‌లోని వద్‌నగర్ సందర్శనకు ఆసక్తి చూపారని తెలిపారు. తమ స్వస్థలాలతో షాన్‌జాంగ్‌కుగల చారిత్రక సంబంధాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించినట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ఉమ్మడి వారసత్వాన్ని, బలమైన సంబంధాలను ఈ అనుబంధం ప్రస్ఫుటం చేస్తున్నదని ఆయన అన్నారు.సంయుక్త ప్రకటన: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కువైట్ అధికారిక పర్యటన (డిసెంబరు 21-22)
December 22nd, 07:46 pm
గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 21-22 తేదీల్లో కువైట్ ను సందర్శించారు. ఆయన కువైట్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 21న కువైట్ లో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.కువైట్ ప్రధానితో ప్రధానమంత్రి భేటీ
December 22nd, 06:38 pm
రాజకీయాలు, వ్యాపారం, పెట్టుబడి, ఇంధనం, రక్షణ, భద్రత, ఆరోగ్యం, విద్య, టెక్నాలజీ, సాంస్కృతిక సంబంధాలు, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు సహా అనేక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలపర్చుకోవడానికి ఒక మార్గసూచీని రూపొందించుకోవడంపై నేతలిద్దరూ చర్చించారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని విస్తృతపర్చుకోవాలని వారు స్పష్టంచేశారు. ఇంధనం, రక్షణ, వైద్య పరికరాలు, ఫార్మా, ఫుడ్ పార్కులు, తదితర రంగాల్లో కొత్త కొత్త అవకాశాలను పరిశీలించడానికి భారతదేశానికి రావాల్సిందిగా కువైట్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఇతర ఆసక్తిదారులతో కూడిన ఒక ప్రతినిధివర్గాన్ని ప్రధాని ఆహ్వానించారు. సాంప్రదాయక మందులు, వ్యవసాయ పరిశోధన రంగాల్లో సహకారం అంశాన్ని కూడా నేతలు చర్చించారు. ఆరోగ్యం, శ్రమశక్తి, హైడ్రోకార్బన్ల రంగాల్లో ఇప్పటికే సంయుక్త కార్యాచరణ బృందాలు (జేడబ్ల్యూజీలు) పనిచేస్తుండగా, వీటికి అదనంగా సహకారంపై ఏర్పాటైన సంయుక్త సంఘం (జేసీసీ) పై ఇటీవల సంతకాలు చేయడాన్ని వారు స్వాగతించారు. వ్యాపారం, పెట్టుబడి, విద్య, టెక్నాలజీ, వ్యవసాయం, భద్రతలతో పాటు సాంస్కృతిక రంగాల్లో కొత్తగా జేడబ్ల్యూజీలను ఈ జేసీసీ పరిధిలో ఏర్పాటు చేశారు.ప్రధానమంత్రి కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు (డిసెంబరు 21-22, 2024)
December 22nd, 06:03 pm
ఈ ఎంఓయూ రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి సంస్థాగత రూపురేఖలను అందిస్తుంది. ఈ ఎంఓయూలో భాగంగా శిక్షణనివ్వడం, సిబ్బందికీ, నిపుణులకూ రెండు దేశాల్లోనూ పర్యటించే అవకాశాల్ని కల్పించడం, సైన్యపరంగా సంయుక్త విన్యాసాల్ని నిర్వహించడం, రక్షణ రంగ పరిశ్రమల్లో సహకరించుకోవడం, రక్షణ సామగ్రి సరఫరాలతోపాటు పరిశోధన -అభివృద్ధిలలో సహకారం, తదితర అంశాలు ఈ ఎంఓయూ పరిధిలో భాగంగా ఉన్నాయి.కువైట్ యువరాజుతో ప్రధాని భేటీ
December 22nd, 05:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సబాతో ఆదివారం సమావేశమయ్యారు. సెప్టెంబరులో యూఎన్జీఏ సమావేశం సందర్భంగా యువరాజుతో తన ఇటీవలి సమావేశాన్ని ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు.కువైట్ అమీరుతో ప్రధానమంత్రి భేటీ
December 22nd, 05:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్‌తో సమావేశమయ్యారు. ఈ నేతలిద్దరూ సమావేశం కావడం ఇది మొదటిసారి. బాయన్ ప్యాలెస్‌కు ప్రధాని చేరుకోవడంతోనే, కువైట్ ప్రధాని శ్రీ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ ఆయనకు సంప్రదాయబద్ధ పద్ధతిలో స్వాగతం పలికి, ప్యాలెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.ప్రధానమంత్రికి కువైట్ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం
December 22nd, 04:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-సబాహ్ ‘‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్’’ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారం కువైట్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం. ఈ కార్యక్రమంలో కువైట్ ప్రధాని శ్రీ షేక్ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ కూడా పాల్గొన్నారు.అరేబియన్ గల్ఫ్ కప్: కువైట్ అమీరు గౌరవ అతిథి హోదాలో హాజరైన ప్రధానమంత్రి
December 21st, 10:24 pm
కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమానికి అమీరు ‘గౌరవ అతిథి’ హోదాలో హాజరయ్యారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని కువైట్‌లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కువైట్ అమీరుతోనూ, యువరాజు, ప్రధానితోనూ కలిసి చూశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని కువైట్ నాయకత్వంతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.రామాయణ, మహాభారతాలు అరబిక్ భాషలోకి అనువాదం: శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లకు ప్రధానమంత్రి ప్రశంసలు
December 21st, 07:03 pm
రామాయణాన్ని, మహాభారతాన్ని అరబిక్ భాషలోకి అనువాదం చేసి ప్రచురించినందుకు శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.కువైట్‌లో కార్మికుల శిబిరాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
December 21st, 07:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటిస్తున్న సందర్భంగా తన మొదటి కార్యక్రమంలో భాగంగా అక్కడ మీనా అబ్దుల్లా ప్రాంతంలో ఉన్న ఒక కార్మికుల శిబిరానికి వెళ్లారు. అక్కడ దాదాపు 1500 మంది భారతీయ కార్మికులు పనిచేస్తున్నారు. ప్రధాని భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కలుసుకొని వారితో మాట్లాడి, వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ 'హలా మోదీ 'లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం
December 21st, 06:34 pm
నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!కువైట్‌లో ‘హలా మోదీ’ కార్యక్రమం: భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
December 21st, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ నగరంలో షేక్ సాద్ అల్-అబ్దుల్లా ఇండోర్ స్పోర్ట్‌స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమం ‘హలా మోదీ’లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కువైట్‌లోని విభిన్న వర్గాలకు చెందిన భారత జాతీయులు హాజరయ్యారు.ప్రధానమంత్రికి కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సముదాయం ఆత్మీయ స్వాగతం: సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాని
December 21st, 06:16 pm
కువైట్‌లో నివసిస్తున్న భారతీయ సముదాయం తనకు ఆత్మీయంగా స్వాగతం పలికినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారిలో ఉప్పొంగుతున్న శక్తి, ప్రేమ, భారత్ అంటే అచంచలమైన అనుబంధం నిజంగా ప్రేరణనిచ్చేవిగా ఉన్నాయని ఆయన అన్నారు.కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ
December 21st, 03:39 pm
కువైట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. 43 ఏళ్లలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. తన పర్యటనలో, ప్రధాని మోదీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ మరియు కువైట్ ప్రధానితో చర్చలు జరుపుతారు. అతను భారతీయ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతారు మరియు అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారుకువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం
December 21st, 09:21 am
’’గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సభా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేను ఈ రోజు కువైట్ బయల్దేరుతున్నాను.