Tiruchirappalli turns out in huge numbers for PM Modi’s public meeting
March 11th, 06:00 pm
At a massive public meeting in Tamil Nadu’s Tiruchirappalli, Prime Minister Narendra Modi hailed Tiruchirappalli as a land of courage and faith, recalling the bravery of the Marudu Brothers and paying tribute to Major M. Saravanan for his sacrifice during the Kargil War. “Trichy is a land of courage and faith,” he said, adding that the Centre proudly honours Tamil Nadu’s culture and heritage. He also highlighted that C. P. Radhakrishnan, a son of the state, serves as the Vice President of India.DMK is the biggest enemy of Tamil Nadu’s culture: PM Modi in Madhuranthakam
January 23rd, 03:15 pm
PM Modi addressed a public rally in Madhuranthakam, Tamil Nadu, where he said the people of the state had given the DMK a clear mandate twice, but the party betrayed the trust of the people. He added DMK made many promises but delivered zero results, adding that people are now calling it a CMC government, one that promotes corruption, mafia, and crime.Tamil Nadu shows massive support for NDA at PM Modi’s Madhuranthakam rally
January 23rd, 03:00 pm
PM Modi addressed a public rally in Madhuranthakam, Tamil Nadu, where he said the people of the state had given the DMK a clear mandate twice, but the party betrayed the trust of the people. He added DMK made many promises but delivered zero results, adding that people are now calling it a CMC government, one that promotes corruption, mafia, and crime.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 11:00 am
పొంగల్ ఈ రోజున నిజంగా ఓ అంతర్జాతీయ పర్వదినంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగాగల తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా దీన్ని అపరిమిత ఉత్సాహంతో నిర్వహించుకుంటారు. అటువంటి వారిలో నేనూ ఒకడిని. అందుకే, ఈ ప్రత్యేక పండుగ వేడుకల్లో మీ సంతోషంలో పాలుపంచుకోవడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. తమిళుల జీవనంలో పొంగల్ పంగుడ మధురానుభూతి. భూమాత, అన్నదాతలతోపాటు సూర్య భగవానునిపై మానవాళి కృతజ్ఞతకు ఈ పండగ ఓ ప్రతీక. ప్రకృతితో, కుటుంబంతో, సమాజంతో సామరస్యానికిగల ప్రాధాన్యాన్ని ఇది మనకు అవగతం చేస్తుంది. ఇదే సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లోనూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు వంటి పేర్లతో ఈ పర్వదినాన ప్రజలు సంబరాల్లో తలమునకలై ఉన్నారు. దేశవిదేశాల్లోని తమిళ సోదరీసోదరులందరికీ పొంగల్ సహా ఈ పండుగల వేళ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.న్యూఢిల్లీలో పొంగల్ వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొంగల్ ప్రపంచ పండుగలా మారింది: పీఎం
January 14th, 10:45 am
ఈ రోజు న్యూఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. తమిళంలో శుభాకాంక్షలు చెప్పిన శ్రీ మోదీ... “ఈ రోజు పొంగల్ ఒక ప్రపంచ పండుగలా మారింది” అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, తమిళ సంస్కృతిని ప్రేమించే వారంతా ఉత్సాహంగా పొంగల్ని నిర్వహించుకుంటున్నారనీ, తానూ వారిలో ఒకడినని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రత్యేక పండుగను అందరితో కలిసి జరుపుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. తమిళుల జీవితంలో ఒక ఆహ్లాదకరమైన అనుభూతి లాంటిదనీ... ఇది రైతుల శ్రమకు, భూమికి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండుగ అని శ్రీ మోదీ తెలిపారు. అదే సమయంలో ప్రకృతిలో, కుటుంబంలో, సమాజంలో సమతుల్యత దిశగా మనకు ఈ పండుగ మార్గనిర్దేశం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాలూ లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఇతర పేర్లతో ఈ పండుగ చేసుకుంటున్నారని శ్రీ మోదీ పేర్కొన్నారు. పొంగల్ పండుగ సందర్భంగా దేశవిదేశాల్లో ఉన్న తమిళ సోదరీ సోదరులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.వారణాసిలో 72 వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
January 04th, 01:00 pm
ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు - సోదరులు రవీంద్ర జైస్వాల్, దయాశంకర్, గిరీష్ యాదవ్, బనారస్ మేయర్ - సోదరుడు అశోక్ తివారీ, ఇతర ప్రజాప్రతినిధులు, వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, దేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు, కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నమస్కారం.వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన ప్రధాని
January 04th, 12:00 pm
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులందరికీ స్వాగతం పలికి అభినందించడం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యునిగా సంతోషంగా ఉందని తెలిపారు. నేటి నుంచి నగరంలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ జాతీయ స్థాయి పోటీలకు వచ్చారని.. రాబోయే రోజుల్లో వారణాసి గడ్డపై వారి కృషికి పరీక్ష ఎదురుకానుందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని.. ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని అభివర్ణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న వారందరికీ ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.'వికసిత భారత్' సంకల్పం తప్పక నెరవేరుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
December 28th, 11:30 am
ఈ ఏడాది చివరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, 2025 సంవత్సరంలో జాతీయ భద్రత, క్రీడలు, సైన్స్ ప్రయోగశాలలు మరియు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం తనదైన ముద్ర వేసిందని అన్నారు. నవసంకల్పాలతో 2026లో ముందుకు సాగడానికి దేశం సిద్ధంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, క్విజ్ పోటీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 మరియు ఫిట్ ఇండియా ఉద్యమం వంటి యువత కేంద్రీకృత కార్యక్రమాలను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు.కాశీ తమిళ సంగమం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
December 02nd, 07:02 pm
ఈరోజు ప్రారంభమవుతున్న కాశీ తమిళ సంగమం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తేజకరమైన ఈ కార్యక్రమం 'ఏక్ భారత్, శ్రేష్ఠతా భారత్' స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు. సంగమానికి వచ్చే ప్రతి ఒక్కరికీ కాశీలో ఉన్నన్నాళ్ళూ ఆహ్లాదకరంగా, ఎన్నటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను!“కేటీఎస్ 4.0 సాంస్కృతిక రథ సారథిగా జెన్ జెడ్”
November 30th, 06:56 pm
డిసెంబర్ 2న ప్రారంభమయ్యే కాశీ తమిళ సంగమం 4.0 కోసం జెన్ జెడ్ పూర్తి ఉత్సాహంతో సన్నద్ధమవుతోంది. కాశీ-తమిళనాడు మధ్య గల పురాతన సాంస్కృతిక, భాషా సంబంధాలను శక్తిమంతమైన యువ తరంతో అనుసంధానించడం ఈ కార్యక్రమం లక్ష్యం.ప్రజల సమిష్టి ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'మన్ కీ బాత్' ఒక అద్భుతమైన వేదిక: ప్రధాని మోదీ
November 30th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్‌లో, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, వందేమాతరం 150వ వార్షికోత్సవం, అయోధ్యలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ, ఐఎన్‌ఎస్ 'మహే' ప్రవేశం మరియు కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవం వంటి నవంబర్‌లో జరిగిన కీలక సంఘటనలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు & తేనె ఉత్పత్తి, భారతదేశ క్రీడా విజయాలు, మ్యూజియంలు మరియు సహజ వ్యవసాయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కాశీ-తమిళ సంగమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రధాని కోరారు.న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఆర్య మహా సమ్మేళనం 2025 ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 31st, 07:00 pm
ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఈ రోజు సర్దార్ సాహెబ్ 150వ జయంతి. ఏక్తానగర్లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. దాని వల్ల ఇక్కడికి రావడం ఆలస్యమైంది. ఇక్కడికి సకాలంలో చేరుకోలేనందుకు చింతిస్తున్నాను. ఈ విషయంలో మీ అందరినీ క్షమాపణలను కోరుతున్నాను. సభ ప్రారంభంలో మనం విన్న మంత్రాల శక్తి ఇప్పటికీ మనకి తెలుస్తూనే ఉంది. మీ మధ్య ఉండే అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అనుభవం దైవికంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది స్వామి దయానందుల వారి ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాల పట్ల మనందరికీ ఉన్న గౌరవంతో పాటు ఇక్కడున్న మేధావులైన మీ అందరితోనూ దశాబ్దాలుగా నాకున్న వ్యక్తిగత అనుబంధం వల్లే మళ్లీ మళ్లీ మీ మధ్య ఉండే అవకాశం నాకు లభిస్తోంది. మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ, మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ నాలో ప్రత్యేకమైన శక్తి, స్ఫూర్తి నిండుతాయి. ఇలాంటి మరో తొమ్మిది హాళ్లను ఏర్పాటు చేశారని ఇప్పుడే నాకు చెప్పారు. అక్కడ మన ఆర్యసమాజ్ సభ్యులంతా వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. వారిని నేను నేరుగా చూడలేనప్పటికీ.. ఇక్కడి నుంచే వారికి నమస్కరిస్తున్నాను.కెవాడియాలోని రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 31st, 09:00 am
సర్దార్ పటేల్ 150వ జయంతి చరిత్రాత్మక సందర్భం. ఏక్తానగర్‌లో ఈ నాటి దివ్యమైన ఉదయం...ముఖ్యంగా ఈ విశాల దృశ్యం గొప్ప ఆరాధనా భావాన్ని కలిగిస్తోంది. సర్దార్ సాహెబ్ పాదాల వద్ద మనమంతా సామూహికంగా ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్న ఒక గొప్ప సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఐక్యతా పరుగులో పాల్గొంటున్న కోట్లాది మంది భారతీయుల ఉత్సాహం ద్వారా మనం నవ భారత సంకల్పాన్ని కార్యాచరణలో చూస్తున్నాం. నిన్న సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శన సహా ఇటీవల ఇక్కడ నిర్వహించిన కార్యక్రమాలు గత కాలపు సంప్రదాయాన్ని, వర్తమానపు శ్రమనీ- శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రదర్శించాయి. సర్దార్ సాహెబ్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు ఒక స్మారక నాణెంతో పాటు పోస్టల్ స్టాంపును విడుదల చేశాం. సర్దార్ సాహెబ్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా 140 కోట్ల మంది దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.గుజరాత్‌లోని కెవాడియాలో రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 31st, 08:44 am
గుజరాత్‌లోని కెవాడియాలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సర్దార్ పటేల్ 150వ జయంతి ఒక చరిత్రాత్మక సందర్భమని అన్నారు. ఏక్తా నగర్‌లోని ఉదయం దివ్యమైన, విశాల దృశ్యంగా ఆరాధనా భావాన్ని కలిగిస్తోందని అభివర్ణించిన శ్రీ మోదీ... సర్దార్ పటేల్ పాదాల వద్ద చేరిన నేటి ఈ జన సమూహపు ఐక్యతా స్ఫూర్తితో దేశం ఒక చిరస్మరణీయ అనుభవాన్ని పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఐక్యతా పరుగు కార్యక్రమాన్ని... ఆ కార్యక్రమంలో కోట్లాది మంది భారతీయుల ఉత్సాహంతో కూడిన భాగస్వామ్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దీని ద్వారా నవ భారత్ సంకల్పం స్పష్టంగా అవగతమవుతోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, నిన్నటి సాయంత్రం జరిగిన అద్భుతమైన ప్రదర్శనను ప్రస్తావిస్తూ... అవి గత కాలపు సంప్రదాయాలను, వర్తమానపు శ్రమనూ-శౌర్యాన్నీ, భవిష్యత్తు విజయాల సంగ్రహావలోకనాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఒక స్మారక నాణెం, ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసినట్లు ఆయన తెలియజేశారు. సర్దార్ పటేల్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా దేశంలోని 140 కోట్ల మంది పౌరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
August 02nd, 11:30 am
నమఃపార్వతీ పతయే.. హర హర మహాదేవ.. పవిత్ర శ్రావణ మాసంలో కాశీలోని నా కుటుంబ సభ్యులను కలిసే అవకాశం ఈ రోజు నాకు లభించింది. ఈ సందర్భంగా మీకందరికీ ఇదే నా ప్రణామం.వారణాసిలో దాదాపు రూ. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 02nd, 11:00 am
ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దాదాపు రూ.2,200 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సభనుద్దేశించి ప్రసంగిస్తూ.. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వారణాసిని సందర్శించడం, ఇక్కడి ప్రజలను కలవడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. వారణాసి ప్రజలతో తనకు భావోద్వేగ అనబంధముందన్న శ్రీ మోదీ.. ఆదరాభిమానాలను కనబరిచిన నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులతో సంభాషించడంపై శ్రీ మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఆది తిరువత్తిరై ఉత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 27th, 12:30 pm
పూజనీయ ఆధీనం మఠాధిపతి గారు, చిన్మయ మిషన్ స్వామీజీలు, తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, మంత్రివర్గ సహచరుడు డాక్టర్ ఎల్. మురుగన్ గారు, స్థానిక ఎంపీ తిరుమా వలవన్ గారు, వేదికపై ఉన్న తమిళనాడు మంత్రులూ, పార్లమెంటు సహచరుడు ఇళయరాజా గారు, ఒడువర్లు, భక్తులు, విద్యార్థులు, సాంస్కృతిక చరిత్రకారులు, ప్రియమైన సోదరీ సోదరులా! నమఃశివాయ.తమిళనాడులోని గంగైకొండ చోళపురంలో ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 27th, 12:25 pm
తమిళనాడులోని గంగైకొండ చోళపురం ఆలయంలో ఈ రోజు ఆడి తిరువాతిరై వేడుక సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మున్ముందుగా ఆదిదేవుడైన మహాశివునికి నీరాజనం అర్పిస్తూ- రాజరాజ చోళుడు రాజ్యమేలిన పవిత్ర భూమిలో పరమేశుని దివ్య దర్శనంతో తనలో ఆధ్యాత్మిక శక్తి పెల్లుబికిందని పేర్కొన్నారు. శ్రీ ఇళయరాజా స్వరాలు సమకూర్చిన భక్తి గీతాలాపనను అమితంగా ఆస్వాదించానని చెప్పారు. శైవారాధకులైన ‘ఓతువర్ల’ పవిత్ర మంత్రోచ్చారణ నడుమ సర్వశక్తిమంతుడైన శివుడికి నమస్కరిస్తూ- ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణంతో తాదాత్మ్యం చెందానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.తమిళనాడు తూత్తుకుడిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధాని ప్రసంగం
July 26th, 08:16 pm
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి గారు, నా కేబినెట్ సహచరులు కింజరపు రామమోహన్ నాయుడు గారు, డా. ఎల్. మురుగన్ గారు, తమిళనాడు మంత్రులు తంగం తెన్నరసు గారు, డా. టి.ఆర్.బి. రాజా గారు, పి. గీతా జీవన్ గారు, అనితా ఆర్. రాధాకృష్ణన్ గారు, ఎంపీ కణిమొళి గారు, తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, మన ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ గారు, తమిళనాడు సోదర సోదరీమణులారా!తమిళనాడు తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
July 26th, 07:47 pm
తమిళనాడులోని తూత్తుకుడిలో రూ. 4800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ప్రాంతీయంగా అనుసంధానాన్ని విశేషంగా మెరుగుపరచడంతోపాటు.. రవాణా రంగ సామర్థ్యాన్ని పెంచేలా, శుద్ధ ఇంధన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేలా వివిధ రంగాల్లో వరుసగా చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులు తమిళనాడు ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. కార్గిల్ విజయ దివస్ సందర్భంగా కార్గిల్ వీర సైనికులకు శ్రీ మోదీ నివాళి అర్పించారు. సాహసికులైన వీరయోధులకు ప్రణమిల్లారు. దేశం కోసం ప్రాణత్యాగానికీ వెనుకాడని అమరులకు మనఃపూర్వకంగా అంజలి ఘటించారు.