యువరాజు కరీమ్ అగాఖాన్ - IV మృతికి ప్రధాని సంతాపం

February 05th, 04:10 pm

యువరాజు కరీమ్ అగాఖాన్ IV మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలియజేశారు. ఆయన సేవకు, ఆధ్యాత్మికతకు జీవితాన్ని అంకితం చేసిన దార్శనికుడని పీఎం ప్రశంసించారు. ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, మహిళాసాధికారత తదితర అంశాల్లో ఆయన చేసిన కృషిని కొనియాడారు.