స్వదేశీ ఉత్పత్తులు, వోకల్ ఫర్ లోకల్ : మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పండుగ పిలుపు
September 28th, 11:00 am
ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, భగత్ సింగ్ మరియు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వారికి నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి, మహిళా సాధికారత, దేశవ్యాప్తంగా జరుపుకునే వివిధ పండుగలు, ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల ప్రయాణం, పరిశుభ్రత మరియు ఖాదీ అమ్మకాల పెరుగుదల వంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. దేశాన్ని స్వావలంబన చేసుకునే మార్గం స్వదేశీని స్వీకరించడంలోనే ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.29 జూన్ 2025 న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 123 వ భాగంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ అభినందనలు. మీరందరూ యోగా శక్తితో, అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలతో నిండిపోయి ఉండాలి. ఈసారి కూడా జూన్ 21వ తేదీన, మనదేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. మీకు గుర్తుందా! ఇది 10 సంవత్సరాల కిందట ప్రారంభమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలలో ఈ ధోరణి ప్రతి సంవత్సరం మరింత గొప్పగా మారుతోంది. ఎక్కువ మంది ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను అవలంబిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఈసారి యోగా దినోత్సవ ఆకర్షణీయమైన చిత్రాలను మనం చాలా చూశాం. విశాఖపట్న సముద్ర తీరంలో మూడు లక్షల మంది కలిసి యోగా చేశారు. మరో అద్భుతమైన దృశ్యం కూడా విశాఖపట్నం నుండే వచ్చింది. రెండు వేలకు పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేసిన దృశ్యమది. ఊహించుకోండి! ఎంత క్రమశిక్షణ, ఎంత అంకితభావం ఉండి ఉంటుందో! మన నావికాదళ నౌకల్లో కూడా గొప్ప యోగా ప్రదర్శన కనిపించింది. తెలంగాణలో మూడు వేల మంది దివ్యాంగులు కలిసి యోగా శిబిరంలో పాల్గొన్నారు. సాధికారతకు యోగా ఎలా మాధ్యమం అవుతుందో వారు నిరూపించారు. ఢిల్లీ ప్రజలు యోగాను పరిశుభ్రమైన యమునా సంకల్పంతో అనుసంధానించి, యమునా నది ఒడ్డుకు వెళ్లి యోగా చేశారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ వంతెన వద్ద కూడా ప్రజలు యోగా చేశారు. హిమాలయాల మంచు శిఖరాల్లో ఐటీబీపీ సైనికులు చేసిన యోగా కనిపించింది. సాహసం, సాధన కలిసి సాగాయి. గుజరాత్ ప్రజలు కూడా కొత్త చరిత్రను సృష్టించారు. వడ్ నగర్‌లో 2121 మంది కలిసి భుజంగాసనం వేసి కొత్త రికార్డు సృష్టించారు. న్యూయార్క్, లండన్, టోక్యో, పారిస్ మొదలైన ప్రపంచంలోని ప్రతి పెద్ద నగరం నుండి యోగా చిత్రాలు వచ్చాయి. ప్రతి చిత్రంలో ఒక విషయం ప్రత్యేకంగా ఉంది. శాంతి, స్థిరత్వం, సమతుల్యత ఆ చిత్రాల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఈసారి థీమ్ కూడా చాలా ప్రత్యేకమైంది. యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్.. అంటే 'ఒక భూమి - ఒక ఆరోగ్యం'. ఇది కేవలం నినాదం కాదు. ఇది 'వసుధైవ కుటుంబకం' అని మనల్ని అనుభూతి చెందించే దిశ. ఈ సంవత్సరం యోగా దినోత్సవ గొప్పతనం ఖచ్చితంగా ఎక్కువ మందిని యోగాను స్వీకరించడానికి ప్రేరేపిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.రోజ్ గార్ మేళా కింద 51,000 పైగా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 26th, 11:23 am
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 51,000 మందికి పైగా యువతకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను ఈరోజు జారీ చేశాం. కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో మీ యువతకు బాధ్యతల కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం మీ కర్తవ్యం. దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మీ కర్తవ్యం. కార్మికుల జీవితాల్లో మెరుగైన మార్పులు తేవడం మీ కర్తవ్యం. మీరు మీ విధులను ఎంత చిత్తశుద్ధితో, నిజాయితీగా నిర్వహిస్తే, అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ ప్రయాణంపై దాని ప్రభావం మరింత గణనీయంగా, సానుకూలంగా ఉంటుంది. మీరు మీ బాధ్యతలను అత్యంత అంకితభావంతో నిర్వహిస్తారని నేను విశ్వసిస్తున్నాను.ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 26th, 11:00 am
