ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం... విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి

April 16th, 09:50 am

ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.

మహారాష్ట్రలో నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్-కంట్రోల్డ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినెట్

December 31st, 03:06 pm

మహారాష్ట్రలోని నాసిక్-సోలాపూర్-అక్కల్‌కోట్ మధ్య 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ యాక్సెస్-కంట్రోల్డ్ రహదారిని నిర్మించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 374 కిలోమీటర్ల పొడవున్న ఈ కారిడార్‌ను రూ. 19,142 కోట్ల మూలధన వ్యయంతో బీఓటీ పద్ధతిలో నిర్మించనున్నారు. మ్యాప్‌లో చూపించినట్లుగా కర్నూలును అనుసంధానించే ఈ ప్రాజెక్టు.. నాసిక్, అహల్యానగర్, సోలాపూర్ వంటి ముఖ్యమైన ప్రాంతీయ నగరాలకు అనుసంధానతను అందిస్తుంది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ సూత్రం ప్రకారం సమగ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధిని సులభతరం చేసే విషయంలో ఈ ప్రాజెక్టు ఒక ముఖ్యమైన పురోగతిగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌‌లోని కర్నూలు జిల్లాలో దురదృష్టకర ఘటన.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

October 24th, 09:02 am

ఆంధ్రప్రదేశ్‌‌లోని కర్నూలు జిల్లాలో దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటన ప్రాణనష్టానికి దారితీసింది. దీనిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, ఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ పర్యటన వివరాలను పంచుకున్న ప్రధానిఆంధ్రప్రదేశ్ పర్యటన వివరాలను పంచుకున్న ప్రధాని

October 16th, 09:55 pm

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ మోదీ పూజలు చేశారు. శ్రీ శివాజీ ధ్యాన మందిర్, శ్రీ శివాజీ దర్బార్ హాలును సందర్శించారు. అనంతరం, రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు కర్నూల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం

October 16th, 03:00 pm

గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, ప్రజాదరణ పొందిన, కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు శ్రీ కె.రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని గారు, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఇతర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, పార్లమెంట్ సభ్యులు, ఎంఎల్ఏలు అందరికీ, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు...

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో రూ.13,430 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం.. కొన్నింటిని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 16th, 02:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో దాదాపు రూ.13,430 కోట్ల విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- తొలుత అహోబిలంలోని నరసింహ స్వామితోపాటు మహానందిలోని శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రణామాలు అర్పించారు. అలాగే సకలజన సౌభాగ్యం ఆకాంక్షిస్తూ మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు కోరారు.

అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్న ప్రధాని

October 14th, 05:48 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 16న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఉదయం 11:15 గంటల సమయంలో నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలతోపాటు దర్శనం చేసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు.