PM to visit Andhra Pradesh and Karnataka on 1 August
July 31st, 09:56 am
PM Modi will visit Andhra Pradesh and Karnataka on 1 August. In Andhra Pradesh, he will inaugurate the Alluri Sitarama Raju International Airport and launch development projects worth over ₹17,900 crore. He will also lay the foundation stone for Andhra Pradesh's first semiconductor manufacturing facility. During his visit to Karnataka, he will inaugurate the Swami Vivekananda Cultural Youth Centre - Viveka Smaraka in Mysuru.కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని 3 జిల్లాల్లో మల్టీట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం... ఈ ప్రాజెక్టుతో మరో 46 కి.మీ మేర విస్తరించనున్న భారతీయ రైల్వే వ్యవస్థ
July 24th, 04:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బళ్లారి-గుంతకల్ విభాగం మధ్య రూ. 1,264 కోట్ల అంచనా వ్యయంతో 3, 4వ రైల్వే లైన్ నిర్మాణానికి నేడు ఆమోదం తెలిపింది.కర్ణాటకలోని కార్వార్‌లో ప్రమాదం... ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
July 09th, 02:17 pm
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.ఎకనామిక్ రోడ్‌మ్యాప్ వాణిజ్య సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
July 09th, 06:15 am
ఇప్పుడు ఈ సరికొత్త మార్గం ద్వారా పెట్టుబడులు, ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయి. ఈ భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది.Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event
July 09th, 06:00 am
PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.బెంగళూరులో దుర్ఘటన.. మృతులకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
July 02nd, 04:32 pm
బెంగళూరులో రాళ్లగని దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని తెలిపారు. ‘‘ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.ప్రధానమంత్రితో కర్ణాటక ముఖ్యమంత్రి భేటీ
June 11th, 06:06 pm
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డి.కె. శివకుమార్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ డి.కె. శివకుమార్‌కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
June 03rd, 06:42 pm
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ డి.కె. శివకుమార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అభినందనలు తెలిపారు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.కర్ణాటకలోని కారవార్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధాని
May 24th, 06:51 pm
కర్ణాటకలోని కారవార్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.అనువాదం: హైదరాబాద్‌లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 10th, 03:45 pm
సైబరాబాద్‌కు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ సామర్థ్యం ఉంది. తెలంగాణ, దేశం సాధిస్తోన్న వేగవంతమైన అభివృద్ధికి ఇది ఒక ప్రధాన కేంద్రం. అందుకే తెలంగాణను దేశపు అతిపెద్ద తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నేడు సైబరాబాద్ నుంచి ఎన్నో భారీ ప్రాజెక్టులను ప్రారంభించాం. ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరిగిన ఈ ప్రాజెక్టుల ద్వారా ఇక్కడ వేలాది కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అనుసంధానత కూడా మరింత బలోపేతం అవుతుంది. ఈ ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సుమారు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన సహా దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 10th, 03:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణలోని తెలంగాణలోని హైదరాబాద్‌లో దాదాపు ₹9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ- జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యంగల కూడలిగా హైదరాబాద్ నగర పరిణామాత్మక ప్రాశస్త్యాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణ సహా యావద్దేశాన్నీ శరవేగంగా పురోగమింపజేయడంలో ఈ ప్రాంతం కీలక పోషిస్తున్నదని ప్రస్ఫుటంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేడు ప్రారంభించిన వివిధ భారీ ప్రాజెక్టులు ఈ రాష్ట్రాన్ని ఓ ప్రధాన తయారీ కూడలిగా నిలుపుతాయని ఆయన పేర్కొన్నారు. నేటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో వేలాది కొత్త ఉపాధి అవకాశాల సృష్టి సహా ప్రాంతీయ అనుసంధానం బలోపేతం కాగలదన్నారు. ప్రగతికి దోహదం చేసే ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ప్రజలకూ ఎంతో ప్రయోజనం కల్పిస్తాయంటూ వారికి అభినందనలు తెలిపారు.కాంగ్రెస్ అధికార దాహపు పుస్తకంలో 'పాలన' అనే అధ్యాయమే లేదు: బెంగళూరులో ప్రధాని మోదీ
