పరివర్తనను తెచ్చేది జ్ఞానమే... ఓ సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
September 09th, 10:46 am
సమాజంతో సద్భావనను కలిగి ఉండే కళను జ్ఞానం నేర్పిస్తుందని ప్రస్తావిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జ్ఞానంతో వివేకాన్నీ, ధనాన్నీ పొందవచ్చును. జ్ఞానం.. మనసును ఆనందంతో నింపివేస్తుంది. ఫలితంగా వ్యక్తి ఆత్మగౌరవం పెంపొందుతుందని ప్రధానమంత్రి అన్నారు.జ్ఞానానికి ఉన్న ప్రాధాన్యాన్ని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
September 08th, 07:51 am
జ్ఞానానికి సంబంధించిన ఏ శాఖ నుంచి అయినా సరే.. అది చిన్నది గాని లేక పెద్దది గాని.. వివేకం గల వారు, బుద్ధిమంతులు దాని సారాన్ని గ్రహించాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ప్రతి మూలం నుంచి విలువైన జ్ఞానాన్ని వ్యక్తి పొంది, మనసులోకి తీసుకోవాలని అవసరం ఎంతయినా ఉందని ఆయన స్పష్టం చేశారు.జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి ముఖాముఖి
September 05th, 10:00 am
లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో జాతీయ ఉపాధ్యాయ పురస్కార విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న సమావేశమయ్యారు. ఈ ఏడాది మూడు విభాగాలకు చెందిన మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలను జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగానికి చెందిన 48 మంది ఉపాధ్యాయులు, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు/ఫ్యాకల్టీ సభ్యులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వశాఖకు చెందిన 13 మంది నైపుణ్య శిక్షకులు ఉన్నారు.ప్రధానమంత్రి అధ్యక్షతన జలభద్రత జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమం
September 02nd, 09:00 pm
జల భద్రతపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన రెండు రోజుల జాతీయ సదస్సు ఇవాళ ముగిసిన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.ప్రపంచ సంస్కృత దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు
August 28th, 12:06 pm
ప్రపంచ సంస్కృత దినోత్సవంతోపాటు ఈ రోజు శ్రావణపూర్ణిమ కావడంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతల నిరంతర వాహినియైన సంస్కృతం శాశ్వతత్వం ఘనతను మనం ఇవాళ వేడుక చేసుకుంటున్నామని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. “ఈ ప్రత్యేక పర్వదినం నాడు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం అభ్యసించే, బోధించే ప్రతి ఒక్కరినీ మనం అభినందిద్దాం. వారందరూ ఈ భాషలోని అక్షయ నిధిని భవిష్యత్తరాలకు వారసత్వంగా ప్రసాదించేందుకు అవిరళ కృషి చేస్తున్నారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.ఒక వ్యక్తి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే ఎనిమిది ముఖ్యమైన గుణాలను వివరిస్తూ ప్రధాని మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.
August 11th, 08:11 am
ఒక వ్యక్తి జీవితాన్ని ప్రకాశవంతం చేసి, వ్యక్తిత్వాన్ని నిర్మించే ఎనిమిది గుణాలను వివరిస్తూ ప్రధాని మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు. వాటిలో వివేకం, సత్ప్రవర్తన, ఆత్మనిగ్రహం, జ్ఞానం, ధైర్యం, వాక్చాతుర్యం, ఉదారత, కృతజ్ఞత ఉన్నాయి.Prime Minister shares Sanskrit Subhashitam highlighting the role of teachers on Guru Purnima
July 29th, 08:20 am
PM Modi extends Guru Purnima greetings and shares a Sanskrit Subhashitam highlighting the invaluable role of teachers in shaping lives. He reflects on how Gurus inspire, guide, educate and awaken wisdom, encouraging everyone to make their ideals a guiding force in life.విజ్ఞానం, నైపుణ్యాలు, ఆరోగ్యం గురించి వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధాని
July 15th, 12:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంస్కృత శ్లోకాన్ని పంచుకున్నారు. విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారత భవిష్యత్తును తీర్చిదిద్దడంలో దేశ యువత బలమైన శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఈ లక్షణాలు వ్యక్తులను శక్తిమంతం చేయడమే కాకుండా.. దేశాభివృద్ధికి గణనీయమైన రీతిలో తోడ్పాటును అందిస్తాయి.India and Indonesia are connected not only by our history but also by a shared future: PM Modi at community programme in Jakarta
July 07th, 11:47 pm
Addressing the Indian community in Jakarta, PM Modi thanked the diaspora for their warm welcome and praised their contribution to Indonesia's progress and their role as a living bridge between the two nations. He spoke about India's rapid transformation and called upon the community to contribute towards the shared aspirations of Viksit Bharat 2047 and Indonesia Emas 2045.జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి
July 07th, 05:30 pm
ఈ సందర్భంగా ఆహూతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధానమంత్రి.. తమకు లభించిన ఉత్సాహభరిత స్వాగతానికి గాను భారతీయ సమాజానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షుడు ప్రబోవోకు ప్రధాని కృతజ్ఞతలు చెబుతూ... ఆయనను ఒక గొప్ప నాయకుడుగా, భారత దేశానికి నిజమైన మిత్రుడిగా అభివర్ణించారు. ఇండోనేషియా పురోగతి, శ్రేయస్సులో ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారాన్ని ఇరు దేశాల మధ్య మైత్రికి ప్రతీకగా అభివర్ణించారు. పరస్పర విశ్వాసం, భాగస్వామ్య వారసత్వం, సముద్ర అనుబంధాల ఆధారంగా ఇండోనేషియాతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రాచీన నాగరికత సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. బాలి యాత్ర, వైశాఖ పూర్ణిమ తీర్థయాత్ర వంటి సంప్రదాయాలతో పాటు ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం ద్వారా కొనసాగుతున్న ఆధునిక అనుసంధానాలు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న వైవిధ్యభరిత, ఉత్సాహభరిత సంబంధాలను నిరంతరం పెంపొందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇండోనేషియా పార్లమెంటులో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
July 07th, 03:15 pm
ఇండోనేషియా ప్రజలు – చిన్నారులు, యువత, మహిళలు - ఈ రోజును నా జీవితంలో మరచిపోలేని రోజుల్లో ఒకటిగా మార్చారు. ఈ ఉదయం ఇండోనేషియా ప్రజల నుంచి నాకు దక్కిన ఆత్మీయత, అనురాగం, సాదర స్వాగతాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఈ ఉదయం అధ్యక్షులు ప్రబోవో కాపీరైట్ గురించి మాట్లాడారు. ప్రేమ, ఆత్మీయత, స్నేహం, పరస్పర గౌరవంపై ఎవరూ కాపీరైట్‌ను క్లెయిము చేయలేరని చెప్పాను. అధ్యక్షులు ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్‌కి సంబంధించిన అన్ని హద్దులను అధిగమించింది.ఇండోనేషియా పార్లమెంటును ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 07th, 03:00 pm
ఈ సందర్భంగా ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సమావేశానికి విచ్చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రభోవో సుబియాంటోకు ధన్యవాదాలు తెలిపారు. తనకు సాదర ఆహ్వానం పలకడమే కాకుండా భారత్-ఇండోనేషియా భాగస్వామ్యానికి ఎంతో కృషి చేస్తున్న పార్లమెంటు స్పీకర్ శ్రీమతి పువాన్ మహారాణికి కృతజ్ఞతలు తెలియజేశారు. 140 కోట్ల మంది భారత ప్రజల తరపున అక్కడి ఎంపీలకు శుభాకాంక్షలు అందజేశారు. ప్రజాస్వామ్యానికి పట్టునిల్లు అయినటువంటి భారత్.. ఇండోనేషియాతో ఉన్న ప్రజాస్వామ్య బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షిస్తోందని పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య ఉన్న లోతైన చారిత్రక, నౌకా వాణిజ్య సంబంధాలను ఆయన ప్రస్తావించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా పరస్పర భావాలు, వాణిజ్యం, సంస్కృతి, విశ్వాసాల ద్వారా భారత్, ఇండోనేషియాలను హిందూ మహాసముద్రం అనుసంధానిస్తోందని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. భారత్‌కు చెందిన వసుధైక కుటుంబం, ఇండోనేషియాకు చెందిన భిన్నేక తుంగల్ ఇక (భిన్నత్వంలో ఏకత్వం) వంటి ఉమ్మడి ఆదర్శాలను ప్రధాని ప్రస్తావించారు. ఈ విలువలే రెండు దేశాల భాగస్వామ్యానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పారు. ఉమ్మడి చారిత్రక నేపథ్యం, సవాళ్లు, ఇరు దేశాల ప్రజల ఆకాంక్షలు భారత్, ఇండోనేషియాలను సహజసిద్ధమైన, నమ్మకమైన భాగస్వాములుగా మార్చాయని పేర్కొన్నారు.మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధాని
June 28th, 10:38 am
మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ చరిత్రలోనే ఒక క్లిష్టమైన కాలంలో భారత ప్రగతికి పీవీ నరసింహారావు గారు చేసిన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.జ్ఞానం, వివేకం, దూరదృష్టిల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
June 19th, 08:15 am
జ్ఞానం, వివేకం, దూరదృష్టి.. ఈ గుణాలు మనిషి జీవితంలో విజయానికి మూలస్తంభాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ గుణాలను అలవరుచుకున్న వ్యక్తులు అత్యంత కఠిన సవాళ్లను కూడా అధిగమించి విజేతలుగా నిలుస్తారని ప్రధాని తెలిపారు.సత్యం, సేవ, జ్ఞానం, కర్మ.. ఈ సుగుణాలను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
June 18th, 09:23 am
సత్యానికి కట్టుబడి ఉంటే సంపద, నిస్వార్థంగా సేవలను అందిస్తే కీర్తి, నిరంతర అభ్యాసం ద్వారా జ్ఞానం, కర్మలతో వివేకం లభిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సుగుణాలు మనిషి స్వభావాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్రను పోషించడంతో పాటు, సమాజ పురోగతిలో కూడా కీలక పాత్రను పోషిస్తాయని ఆయన తెలిపారు.వివేకానికీ, ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడానికీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
June 16th, 08:53 am
ధైర్యం, వివేకం, దూరదృష్టి కలిగి ఉంటూ చేసే పనులతో సంతోషం, సౌభాగ్యం సిద్ధిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి నిర్ణయాన్నీ ఎంతో ఆలోచించి తీసుకోవాలనీ, ముందువెనుక ఆలోచించి చేసే పనులే విజయాన్ని అందిస్తాయనీ ఆయన తెలిపారు.నూతన ఆవిష్కరణలలో, ఔత్సాహిక పారిశ్రామికత్వంలో వైవిధ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని
June 15th, 08:55 am
నూతన ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామికత్వం.. ఈ రంగాల్లో ఉండే ప్రతి వ్యక్తికీ ఆలోచనా విధానం విభిన్నంగా, ప్రత్యేక సృజనాత్మక దృష్టికోణం ఉంటుందనీ, ఇవి కొత్త అవకాశాలకు బాట వేస్తాయనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. నీరు అది పుట్టిన చోటును బట్టి ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటున్నట్లే, ప్రతి ఒక్క ప్రతిభాశాలికీ తనదైన విశిష్ట గుర్తింపుతో పాటు తోడ్పాటు కూడా ఉంటుందని ఆయన తెలిపారు. వేర్వేరు ఆలోచనల, సామర్థ్యాల కలయికతోనే నూతన ఆవిష్కరణ, పురోగతీ సాధ్యపడతాయని కూడా ప్రధానమంత్రి అన్నారు.'మన్ కీ బాత్'లో వేసవి తాపాన్ని తట్టుకోవడానికి చిట్కాలను పంచుకున్న ప్రధాని మోదీ; పౌరులు తగినంత నీరు తాగుతూ ఉండాలని సూచన.
May 31st, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మరోసారి మీతో కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అద్భుతమైన పనులు చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అథ్లెటిక్స్‌లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. కొన్ని రోజుల కిందట జార్ఖండ్‌లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగు వేర్వేరు ఈవెంట్లలో నాలుగు జాతీయ రికార్డులను నెలకొల్పారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాలలో కొత్త రికార్డులను నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు.మార్పు తెచ్చే శక్తి వాస్తవిక జ్ఞానానికి ఉందని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
May 26th, 09:20 am
సిసలైన జ్ఞానం దేశం, సమాజంతో పాటు పూర్తి మానవజాతి సంక్షేమానికి కూడా బాటను వేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మన జ్ఞానం, మనం చేసే పనులు యావత్తు మానవాళికి స్ఫూర్తిని అందించేవిగా ఉండడం ముఖ్యమని ఆయన అన్నారు.నిరంతర కృషి విలువను చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
May 18th, 02:04 pm
నిరంతరం కృషి చేస్తూ ఉంటే క్రమ క్రమంగా విద్యనీ, ధర్మాన్నీ, ధనాన్నీ మనిషి సంపాదించుకోవచ్చని స్పష్టం చేసే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.