బీహార్లోని రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సవం నాడు పురుషుల హాకీ ఆసియా కప్ 2025 మొదలవుతున్న సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు

August 28th, 09:33 pm

బీహార్లోని చారిత్రక నగరం రాజ్‌గిర్‌లో జాతీయ క్రీడా దినోత్సమైన ఆగస్టు 29న ప్రారంభమయ్యే పురుషుల హకీ ఆసియా కప్ 2025‌లో ఆసియా వ్యాప్తంగా పాల్గొనే జట్లు, క్రీడాకారులు, అధికారులు, వారి అభిమానులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025, ఆసియా రగ్బీ యూ20 సెవెన్స్ ఛాంపియన్‌షిప్ 2025, ఐఎస్‌టీఏఎఫ్ సెపక్‌తక్రా ప్రపంచ కప్ 2024, మహిళ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోపీ 2024 లాంటి కీలకమైన టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా ఇటీవలి కాలంలో శక్తిమంతమైన క్రీడాకేంద్రంగా తనదైన ముద్ర వేసిన బీహార్‌ను అమిభనందించారు.

7వ ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

May 04th, 08:16 pm

బీహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, మన్సుఖ్ భాయ్, సోదరి రక్షా ఖడ్సే, శ్రీ రామ్ నాథ్ ఠాకూర్ జీ, బీహార్ ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి జీ మరియు విజయ్ కుమార్ సిన్హా జీ, హాజరైన ఇతర విశిష్ట అతిథులు, క్రీడాకారులు, కోచ్ లు, ఇతర సిబ్బంది నా ప్రియమైన యువ స్నేహితులు!

7వ ఖేలో ఇండియా యువజన క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

May 04th, 08:02 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు 7వ ఖేలో ఇండియా యువజన క్రీడలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, శిక్షకులు, క్రీడా సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు అసమాన ప్రతిభ, దృఢ సంకల్పం ప్రదర్శించారని ఆయన అభినందించారు. వారి అంకితభావం, కృషిని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- భారతీయ క్రీడా స్ఫూర్తిని నిలువెత్తున నిలపడంలో వారి పాత్రను ప్రశంసించారు. క్రీడాకారుల అద్భుత నైపుణ్యం, నిబద్ధతను స్పష్టం చేస్తూ- క్రీడలపై వారి మక్కువ, ప్రతిభకు పదును పెట్టుకోవడంలో వారి అకుంఠిత దీక్ష దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులోనూ వారి కఠోర శ్రమ నిరంతరం ఫలించాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

January 28th, 09:36 pm

నేడు దేవభూమి యువశక్తితో మరింత దివ్యంగా మారింది. బాబా కేదార్ నాథ్, బద్రీనాథ్, గంగామాత ఆశీస్సులతో జాతీయ క్రీడలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఏడాది ఉత్తరాఖండ్ ఏర్పడి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది యువత తమ సత్తా చాటబోతున్నారు. ఎంతో అందమైన ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ చిత్రం ఇక్కడ కనిపిస్తుంది. ఈసారి కూడా అనేక స్వదేశీ సంప్రదాయ క్రీడలను జాతీయ క్రీడల్లో చేర్చారు. ఈసారి జాతీయ క్రీడలు ఒక రకంగా హరిత క్రీడలు కూడా. ఇందులో పర్యావరణ హితమైన వస్తువులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. జాతీయ క్రీడల్లో అందుకునే పతకాలు, ట్రోఫీలన్నీ కూడా ‘ఇ-వ్యర్థాల‘తో తయారైనవే. పతకాలు సాధించిన క్రీడాకారుల పేరిట ఇక్కడ మొక్కలను కూడా నాటనున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ఆశిస్తూ ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు. ఈ అద్భుతమైన క్రీడోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ ధామికి, వారి బృందానికి, ఉత్తరాఖండ్ లోని ప్రతి పౌరుడికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలు ప్రారంభం

January 28th, 09:02 pm

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 38వ జాతీయ క్రీడలను ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఉత్తరాఖండ్ లో ఈ రోజు యువ శక్తి పొంగిపొరలుతోందంటూ అభివర్ణించారు. బాబా కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగ మాతల ఆశీర్వాదాలతో 38వ జాతీయ క్రీడలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇప్పటికి ఇది 25వ సంవత్సరం అని శ్రీ మోదీ ప్రధానంగా చెబుతూ, ఈ యువ రాష్ట్రంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన యువత తన ప్రతిభను చాటిచెప్పనుందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ సుందర చిత్రాన్ని ఆవిష్కరించిందని కూడా ఆయన ప్రశంసించారు. జాతీయ క్రీడల తాజా సంచికలో అనేక స్థానిక ఆటలను చేర్చారనీ, ‘హరిత క్రీడలు’ ఈ ఆటలపోటీకి ఇతివ‌ృత్తంగా ఉందనీ ఆయన చెప్పారు. ఈ ఇతివృత్తం గురించి ప్రధాని మరింతగా వివరిస్తూ, ఈ పోటీల సందర్భంగా ప్రదానం చేసే ట్రోఫీలు, పతకాలను ఎలక్ట్రానిక్ వ్యర్ధాల (ఈ-వేస్ట్)తో తయారు చేశారనీ, పతకాన్ని గెలిచే ప్రతి ఒక్క విజేత పేరుతో ఒక మొక్కను నాటనున్నారనీ ఆయన వెల్లడిస్తూ ఇది ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.

అందరి హృదయాల్లో రాముడు ఉన్నాడు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

January 28th, 11:30 am

మిత్రులారా! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్లాది మంది దేశ ప్రజలను కట్టిపడేసిందనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయంలో దేశంలోని చాలా మంది ప్రజలు రామభజనలను పాడి, శ్రీరాముని చరణాలకు సమర్పించుకున్నారు. జనవరి 22 సాయంత్రం యావద్దేశం రామజ్యోతులను వెలిగించి, దీపావళిని జరుపుకుంది. ఈ సమయంలో దేశం సామూహిక శక్తిని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన తీర్మానాలకు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని నేను దేశ ప్రజలను కోరాను. లక్షలాది మంది ప్రజలు భక్తితో తమ ప్రాంతాల్లోని ధార్మిక స్థలాలను శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను నాకు ఎంతో మంది పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.

తమిళనాడులోని చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

January 19th, 06:33 pm

తమిళనాడు గవర్నరు శ్రీ ఆర్.ఎన్.రవి గారు, ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె.స్టాలిన్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అనురాగ్ ఠాకూర్, ఎల్.మురుగన్ మరియు నిశిత్ ప్రామాణిక్, తమిళనాడు ప్రభుత్వంలో మంత్రులు ఉదయనిధి స్టాలిన్, భారతదేశం నలుమూలల నుండి ఇక్కడకు వచ్చిన నా యువ స్నేహితులు.

తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభ కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి

January 19th, 06:06 pm

తమిళనాడులోని చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు 2023 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే రూ.250 కోట్ల విలువ గల బ్రాడ్ కాస్టింగ్ రంగానికి చెందిన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. అయన ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని వీక్షించారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు గుర్తుగా ఇద్దరు అథ్లెట్లు అందించిన కాగడాను ఆయన నిర్దేశిత స్థలంలో ప్రతిష్ఠించారు.