ఇంధన వనరుల భద్రతపై భారత్, కొరియా సంయుక్త ప్రకటన
April 20th, 10:56 pm
బహిరంగ, సమ్మిళిత, సంపన్న ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం ఉమ్మడి దార్శనికత కలిగిన ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వాములు భారత్, కొరియా.నౌకానిర్మాణం, షిప్పింగ్, నౌకా రవాణాపై భాగస్వామ్యానికి భారత్-ఆర్‌వోకే సమగ్ర విధానం
April 20th, 10:51 pm
భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా కొరియా రిపబ్లిక్ (ఆర్‌వోకే) అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యుంగ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో 2026 ఏప్రిల్ 20న సమావేశమయ్యారు. ఈ చర్చల్లో నౌకా నిర్మాణం, షిప్పింగు, నౌకా రవాణా భాగస్వామ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మధ్య పరస్పర ప్రయోజనకరమైన సహకారంపై ఉభయపక్షాలు ఫలవంతమైన, విస్తృతమైన ఆలోచనలను పంచుకున్నాయి.కొరియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటన
April 20th, 01:05 pm
భారతదేశానికి తొలిసారి వచ్చిన అధ్యక్షుడు లీని స్వాగతించడం ఎంతో సంతోషంగా ఉంది. . ఆయన జీవితం పట్టుదల, సేవ, అంకితభావాలకు స్ఫూర్తిదాయక నిదర్శనం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రజలకు సేవ చేయాలనే ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచింది. ఇది ఆయన తొలి భారత పర్యటన అయినప్పటికీ, మా మొదటి సమావేశం లోనే దేశంపై ఆయనకున్న అభిమానం, ఆత్మీయత స్పష్టంగా కనిపించింది.జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
June 18th, 03:17 pm
కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్, కొరియా రిపబ్లిక్ కలసి పనిచేయాలని కోరుకొంటున్నాయని శ్రీ మోదీ అన్నారు.కొరియా రిపబ్లిక్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు అభినందనలు తెలిపిన ప్రధాని
June 04th, 08:38 am
కొరియా రిపబ్లిక్ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ లీ జే-మ్యాంగ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.PM celebrates 50 years of diplomatic ties between India and Republic of Korea
December 10th, 12:23 pm
The Prime Minister, Shri Narendra Modi has conveyed his warm greetings to President of Republic of Korea, Mr. Yoon Suk Yeol on completing 50 years of establishment of diplomatic ties between India and Republic of Korea today.