గ్రాండ్‌మాస్టర్‌గా దివ్యా దేశ్‌ముఖ్…. అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

July 29th, 06:00 am

దివ్యా దేశ్‌ముఖ్ ‘ఫిడే’ మహిళల ప్రపంచ కప్-2025ను గెలుచుకోవడం ఒక్కటే కాకుండా గ్రాండ్‌మాస్టర్‌‌గా కూడా నిలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. ‘‘ఆమె సాధించిన విజయం ఎంతో మందికి ప్రేరణను ఇవ్వడంతో పాటు చదరంగ క్రీడ మన యువతలో ఇప్పటికన్నా మరింత ఎక్కువ ఆదరణ పొందడానికి తోడ్పడుతుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.

ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్-2025గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్‌కు ప్రధాని అభినందన

July 28th, 06:29 pm

ఫిడే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్-2025గా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. “కోనేరు హంపి కూడా ఛాంపియన్‌షిప్‌లో అపార ప్రతిభ కనబరిచారు. భవిష్యత్ ప్రయత్నాల దిశగా వారిద్దరికీ శుభాకాంక్షలు” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రితో చెస్ చాంపియన్ కోనేరు హంపి భేటీ

January 03rd, 08:42 pm

చదరంగ క్రీడలో విజేత కోనేరు హంపి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమయ్యారు. భారతదేశానికి గొప్ప గర్వకారణంగా నిలిచినందుకు కోనేరు హంపిని శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, ఆమె పదునైన మేధస్సు, అచంచల దృఢనిశ్చయం తేటతెల్లం అయ్యాయన్నారు.