ఉద్యోగ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన వారికి 51,000కి పైగా నియామక పత్రాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించారు. భారత ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో యువతకు కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్గత భద్రతను పెంపొందించటం, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు దోహదపడటం, కార్మికుల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులు తీసుకురావడం వీరి బాధ్యతలని పేర్కొన్నారు. వారు తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో చూపించే చిత్తశుద్ధి.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానంగా పేర్కొన్నారు. విధుల నిర్వహించే విషయంలో ఈ యువత అత్యంత అంకితభావంతో ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.Important to maintain the authenticity of handloom craftsmanship in the age of technology: PM at Bharat Tex
February 16th, 04:15 pm
PM Modi, while addressing Bharat Tex 2025 at Bharat Mandapam, highlighted India’s rich textile heritage and its growing global presence. With participation from 120+ countries, he emphasized innovation, sustainability, and investment in the sector. He urged startups to explore new opportunities, promoted skill development, and stressed the fusion of tradition with modern fashion to drive the industry forward.భారత్ టెక్స్ 2025లో ప్రధానమంత్రి ప్రసంగం
February 16th, 04:00 pm
న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ రోజు ‘భారత్ టెక్స్ 2025’ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా ఆయన పరిశీలించారు. సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరికీ భారత్ టెక్స్‌కు ఆహ్వానం పలుకుతున్నానన్నారు. ఈ రోజు భారత్ మండపంలో భారత్ టెక్స్ రెండో సంచికను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మా దేశ సంప్రదాయాలను కళ్లకు కట్టడంతోపాటు వికసిత్ భారత్ సాధనకు ఉన్న అవకాశాలను కూడా చాటుతోందని, ఇది ఇండియాకు గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ‘‘భారత్ టెక్స్ ఇక మెగా గ్లోబల్ టెక్స్‌టైల్ ఈవెంట్‌గా ఎదుగుతోంది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు. వేల్యూ చైన్‌లో పాత్రధారులైన మొత్తం 12 సముదాయాలు ఈసారి ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్నాయని కూడా ఆయన తెలిపారు. దుస్తులు, అనుబంధ వస్తువులు (ఏక్సెసరీస్), యంత్ర పరికరాలు, రసాయనాలు, అద్దకం రంగులను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్న సంగతిని ఆయన ప్రస్తావించారు. ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన విధాన రూపకర్తలు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులు (సీఈఓలు), పరిశ్రమ నేతలకు వ్యాపారానికి, సహకారానికి, భాగస్వామ్యాల్ని ఏర్పరచుకోవడానికి ఒక బలమైన వేదికగా భారత్ టెక్స్ మారుతోందని ప్రధానమంత్రి ప్రధానంగా చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తోడ్పాటును అందిస్తున్న ఆసక్తిదారులందరి కృషిని ఆయన ప్రశంసించారు.అంతర్జాతీయ సహకార సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
November 25th, 03:30 pm
మీ అందరికీ ఈరోజు నేను స్వాగతం పలుకుతున్నానంటే, అది నేనొక్కడిని చేసింది కాదు.. నిజానికి నేనొక్కడినే చేయలేను కూడా. భారత్ లోని లక్షలాది మంది రైతులు, లక్షలాది మంది పశుపోషకులు, దేశంలోని మత్స్యకారులు, 8 లక్షలకు పైగా సహకార సంఘాలు, స్వయంసహాయక సంఘాల్లోని 10 కోట్ల మంది మహిళలు, సహకార సంఘాలను సాంకేతికతతో అనుసంధానిస్తున్న భారత యువత తరఫున – మిమ్మల్ని నేను భారత్ కు ఆహ్వానిస్తున్నాను.2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సుని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 25th, 03:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024-ఐసీఏ గ్లోబల్ సహకార సదస్సును ప్రారంభించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ, భూటాన్ ప్రధానమంత్రి శ్రీ దాషో షెరింగ్ టోబ్‌గే, ఫిజీ ఉప ప్రధాన మంత్రి శ్రీ మనోవా కమికామికా, కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, భారతదేశంలోని ఐక్యరాజ్యసమితి రెసిడెంట్ కోఆర్డినేటర్ శ్రీ షోంబీ షార్ప్, అంతర్జాతీయ సహకార సమితి అధ్యక్షుడు శ్రీ ఏరియల్ గార్కో, విదేశీ ప్రముఖులు తదితరులకు శ్రీ మోదీ స్వాగతం పలికారు.ఉపాధి సమ్మేళనంలో 51,000 మందికిపైగా అభ్యర్థులకు నియామకపత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 29th, 11:00 am
