కుముదిని లఖియా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం
April 12th, 03:39 pm
కుముదిని లఖియా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారు. సాంస్కృతిక రంగంలో ఆమె అసాధారణ ప్రతిభతో గుర్తింపు పొందారని ఆయన ప్రశంసించారు. కథక్, భారతీయ నృత్య రీతుల పట్ల ఆమెకు గల మక్కువ.. ఆమె అద్భుతమైన రచనల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు.