గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

March 31st, 10:25 am

ఈ సభకు హాజరైన ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి గారు, పరమ పూజ్య ఆచార్య భగవంత్, పూజ్య సాధు భగవంత్, సాధ్విజీ భగవంత్, ఈ పవిత్ర సమావేశానికి హాజరైన అందరు ఆచార్యులు, ముని భగవంత్‌లు, గౌరవనీయ లోకోపకారులు, పండితులు, సోదరీ సోదరులారా!

మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

March 31st, 10:15 am

భగవాన్ మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని గాంధీనగర్, కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ జైన వారసత్వ మ్యూజియాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోబా తీర్థం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఎందరో జైన మునులు, సాధువుల తపస్సు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. సృజన, సేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.

మార్చి 31న పీఎం గుజరాత్ పర్యటన

March 30th, 11:05 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 31, 2026న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10 గంటలకు గాంధీనగర్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు అహ్మదాబాద్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత వావ్-థరాడ్‌లో సాయంత్రం సుమారు 4 గంటలకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.