May 10th, 09:46 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.కర్ణాటకలోని బెంగళూరులో భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
May 10th, 09:45 am
కర్ణాటకలోని బెంగళూరులో ఈరోజు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఆయన ప్రశంసిస్తూ, అస్థిరత మరియు కుంభకోణాల కంటే 'స్థిరత్వం, వేగం మరియు పరిష్కారాల'కే దేశ ప్రజలు ప్రాధాన్యతనిస్తున్నారని ఉద్ఘాటించారు. బెంగళూరు గడ్డపై నేడు కాషాయ సూర్యుడు ఉదయించాడని ఆయన పేర్కొన్నారు.మే 10న కర్ణాటక, తెలంగాణలో పీఎం పర్యటన
May 09th, 11:17 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే 10, 2026న కర్ణాటక, తెలంగాణల్లో పర్యటిస్తారు. ఉదయం సుమారు 11 గంటలకు బెంగళూరులో జరిగే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవాల్లో ప్రధానమంత్రి పాల్గొని, సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత ప్రధానమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దాదాపు రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 3:45 గంటలకు హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిని ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు.ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ.. మధ్యప్రదేశ్.. రాజస్థాన్.. ఉత్తరప్రదేశ్.. కర్ణాటక రాష్ట్రాల్లోని 19 జిల్లాల మీదుగా 3 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం
May 05th, 07:14 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ ఇవాళ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో రూ.23,437 కోట్లతో చేపట్టే 3 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులలో:కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన కారణంగా ప్రాణ నష్టం... సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
April 29th, 11:22 pm
కర్నాటకలోని బెంగళూరులో గోడ కూలిన దురదృష్టకర ఘటన పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ, డిజిటల్ సెన్సస్ 2027లో పాల్గొని దానిని విజయవంతం చేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
April 26th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో, అణు, పవన విద్యుత్ రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతిని ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. భగవాన్ బుద్ధుని బోధనలు, బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం, ప్రకృతి పరిరక్షణ, వెదురు రంగం, ప్రాచీన గ్రంథాలు, గణిత ఒలింపియాడ్ కార్యక్రమం వంటి పలు ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కొనసాగుతున్న డిజిటల్ సెన్సస్ ప్రచారం గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.కర్ణాటకలో ప్రధాని పర్యటన: శ్రీ గురు భైరవైక్య మందిరం ప్రారంభ విశేషాలను ప్రజలతో పంచుకున్న శ్రీ మోదీ
April 15th, 05:46 pm
ఈ రోజు కర్ణాటక పర్యటన విశేషాలను, ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.కర్ణాటకలోని మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
April 15th, 11:10 am
పరమ పూజ్య జగద్గురు శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ నిర్మలానందనాథ మహాస్వామీజీ, మాజీ ప్రధానమంత్రి హెచ్ డీ దేవెగౌడ గారు, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ గారు, పరమ పూజ్య జగద్గురు స్వామి పరమాత్మానంద సరస్వతిజీ, కేంద్ర మంత్రులు హెచ్ డీ. కుమారస్వామి గారు, శోభా కరంద్లాజే గారు, కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు ఆర్ అశోక గారు, రాష్ట్ర మంత్రి ఎన్. చెలువరాయస్వామి గారు, సకల సాధువులందరికీ, ఇతర ప్రముఖులు, ఇక్కడికి భారీ సంఖ్యలో విచ్చేసిన సోదర సోదరీలందరికీ నమస్కారాలు.కర్ణాటక మాండ్యలోని శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురుభైరవైక్య మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
April 15th, 11:00 am
కర్ణాటకలోని మాండ్య జిల్లా శ్రీ క్షేత్ర ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్న ప్రధానమంత్రి... వైభవోపేతంగా శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించి, మహోన్నతులైన సాధుసంతులతో సంభాషించే భాగ్యాన్ని తనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రక జ్వాలాపీఠం వద్ద సమయం గడపడం, అశేషంగా తరలివచ్చిన భక్తులనుద్దేశించి ప్రసంగించడం మాటలకందని బలమైన భావోద్వేగాలను కలిగించాయన్నారు. ‘‘ఈ దైవిక అనుభవాలు శాశ్వతంగా నా స్మృతిపథంలో నిలిచిపోతాయి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.