కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 05th, 10:08 am

ఈ రోజు కార్తిక పౌర్ణమితో పాటు దేవ్ దీపావళి. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భారతీయ సంస్కృతితోనూ, ఆధ్యాత్మికతతోనూ ముడిపడిన ఈ సందర్భం ప్రతి ఒక్కరి జీవనంలో సుఖ శాంతులనూ, ఆరోగ్యాన్నీ, సమృద్ధినీ అందించాలని నేను కోరుకుంటున్నాను. పవిత్ర స్నానాలు, దానాలు, హారతులతో పాటు పూజలతో కూడిన మన శుభ సంప్రదాయం అందరి జీవనంలో వెలుగును నింపాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.