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మంత్రిమండలి సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేశవ్యాప్తంగాగల యువ మిత్రులు, సోదరసోదరీమణులారా!రోజ్‌గార్ మేళాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 29th, 10:30 am
వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు నియామకపత్రాలు అందించారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉద్యోగాలను కల్పించే అంశంలో ప్రధానమంత్రి కృతనిశ్చయాన్ని ఈ రోజ్‌గార్ మేళా తెలియజేస్తుంది. ఇది యువతకు తగిన అవకాశాలు కల్పించి జాతి నిర్మాణానికి సహకరిస్తుంది.ఖాదీ అమ్మకాల్లో కొత్త రికార్డు ప్రోత్సాహకరమైన విజయం: కొనియాడిన ప్రధాన మంత్రి
October 05th, 04:56 am
ఖాదీ అమ్మకాల్లో నమోదైన కొత్త రికార్డును ప్రోత్సాహకరమైన విజయంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొనియాడారు. దేశ ప్రజల్లో స్వదేశీ ధోరణి వేగంగా పెరుగుతోందని ఆయన అన్నారు.'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 28th, 11:30 am
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్.!!INDI-Agadhi plans to have five PMs in 5 years if elected: PM Modi in Solapur
April 29th, 08:57 pm
Prime Minister Narendra Modi today addressed a vibrant public meeting in Maharashtra’s Solapur. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”PM Modi's electrifying campaign trails reach Maharashtra's Solapur, Satara and Pune
April 29th, 02:05 pm
Prime Minister Narendra Modi today addressed vibrant public meetings in Maharashtra’s Solapur, Satara and Pune. Speaking to a large audience, PM Modi said, “In this election, you will choose the guarantee of development for the next 5 years. On the other hand, there are those who plunged the country into the abyss of corruption, terrorism, and misrule before 2014. Despite their tainted history, the Congress is once again dreaming of seizing power in the country.”Amrit Mahotsav created a gateway for India to enter into Amrit Kaal: PM Modi
March 12th, 10:45 am
PM Modi visited Sabarmati Ashram and inaugurated Kochrab Ashram and launched the Master plan of Gandhi Ashram Memorial. Sabarmati Ashram has kept alive Bapu’s values of truth and nonviolence, rashtra seva and seeing God's service in the service of the deprived”, he added.గుజరాత్ లోని సాబర్‌మతీ లో కొచ్‌రబ్ ఆశ్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 12th, 10:17 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సాబర్‌మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన కొచ్‌రబ్ ఆశ్రమాన్ని ప్రారంభించడం తో పాటు గాంధీ ఆశ్రమం స్మారకం తాలూకు మాస్టర్ ప్లాను ను ఆవిష్కరించారు. గాంధీ మహాత్ముని విగ్రహాని కి ప్రధాన మంత్రి పుష్పాంజలి ని సమర్పించారు. హృదయ్ కుంజ్ ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు. అక్కడ ఏర్పాటైన ఒక ప్రదర్శన ను పరిశీలించి, ఒక మొక్క ను నాటారు.Banas Kashi Sankul will give a boost to the income of more than 3 lakh farmers: PM Modi
February 23rd, 02:45 pm
Prime Minister Narendra Modi inaugurated and laid the foundation stone for multiple development projects worth more than Rs 13,000 crore in Varanasi. Addressing the gathering, the Prime Minister expressed gratitude for being present in Kashi once again and recalled being elected as the Parliamentarian of the city 10 years ago. He said that in these 10 years, Banaras has transformed him into a Banarasi.