తమిళనాడు కృష్ణ ఒక టపాసుల ఫ్యాక్టరీలో జరిగిన దుర్ఘటన పట్ల సంతాపం ప్రకటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

July 29th, 04:32 pm

తమిళనాడులోని కృష్ణగిరిలో ఒక టపాసుల కర్మాగారంలో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన ఒక్కొక్కరి తరఫున, వారి వారసులకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్ కింద రెండు లక్షల రూపాయల పరిహారం , గాయపడిన వారికి 50 వేల రూపాయలు అందివ్వనున్నట్టు తెలిపారు.