కర్మా పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

September 03rd, 03:51 pm

కర్మా పూజ సందర్భంగా దేశ ప్రజలందరికీ, ప్రత్యేకించి గిరిజనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ పర్వదినం.. సోదరీ సోదరుల మధ్య అవిచ్ఛిన్న ప్రేమకు ప్రతీక. అలాగే ఈ పండుగ చేసుకోవడంలో ప్రకృతి ఆరాధనకు కూడా విశిష్ట ప్రాధాన్యం ఉంది’’ అని శ్రీ మోదీ అన్నారు.