రబీ సీజను 2025- 26కు ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై పోషకాధారిత రాయితీ రేట్లను ఆమోదించిన మంత్రివర్గం

October 28th, 03:14 pm

రబీ సీజను 2025-26కు (01.10.2025 నుంచి 31.03.2026 వరకు వర్తించే) ఫాస్ఫేట్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువులపై పోషకాధారిత రాయితీ (ఎన్‌బీఎస్) రేట్లను ఖరారు చేయాలన్న ఎరువుల విభాగం ప్రతిపాదనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీనికి తాత్కాలికంగా సుమారు రూ.37,952.29 కోట్ల మేరకు నిధులను బడ్జెటు నుంచి సమకూర్చాల్సి ఉంటుంది. ఇది ఖరీఫ్ సీజను 2025కు అవసరమైన బడ్జెటు నిధుల కన్నా, దాదాపు రూ.736 కోట్లు ఎక్కువ.

న్యూఢిల్లీలో ఎంఎస్ స్వామినాథన్ శతజయంతి అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగం

August 07th, 09:20 am

మంత్రివర్గ సహచరుడు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ రమేశ్ చంద్... చాలా మంది స్వామినాథన్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడున్నారు... వారందరికీ కూడా సగౌరవంగా నమస్కరిస్తున్నాను. శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథులు, సోదరీ సోదరులారా!

PM Modi addresses the M.S. Swaminathan Centenary International Conference

August 07th, 09:00 am

PM Modi inaugurated and addressed the M.S. Swaminathan Centenary International Conference at ICAR PUSA in New Delhi. Calling Dr. Swaminathan a visionary who ensured India’s food security and turned science into service, PM Modi recalled his pioneering ideas like the Evergreen Revolution and bio-villages. The PM also launched the M.S Swaminathan Award for Food & Peace, reaffirming support for farmers.

Cabinet approves the Prime Minister Dhan-Dhaanya Krishi Yojana

July 16th, 02:51 pm

The Union Cabinet chaired by PM Modi has approved the “Prime Minister Dhan-Dhaanya Krishi Yojana” for a period of six years, beginning with 2025-26 to cover 100 districts. The scheme will result in higher productivity, value addition in agriculture and allied sector, local livelihood creation and also increase domestic production thereby achieving self-reliance (Atmanirbhar Bharat).

బీహార్‌లోని కారాకాట్‌లో వివిధ ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

May 30th, 11:29 am

బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ప్రజాదరణగల ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జీతన్ రామ్ మాంఝీ, శ్రీ లల్లన్ సింగ్, శ్రీ గిరిరాజ్ సింగ్, శ్రీ చిరాగ్ పాశ్వాన్, శ్రీ నిత్యానంద్ రాయ్, శ్రీ సతీష్ చంద్ర దూబే, శ్రీ రాజ్‌భూషణ్ చౌదరీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌదరీ, శ్రీ విజయ్ కుమార్ సిన్హా సహా కార్యక్రమానికి హాజరైన ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నా ప్రియ బీహార్ సోదరీసోదరులారా!

బీహార్‌లోని కారాకాట్‌లో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 30th, 10:53 am

బీహార్లోని కారాకాట్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రూ. 48,520 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. బీహార్ అభివృద్ధిని వేగవంతం చేసే అవకాశం తనకు దక్కిందని, ఈ పవిత్ర భూమిపై రూ. 48,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, భూమిపూజ చేశామని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించడానికి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. బీహార్ పట్ల వారికున్న అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు చెప్పారు. అన్ని సందర్భాల్లోనూ వారి మద్దతు తనకు లభించిందని అన్నారు. బీహార్‌లోని మాతృమూర్తులు, సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘వికసిత కృషి సంకల్ప్ అభియాన్’ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

May 29th, 06:45 pm

దేశంలోని రైతుల కోసం ఈ రోజు జగన్నాథ స్వామి ఆశీస్సులతో ‘వ్యవసాయాభివృద్ధి సంకల్ప కార్యక్రమం’ (వికసిత కృషి సంకల్ప్‌ అభియాన్‌) పేరిట విశిష్ట పథకానికి శ్రీకారం చుడుతున్నాం. రుతుపవనాలు వచ్చేశాయి... ఖరీఫ్ సాగుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మరో 12 నుంచి 15 రోజుల్లో శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన 2,000 బృందాలు దేశవ్యాప్తంగా గ్రామ సందర్శనకు బయల్దేరుతాయి. ఈ కార్యక్రమంపై 700కుపైగా జిల్లాల్లోని లక్షలాది రైతులకు ఈ బృందాలు అవగాహన కల్పిస్తాయి. ఈ విశిష్ట కార్యక్రమం, దీనిపై విస్తృత ప్రచారం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత వ్యవసాయ రంగ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ రైతులందరితోపాటు ప్రచార బృందాలకు నా శుభాకాంక్షలు.

వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 29th, 06:44 pm

ప్రధాన మంత్రి శ్రీ నరంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత కృషి సంకల్ప్ అభియాన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ వికసిత కృషి సంకల్ప్ అభియాన్ రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన ఒక ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. వర్షాకాలం దగ్గరపడుతున్న కొద్ది, ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లు చేయటం మొదలవుతున్న ప్రస్తుత తరుణంలో వచ్చే 12 నుంచి 15 రోజుల పాటు 2000 మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులు, ప్రగతిశీల రైతులతో కూడిన బృందాలు 700 లకు పైగా జిల్లాల్లో సందర్శించి లక్షల మంది రైతులను చేరుకుంటారని తెలిపారు. ఈ బృందాల్లో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన భారత వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు వారికి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.

2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పీ) ఆమోదించిన మంత్రివర్గం

May 28th, 03:49 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్ కోసం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరల (ఎంఎస్‌పీ) పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపింది.

బడ్జెట్ అనంతర వెబినార్‌లో వ్యవసాయం, గ్రామీణ శ్రేయస్సుపై ప్రధానమంత్రి ప్రసంగం

March 01st, 01:00 pm

బడ్జెట్ అనంతరం నిర్వహిస్తున్న ఈ వెబినార్‌లో మీరంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగమైన మీ అందరికీ నా ధన్యవాదాలు. మా ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన అనంతరం ప్రవేశపెట్టిన మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ మా విధానాల కొనసాగింపును మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన భారత్ దార్శనికతలో ముందడుగును కూడా చూపింది. బడ్జెట్‌కు ముందు మీరంతా అందించిన సలహాలు, సూచనలు ఈ బడ్జెట్ రూపకల్పనలో ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. సమర్థంగా ఈ బడ్జెట్‌ను అమలు చేయడం, అత్యుత్తమైన, వేగవంతమైన ఫలితాలను రాబట్టడం, అన్ని నిర్ణయాలు, విధానాలను సమర్థంగా రూపొందించడంలో మీ బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది.

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 01st, 12:30 pm

వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. బడ్జెట్ అనంతర వెబినార్ లో పాల్గొనడం ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం బడ్జెట్ తమ ప్రభుత్వ మూడో పదవీ కాలంలోని మొదటి పూర్తి స్థాయి బడ్జెట్‌ అని, ఇది విధానాలలో స్థిరత్వాన్ని ప్రదర్శించడంతో పాటు వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా కొత్త దృష్టికోణాన్ని విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్‌కు ముందు వివిధ వర్గాల నుంచి వచ్చిన విలువైన సూచనలు, సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ బడ్జెట్‌ను మరింత ప్రభావవంతంగా రూపొందించడంలో సంబంధిత వర్గాల పాత్ర మరింత కీలకమైనదిగా మారిందని ఆయనతెలిపారు.

2024-25 మార్కెటింగ్ కాలానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

June 19th, 09:14 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2024-25 మార్కెటింగ్ కాలానికి అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పి) పెంచడానికి ఆమోదం తెలిపింది.

ఖరీఫ్ సీజన్, 2024 (01.04.2024 నుండి 30.09.2024 వరకు) ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల కు పోషకాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిసి)రేటుల కు, మూడు క్రొత్త ఫెర్టిలైజర్ గ్రేడుల ను ఎన్‌బిఎస్ పథకం లో చేర్చడానికి ఆమోదాన్నితెలిపిన మంత్రిమండలి

February 29th, 04:28 pm

ఫాస్ఫేటిక్ మరియు పొటాసిక్ (పి&కె) ఎరువుల కు ఖరీఫ్ సీజను, 2024 (01.04.2024 నుండి 30.09.2024 వరకు) పోషక పదార్థాల ఆధారిత సబ్సిడీ (ఎన్‌బిఎస్) రేటుల ను ఖరారు చేయడాని కి సంబంధించి ఎరువుల విభాగం తీసుకు వచ్చిన ప్రతిపాదన ను, మూడు క్రొత్త గ్రేడులకు చెందిన ఎరువుల ను ఎన్‌బిఎస్ పథకం లో చేర్చడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఖరీఫ్ సీజను 2024 కు గాను రమారమి 24,420 కోట్ల రూపాయలు తాత్కాలిక బడ్జెటు రూపేణా అవసరం అవుతాయి.

