ఛఠ్ పూజ‌లోని పవిత్ర ఖర్నా పూజ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

October 26th, 10:44 am

ఛఠ్ మహాపర్వంలో భాగంగా చేసుకునే 'ఖర్నా' పూజ శుభ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పవిత్ర పండగలో కఠోర ఉపవాసాలు, ఆచారాలను పాటించే వారందరికీ గౌరవప్రదంగా నమస్కరిస్తున్నట్లు తెలిపారు.