శ్రీ కోట శ్రీనివాస రావు మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
July 13th, 03:55 pm
శ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రీ కోట శ్రీనివాసరావు తన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞతో సదా గుర్తుండిపోతారని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఆయన అన్ని తరాల ప్రేక్షకులను తన అద్భుత నటనా కౌశలంతో అలరించారన్నారు. సామాజిక సేవలోనూ ఆయన ముందంజలో ఉన్నారనీ, పేదలు, అణగారిన వర్గాల సాధికారత కోసం శ్రీ కోట శ్రీనివాస రావు కృషి చేశారని ప్రధానమంత్రి కొనియాడారు.