కనీస మద్దతు ధరల పెంపుపై రైతుల హర్షం... ప్రధానమంత్రి సంతృప్తి

June 09th, 08:33 pm

కనీస మద్దతు ధరల పెంపుపై అన్నదాతల హర్షం ఎంతో సంతృప్తినిచ్చిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. ప్రభుత్వం మరింత ఉత్తేజంతో పనిచేయడానికి ఇదెంతో స్ఫూర్తినిస్తుందని ఆయన అభివర్ణించారు.

2023-24 మార్కెటింగ్ సీజన్ కి గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు కేంద్ర కాబినెట్ ఆమోదం

June 07th, 05:35 pm

ప్రధాని అధ్యక్షతన ఈరోజు జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం 2023-2024 మార్కెటింగ్ సీజన్ కు గాను ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలకు ఆమోదం తెలియజేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గ్లోబ ల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 లో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం...

February 10th, 11:01 am

ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌ శ్రీమంతి ఆనందిబెన్‌ పటేల్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యజి, బ్రజేష్‌ పాఠక్‌ జి, కేంద్ర కేబినెట్‌లో నా సీనియర్‌ సహచరులు, లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ జీ, వివిధ దేశాలనుంచి విచ్చేసిన ఘనతవహించిన ప్రతినిధులకు, ఉత్తరప్రదేశ్‌ కు చెందిన మంత్రులు అందరికీ, పరిశ్రమ వర్గాలకు చెందినవారికి, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమాజానికి, విధాన నిర్ణేతలు, కార్పొరేట్‌ నేతలు, ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హాజరైన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఈ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ముఖ్య అతిథిగా ఉంటూ మీ అందరికీ స్వాగతం పలికే బాధ్యతను నేను ఎందుకు తీసుకున్నానని మీ అందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, నాకు ఇక్కడ అదనపు బాధ్యత కూడా ఉంది. మీరందరూ నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే నేను ఉత్తరప్రదేశ్‌ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నాకు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్‌ ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత కూడా ఉంది. ఇవాళ నేను ఆ బాధ్యతను పూర్తి చేసేందుకు నేను ఇందులో భాగస్వామినయ్యాను. అందువల్ల భారతదేశం వివిధ ప్రాంతాలనుంచి అలాగే విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్‌ కు విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను.

ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ

February 10th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్‌ ట్రేడ్‌ షోను, ఇన్వెస్ట్‌ యుపి 2.0ను ప్రధానమంత్రి ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 అనేది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్‌షిప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌. దీని ద్వారా విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, అకడమిక్‌ రంగానికి చెందిన వారు, ప్రపంచవ్యాప్తంగా గల మేధావులు, నాయకులు, వ్యాపార అవకాశాలపై సమిష్టిగా చర్చించి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటారు.ఈ సమ్మేళనం సందర్భగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి స్వయంగా తిలకించారు.

CCEA approves Minimum Support Prices (MSP) for Kharif Crops for Marketing Season 2022-23

June 08th, 05:30 pm

CCEA chaired by PM Modi has approved increase in MSP for all mandated Kharif Crops for Marketing Season 2022-23. This has been done to ensure remunerative prices to the growers for their produce and to encourage crop persification.

చత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ప్రత్యేక లక్షణాలు గ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్రసంగ పాఠం

September 28th, 11:01 am

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ జీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బాఘేల్ జీ, కేబినెట్‌లో నా ఇతర సహచరులు శ్రీ పురుషోత్తం రూపాల జీ, శ్రీ కైలాష్ చౌదరి జీ, సోదరి శోభా జీ, ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ రమణ్ సింగ్ జీ, ప్రతిపక్ష నాయకుడు శ్రీ ధరమ్ లాల్ కౌశిక్ జీ, వ్యవసాయ విద్యతో సంబంధం ఉన్న విసిలు, డైరెక్టర్లు, శాస్త్రీయ సహచరులు మరియు నా ప్రియమైన రైతు సోదరీమణులు మరియు సోదరులు!

ప్రత్యేక లక్షణాలుగ‌ల 35 పంట రకాలను జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి

September 28th, 11:00 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ , ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలు గ‌ల 35 పంట ర‌కాల‌ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా దేశ‌ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. అలాగే ప్ర‌ధాన‌మంత్రి, రాయ్‌పూర్‌లో నూత‌నంగా నిర్మించిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్య‌ట్ ఆఫ్ బ‌యోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను దేశానికి అంకితం చేశారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యాల‌కు గ్రీన్ క్యాంప‌స్ అవార్డుల‌ను ప్ర‌దానం చేశారు. వ్య‌వ‌సాయంలో వినూత్న ప‌ద్ధ‌తుల‌ను వాడుతున్న రైతుల‌తోనూ, ఈ స‌మావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగించారు.