Prime Minister hails India-UK Comprehensive Economic and Trade Agreement as a historic milestone for bilateral relations

June 17th, 10:03 pm

PM Modi welcomed the India-UK Comprehensive Economic and Trade Agreement coming into force on 15 July 2026, describing it as a historic milestone in bilateral relations. He noted that the agreement will boost trade and investment, create new opportunities for farmers, workers, MSMEs, startups and innovators, and contribute to the vision of Viksit Bharat 2047.

జీ7 సదస్సు నేపథ్యంలో యూకే ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

June 17th, 12:36 am

ఫ్రాన్స్‌లోని ఏవియన్‌లో జరుగుతున్న జీ7 సదస్సు నేపథ్యంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దైపాక్షిక సమావేశం నిర్వహించారు.

రోజ్‌గార్ మేళా సందర్భంగా వీడియో మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

October 24th, 11:20 am

ఈ ఏడాది వెలుగుజిలుగుల దీపావళి పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త దివ్వెలు వెలిగించింది. ఈ ఉత్సాహపూరిత ఉత్సవ వాతావరణం నడుమ మీరంతా శాశ్వత ఉద్యోగ నియామక పత్రం పొందడమంటే, వేడుకల ఆనందంతోపాటు విజయం రెట్టింపైనంత సంతోషం కలుగుతుంది. ఇనుమడించిన ఈ ఆనందం నేడు దేశవ్యాప్తంగా 51 వేల మందికిపైగా యువతరం సొంతమైంది. మరోవైపు మీ కుటుంబాలన్నిటా కూడా ఆనందోత్సాహాలు ఎంతగా వెల్లువెత్తుతుంటాయో నేను ఊహించగలను. ఈ సందర్భంగా మీతోపాటు మీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. మీ జీవితాల్లో ఈ సరికొత్త ప్రారంభానికిగాను నా శుభాకాంక్షలు.

రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

October 24th, 11:00 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రోజ్ గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దీపాల పండగ దీపావళి ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ప్రధానమంత్రి అన్నారు. పండగ సంబరాల సందర్భంగా శాశ్వత ఉద్యోగ నియామక పత్రాలను అందుకోవటం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. ఒకవైపు పండగ సంతోషం, మరోవైపు ఉపాధి విజయం రెండూ లభించాయి. దేశవ్యాప్తంగా ఇవాళ 51,000 వేల మందికి పైగా యువత సంతోషంగా ఉండటం వల్ల వారి కుటుంబాలు ఆనందంతో వెలిగిపోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందుకున్న వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు. వారి జీవితాల్లో నూతన ప్రారంభానికి శుభాకాంక్షలు చెప్పారు.

న్యూఢిల్లీలో ఎన్డీటీవీ ‘ప్రపంచ సదస్సు-2025’లో ప్రధానమంత్రి ప్రసంగం

October 17th, 11:09 pm

శ్రీలంక ప్రధానమంత్రి హరిణి అమరసూర్య గారికి, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి, నా స్నేహితుడు టోనీ అబాట్‌ గారికి, బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్‌ గారికి, గౌరవ అతిథులకు, సోదరీ సోదరులకూ నా నమస్కారం!

న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025 లో ప్రధాని ప్రసంగం

October 17th, 08:00 pm

న్యూఢిల్లీలో ఈ రోజు జరిగిన ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సభకు హాజరైన విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ వాతావరణంలో ఎన్డీటీవీ అంతర్జాతీయ సదస్సు జరుగుతోందని శ్రీ మోదీ అన్నారు. ఈ కార్యక్రమ ఇతివృత్తం ‘‘అన్‌స్టాపబుల్ ఇండియా’’ను ప్రశంసిస్తూ.. ప్రస్తుత భారత్‌కు తన వేగాన్ని ఆపే ఉద్దేశం లేనందున ఈ అంశం సందర్భోచితంగా ఉందన్నారు. ‘‘భారత్ ఆగదు.. లేదా విరామం తీసుకోదు. 140 కోట్ల మంది భారతీయులంతా కలసికట్టుగా, వేగంగా ముందుకు సాగుతున్నారు’’ అని తెలియజేశారు.

అనువాదం: భారత్-బ్రిటన్ సీఈఓ ఫోరం సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

October 09th, 04:41 pm

ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార రంగ నాయకులుగా మీరు చేస్తోన్న నిరంతర కృషి వల్ల ఈ ఫోరం.. భారత్-బ్రిటన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి ముఖ్యమైన వేదికగా మారింది. ఈ రోజు మీ అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత.. మనం సహజ భాగస్వాములుగా మరింత వేగంతో ముందుకు సాగగలమనే నా నమ్మకం మరింత పెరిగింది. ఈ విషయంలో మీ అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

భారత్-యూకే సంయుక్త ప్రకటన

October 09th, 03:24 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాన్ని స్వీకరించిన యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ 2025 అక్టోబర్ 8,9 తేదీల్లో భారత్‌లో అధికార పర్యటన చేశారు. ఆయన వెంట ఆ దేశ వ్యాపార, వాణిజ్య మంత్రి, వాణిజ్య బోర్డు అధ్యక్షుడు పీటర్ కైల్, స్కాట్లాండ్ మంత్రి డోగ్లస్ అలెగ్జాండర్, పెట్టుబడుల మంత్రి జేసన్ స్టాక్‌వుడ్‌తో పాటు 125 మంది సీఈవోలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, సాంస్కృతిక నాయకులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది.

బ్రిటన్ ప్రధానమంత్రి భారత్ పర్యటన: ముఖ్య నిర్ణయాలు

October 09th, 01:55 pm

భారత్-బ్రిటన్ కనెక్టివిటీ, ఆవిష్కరణ కేంద్రం స్థాపన.

యూకే ప్రధానితో కలసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటనకు తెలుగు అనువాదం

October 09th, 11:25 am

భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న ప్రధాని కీర్ స్టార్మర్‌కు ముంబయిలో ఈ రోజు స్వాగతం చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను.

అధికారిక పర్యటన నిమిత్తం తొలిసారి భారత్‌కు వచ్చిన యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌కు స్వాగతం పలికిన ప్రధానమంత్రి

October 08th, 12:21 pm

యునైటెడ్ కింగ్డమ్ నుంచి అతి పెద్ద వాణిజ్య బృందంతో కలసి చరిత్రాత్మక పర్యటన నిమిత్తం తొలిసారిగా భారత్‌కు విచ్చేసిన ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆత్మీయ స్వాగతం పలికారు.

అక్టోబరు 8,9 తేదీల్లో మహారాష్ట్రలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన

October 07th, 10:30 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8వ, 9వ తేదీల్లో మహారాష్ట్రలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి మధ్యాహ్నం సుమారు 3 గంటలకు నవీ ముంబయికి చేరుకొంటారు. కొత్తగా కట్టిన నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన పరిశీలిస్తారు. ఆ తరువాత, సుమారు మూడున్నర గంటల వేళకు, ప్రధానమంత్రి నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు ముంబయిలో వివిధ పథకాలను కూడా ప్రారంభించి, జాతికి అంకితమిస్తారు. ఈ సందర్భంగా జనసమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

భారత్, బ్రిటన్ వ్యాపారవేత్తలతో సమావేశమైన ఇరు దేశాల ప్రధానమంత్రులు

July 24th, 07:38 pm

చారిత్రాత్మక భారత్, బ్రిటన్ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంపై (సీఈటీఏ) సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఈ రోజు ఇరు దేశాల వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఆరోగ్యం, ఔషధాలు, రత్నాలు - ఆభరణాలు, వాహనాలు, ఇంధనం, తయారీ, టెలికాం, టెక్నాలజీ, ఐటీ, సరకు రవాణా, వస్త్రాలు, ఆర్థిక సేవల రంగాలకు చెందిన పరిశ్రమల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రంగాలు రెండు దేశాల్లో ఉపాధి కల్పన, సమగ్ర ఆర్థికాభివృద్ధికి గణనీయంగా దోహదపడుతున్నాయి.

భారత్- బ్రిటన్ దార్శనికత 2035

July 24th, 07:12 pm

జూలై 24న జరిగిన సమావేశంలో “భారత్- బ్రిటన్ దార్శనికత 2035”ను ఇరు దేశాల ప్రధానమంత్రులు ఆమోదించారు. రెండు దేశాలు తమ పూర్తి సామర్థ్యాన్ని వాడుకునేలా చేసే వాణిజ్య ఒప్పందం కుదిరిన అనంతరం దీనికి ఆమోదం తెలపటం అనేది నాయకుల ఉమ్మడి నిబద్ధతను తెలియజేస్తోంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక ఒప్పందంతో పరస్పర వృద్ధి, శ్రేయస్సు కోసం ఉభయ దేశాలు కలిసి చేయనున్నాయి. వేగంగా మారుతోన్న ప్రస్తుత సమయంలో సుసంపన్న, సురక్షిత, సుస్థిర ప్రపంచాన్ని రూపొందించేందుకు రెండు దేశాల సంకల్పాన్ని ఈ ఒప్పందం తెలియజేస్తోంది.

బ్రిటన్ ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటనలో ప్రధాని ప్రకటనకు తెలుగు అనువాదం

July 24th, 04:20 pm

ముందుగా, ఆత్మీయ స్వాగతం, ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి స్టార్మర్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన విజయాన్ని ఈ రోజు సూచిస్తుంది. అనేక సంవత్సరాలు చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నాల తర్వాత మన రెండు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం ఈ రోజు ఖరారైనందుకు సంతోషిస్తున్నాను.

India and the UK are laying the foundation for a new chapter in our shared journey: PM Modi

July 24th, 04:00 pm

During his official visit to the United Kingdom, PM Modi met with the UK PM Keir Starmer. The two leaders held a one-on-one meeting as well as delegation level talks and welcomed the signing of the historic India-UK Comprehensive Economic and Trade Agreement (CETA). They reviewed the entire gamut of the bilateral relationship and adopted the India-UK Vision 2035.

బ్రిటన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ

July 24th, 03:59 pm

బ్రిటన్‌లో ఈ నెల 23-24 తేదీల్లో అధికారిక పర్యటన సందర్భంగా ఆ దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ కీర్ స్టార్మర్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు భేటీ అయ్యారు. బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న చెకర్స్‌లోని బ్రిటన్ ప్రధాని నివాసానికి చేరుకున్న శ్రీ మోదీకి శ్రీ స్టార్మర్ హృదయపూర్వకంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలూ ముఖాముఖి సమావేశంతోపాటు ప్రతినిధి బృంద స్థాయి చర్చలు నిర్వహించారు.

PM Modi arrives in London, United Kingdom

July 24th, 12:15 pm

Prime Minister Narendra Modi arrived in United Kingdom a short while ago. In United Kingdom, PM Modi will hold discussions with UK PM Starmer on India-UK bilateral relations and will also review the progress of the Comprehensive Strategic Partnership.

యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల పర్యటనకు బయల్దేరే ముందు ప్రధాని ప్రకటన

July 23rd, 01:05 pm

భారత్, యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇటీవలి కాలంలో గణనీయమైన పురోగతిని సాధించింది. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, రక్షణ, విద్య, పరిశోధన, సుస్థిరత, ఆరోగ్యం, ప్రజా సంబంధాలు తదితర రంగాల్లో మన సహకారం విస్తరించింది. గౌరవ ప్రధాని సర్ కీర్ స్టార్మర్‌తో జరిపే సమావేశంలో రెండు దేశాల్లోనూ సంక్షేమాన్ని, వృద్ధిని, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే అవకాశం లభిస్తుంది. ఈ పర్యటనలో గౌరవ కింగ్ ఛార్లెస్ IIIతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నా.

యునైటెడ్ కింగ్‌డమ్ మరియు మాల్దీవులకు ప్రధానమంత్రి పర్యటన (జూలై 23 - 26, 2025)

July 20th, 10:49 pm

ప్రధాని మోదీ జూలై 23 - 26 వరకు యుకే కి అధికారిక పర్యటన మరియు మాల్దీవులకు రాష్ట్ర పర్యటన చేస్తారు. ఆయన పిఎం స్టార్మర్‌తో విస్తృత చర్చలు జరుపుతారు మరియు వారు సీఎస్పి పురోగతిని కూడా సమీక్షిస్తారు. జూలై 26న జరిగే మాల్దీవుల స్వాతంత్ర్య 60వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ 'గౌరవ అతిథి'గా ఉంటారు. ఆయన మాల్దీవుల అధ్యక్షుడు ముయిజును కలుస్తారు మరియు పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై చర్చలు జరుపుతారు.