గౌరవ బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను నాటిన ప్రధానమంత్రి

September 19th, 05:24 pm

గౌరవ బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III బహుమతిగా ఇచ్చిన కదంబ మొక్కను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు 7 లోక్‌ కళ్యాణ్‌ మార్గ్‌లోని తన అధికారిక నివాసంలో నాటారు. ‘‘పర్యావరణ పరిరక్షణ, సుస్థిరతపై గౌరవ చార్లెస్‌ కు ఎంతో నిబద్ధత ఉంది. ఈ అంశం మా చర్చల్లో కూడా ప్రస్తావనకు వచ్చింది.’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.

బ్రిటన్ గౌరవ కింగ్ ఛార్లెస్ III తో ప్రధానమంత్రి భేటీ

July 24th, 11:00 pm

బ్రిటన్ రాజు గౌరవ ఛార్లెస్ IIIని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కలుసుకొన్నారు. రాజు గారి వేసవి నివాసం శాండ్రింఘమ్ ఎస్టేట్‌లో ఆయనతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు.

యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని ప్రకటన

July 23rd, 01:05 pm

భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతిని సాధించింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, సుస్థిరత, ఆరోగ్యం, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో మన సహకారం విస్తరించింది. గౌరవ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో జరిపే సమావేశంలో రెండు దేశాల్లోనూ సంక్షేమాన్ని, వృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈ పర్యటనలో గౌరవ కింగ్ ఛార్లెస్ IIIతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నా.

యునైటెడ్ కింగ్‌డమ్ మరియు మాల్దీవులకు ప్రధానమంత్రి పర్యటన (జూలై 23 - 26, 2025)

July 20th, 10:49 pm

ప్రధాని మోదీ జూలై 23 - 26 వరకు యుకే కి అధికారిక పర్యటన మరియు మాల్దీవులకు రాష్ట్ర పర్యటన చేస్తారు. ఆయన పిఎం స్టార్మర్‌తో విస్తృత చర్చలు జరుపుతారు మరియు వారు సీఎస్పి పురోగతిని కూడా సమీక్షిస్తారు. జూలై 26న జరిగే మాల్దీవుల స్వాతంత్ర్య 60వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ 'గౌరవ అతిథి'గా ఉంటారు. ఆయన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజును కలుస్తారు మరియు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చలు జరుపుతారు.

యునైటెడ్ కింగ్‌డమ్ రాజు చార్లెస్ - III తో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 19th, 06:15 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిటన్ రాజు చార్లెస్ - III తో ఈరోజు మాట్లాడారు.