ఢిల్లీలో నిర్వహించిన ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం
October 04th, 10:45 am
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, విదేశీ అతిథులు, టెలికాం రంగ ప్రముఖులు, వివిధ కళాశాలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన నా యువ మిత్రులు, సోదరీసోదరులారా!కౌశల్ దీక్షాంత్ సమరోహ్‌ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత లక్ష్యంగా రూ.62,000 కోట్లకు పైగా విలువైన కార్యక్రమాలు ప్రారంభం
October 04th, 10:29 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యువత అభివృద్ధి లక్ష్యంగా రూ. 62,000 కోట్లకు పైగా విలువైన పలు కార్యక్రమాలను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఐటీఐలతో అనుబంధం ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు, బీహార్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని సంవత్సరాల కిందటే ప్రభుత్వం ఐటీఐ విద్యార్థుల కోసం పెద్ద ఎత్తున స్నాతకోత్సవ వేడుకలను నిర్వహించే కొత్త సంప్రదాయాన్ని ప్రారంభించిందని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు ఆ సంప్రదాయంలో మరో ముందడుగును సూచిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.రూ.5862 కోట్లకు పైగా వ్యయంతో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాల (కేవీఎస్) ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం
October 01st, 03:43 pm
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య పెరిగిన దృష్ట్యా వారి పిల్లల విద్యావసరాలను తీర్చేందుకు దేశవ్యాప్తంగా ప్రజా విభాగంలో 57 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (కేవీ) ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. 2026-27 మధ్య తొమ్మిది సంవత్సరాల పాటు ఈ 57 కొత్త కేవీల ఏర్పాటు, నిర్వహణకు దాదాపు రూ. 5862.55 కోట్లు వ్యయమవుతుందన్న అంచనా ఉంది. ఇందులో రూ. 2585.52 కోట్లు (సుమారుగా) మూలధన వ్యయం కాగా.. రూ. 3277.03 కోట్లు (సుమారుగా) నిర్వహణ వ్యయం. ఎన్ఈపీ 2020కి ఆదర్శవంతమైన పాఠశాలలుగా నిలిచేలా మొదటిసారిగా ఈ 57 విద్యాలయాల్లో బాలవాటికలు అంటే 3 సంవత్సరాల ఫౌండేషన్ దశ సౌకర్యాలు (ప్రీ-ప్రైమరీ) ఉండనున్నాయి.పౌర, రక్షణ రంగాల కింద 85 నూతన కేంద్రీయ విద్యాలయాల ప్రారంభానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం:
December 06th, 08:01 pm
కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.కేంద్రీయ విద్యాలయ వజ్రోత్సవాల సందర్భంగా ప్రస్తుత-పూర్వ విద్యార్థులు.. సిబ్బంది.. సహాయక సిబ్బందితో కూడిన కుటుంబానికి ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
December 15th, 05:24 pm
కేంద్రీయ విద్యాలయ వజ్రోత్సవాల సందర్భంగా ప్రస్తుత-పూర్వ విద్యార్థులు, ఉద్యోగులు, సహాయక సిబ్బంది, పూర్వ విద్యార్థులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు.