శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను కలిసిన ప్రధానమంత్రి
May 30th, 09:39 pm
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు కాన్పూర్‌లో కలిశారు. ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించిన మన వీర సైన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.మే 29, 30లలో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో పర్యటించనున్న ప్రధానమంత్రి
May 28th, 12:10 pm
ఈ నెల 29, 30 తేదీల్లో సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్‌లతో పాటు ఉత్తరప్రదేశ్‌లో కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నవీకరణ, అయిదు జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పథకానికి క్యాబినెట్ ఆమోదం
May 07th, 02:07 pm
జాతీయ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) నవీకరణతోపాటు అయిదు (5) జాతీయ అత్యున్నత నైపుణ్యాభివృద్ధి కేంద్రాల (ఎన్‌సీవోఈ) ఏర్పాటు పథకానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకంగా దీన్ని రూపొందించారు. భారత్‌లో వృత్తి విద్యలో విప్లవాత్మక మార్పుల దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు.న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన యుగ్మ్ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
April 29th, 11:01 am
నేడు ప్రభుత్వం, విద్యారంగం, సైన్స్, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈరోజు ఇక్కడ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఐక్యత, ఈ సంగమమే మనం యుగ్మ్ అంటాం. వికసిత భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం) భవిష్యత్ సాంకేతికతకు సంబంధిత భాగస్వాములందరూ సమావేశమై, క్రియాశీలంగా పాల్గొనే వేదికే ఈ యుగ్మ్. భారతదేశ సృజనాత్మక సామర్థ్యాన్ని, డీప్-టెక్ లో దాని పాత్రను పెంచడానికి మనం చేస్తున్న ప్రయత్నాలను ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబేల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెంట్ సిస్టమ్స్ అండ్ బయోసైన్సెస్, బయోటెక్నాలజీ, ఆరోగ్య, వైద్య రంగాలలో సూపర్ హబ్ లు ప్రారంభమయ్యాయి. ఈ రోజు వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్ వర్క్ ను కూడా ప్రారంభించారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సహకారంతో పరిశోధనలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ చొరవ తీసుకున్న వాధ్వానీ ఫౌండేషన్ కు, మా ఐఐటీలకు, ఇతర భాగస్వాములందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నా మిత్రుడు రోమేష్ వాధ్వానీని అభినందిస్తున్నాను. మీ అంకితభావం, చురుకైన కృషి వల్ల ప్రైవేటు, ప్రభుత్వ రంగాలు కలిసి దేశ విద్యావ్యవస్థలో అనేక సానుకూల మార్పులను తీసుకువచ్చాయి.యుగ్మ్ సృజనాత్మక సదస్సులో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రసంగం
April 29th, 11:00 am
న్యూఢిల్లీలో భారత్ మండపంలో జరిగిన యుగ్మ్ ఆవిష్కరణల సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రసంగించారు. భవిష్యత్తు సాంతకేతికతల్లో అభివృద్ధి దిశగా భారత్‌ను నడిపించేందుకు ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, శాస్త్ర, సాంకేతిక నిపుణులతో జరుగుతున్న ముఖ్యమైన సమావేశంగా యుగ్మ్‌ను ప్రధాని వర్ణించారు. ఈ కార్యక్రమం దేశ ఆవిష్కరణ సామర్థ్యాలను, డీప్-టెక్‌లో తన పాత్రను విస్తరించే ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఐ, ఇంటిలిజెంట్ సిస్టమ్స్, బయోసైన్సెస్, బయోటెక్నాలజీ, ఆరోగ్యం, ఔషధ రంగాలపై దృష్టి సారించేలా ఐఐటీ కాన్పూర్, ఐఐటీ బాంబేల్లో సూపర్ హబ్‌లు ప్రారంభించామని తెలిపారు. అలాగే నేషనల్ రీసెర్చి ఫౌండేషన్ సహకారంతో పరిశోధనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వాధ్వానీ ఇన్నోవేషన్ నెట్వర్క్ గురించి ఆయన ప్రస్తావించారు. వాధ్వానీ ఫౌండేషన్, ఐఐటీలు, ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారందరికీ ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగాల మధ్య సహకారం ద్వారా దేశ విద్యావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావడంలో చురుకుగా పనిచేస్తున్న శ్రీ రొమేష్ వాధ్వానీ అంకితభావాన్ని ప్రశంసించారు.Prime Minister Narendra Modi to participate in YUGM Conclave
April 28th, 07:07 pm
PM Modi to participate in YUGM Conclave and address the gathering. YUGM is a strategic conclave convening leaders from government, academia, industry, and the innovation ecosystem. In line with PM’s vision of a self-reliant and innovation-led India, various key projects will be initiated during the conclave. This conclave will foster a national innovation alignment toward Viksit Bharat@2047.Cabinet approves 8 National High-Speed Road Corridor Projects at a total capital cost of Rs. 50,655 crore
August 02nd, 08:42 pm
The Cabinet Committee on Economic Affairs chaired by the Prime Minister Shri Narendra Modi has approved the development of 8 important National High Speed Corridor projects with a Length of 936 km at a cost of Rs. 50,655 crore across the country. Implementation of these 8 projects will generate an estimated 4.42 crore mandays of direct and indirect employment.కాన్పూర్ గ్రాండ్ రోడ్‌షోలో ప్రధాని మోదీకి మద్దతునిస్తోంది!
May 04th, 08:32 pm
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన రోడ్‌షో నిర్వహించారు. ప్రధానమంత్రిని అభినందించడానికి మరియు భారతీయ జనతా పార్టీని ఉత్సాహపరిచేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ప్రజలు ఉత్సాహంగా 'మోదీ మోదీ,' 'భారత్ మాతా కీ జై' మరియు 'ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్' అని నినాదాలు చేశారు. ప్రధాని యొక్క కాన్వాయ్ నగరం గుండా వెళుతున్నప్పుడు మద్దతుదారులు పూల రేకులను కురిపించడంతో వాతావరణం విద్యుత్తుతో నిండిపోయింది.డిసెంబర్ 30వ తేదీన ప్రధాన మంత్రి అయోధ్య పర్యటన
December 28th, 05:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 30 డిసెంబర్, 2023న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యను సందర్శిస్తారు. సుమారు ఉదయం 11:15 గంటలకు ప్రధాన మంత్రి పునరభివృద్ధి చెందిన అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తారు. కొత్త అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 12:15 గంటలకు, కొత్తగా నిర్మించిన అయోధ్య విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి బహిరంగ సభలో పాల్గొంటారు, రాష్ట్రంలో రూ. 15,700 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్ అంతటా ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి.PM praises inauguration of civil enclave at Kanpur Airport
May 26th, 09:36 pm
The Prime Minister Shri Narendra Modi has said that the new civil enclave at Kanpur Airport will ease travel and expand opportunities.శ్రీ హర్మోహన్ సింగ్ యాదవ్ 10వ పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
July 25th, 04:31 pm
దివంగత హర్మోహన్ సింగ్ యాదవ్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇంత ఆప్యాయంగా ఆహ్వానించినందుకు సుఖరామ్ జీకి కూడా కృతజ్ఞతలు. అంతేకాదు, మీ అందరి మధ్య ఉండే ఈ కార్యక్రమానికి కాన్పూర్ రావాలని నా కోరిక. కానీ నేడు, ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి కూడా ఒక పెద్ద సందర్భం. ఈరోజు మన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా గిరిజన సమాజానికి చెందిన మహిళా అధ్యక్షురాలు దేశానికి నాయకత్వం వహించబోతున్నారు. ఇది మన ప్రజాస్వామ్య శక్తికి మరియు అందరినీ కలుపుకుపోవడానికి సజీవ ఉదాహరణ. ఈ సందర్భంగా ఇవాళ ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ బాధ్యతల కోసం నేను ఢిల్లీలో ఉండటం చాలా సహజమైనది మరియు అవసరం కూడా. అందుకే, నేను ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీతో చేరుతున్నాను.దివంగత హర్ మోహన్ సింగ్‌యాదవ్ 10 వ పుణ్యతిథి సందర్భంగా జరిగినకార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
July 25th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ దివంగత శ్రీ హర్ మోహన్ సింగ్ యాదవ్ 10 వ పుణ్యతిథి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. హర్ మోహన్ సింగ్ పార్లమెంటు మాజీ సభ్యుడు, ఎం.ఎల్.సి, ఎం.ఎల్.ఎ, శౌర్యచక్ర అవార్డు గ్రహీత, యాదవ కమ్యూనిటీ నాయకులు కూడా.జూన్ 3న ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
June 02nd, 03:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం లో జూన్ 3వ తేదీ నాడు ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. సుమారు ఉదయం 11 గంటల వేళ కు ప్రధాన మంత్రి లఖ్ నవూ లోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్ కు చేరుకొని, అక్కడ ‘యుపి ఇన్ వెస్టర్స్ సమిట్’ లో భాగం గా జరిగే భూమి పూజ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. మధ్యాహ్నం 1:45 నిమిషాల కు ప్రధాన మంత్రి కాన్ పుర్ లోని పరౌంఖ్ గ్రామాని కి వెళ్తారు. అక్కడ మాన్య రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ తో భేటీ అవుతారు. ఇరువురు పత్రి మాత మందిరాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత ఇంచుమించు మధ్యాహ్నం 2 గంటల వేళ కు వారు ఉభయులు డాక్టర్ బి.ఆర్. ఆంబేడ్ కర్ భవన్ కు చేరుకొంటారు. మధ్యాహ్నం 2:15 నిమిషాల కు మిలన్ కేంద్ర కార్యక్రమం ఉంటుంది. ఈ కేంద్రం మాన్య రాష్ట్రపతి పూర్వికుల ఇల్లు. దీని ని ప్రజల ఉపయోగార్థం విరాళం గా ఇవ్వడమైంది. ఒక సాముదాయిక కేంద్రం (మిలన్ కేంద్ర) గా దీనిని తీర్చిదిద్దడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 2గంటల 30నిమిషాలకు వారు పరౌంఖ్ గ్రామం లో జరిగే ఒక జన సభ కు హాజరు అవుతారు.Voting turnout in second phase polling in Uttar Pradesh points at BJP returning to power again: PM Modi
February 14th, 12:10 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”PM Modi addresses a public meeting in Kanpur Dehat, Uttar Pradesh
February 14th, 12:05 pm
Amidst the ongoing election campaigning in Uttar Pradesh, PM Modi’s rally spree continued as he addressed an election rally in Kanpur Dehat today. The Prime Minister expressed his gratitude towards the people for their support and said, “Voting is going on in the second phase in Uttar Pradesh, Uttarakhand and Goa today. I would urge all the voters, especially the first-time voters, to come out to vote in maximum numbers.”కాన్పూర్ మెట్రో ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని మోదీ, సీఎం యోగితో కలిసి రైడ్ చేశారు
December 28th, 02:11 pm
కాన్పూర్ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తయిన భాగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన సర్వీస్ ప్రారంభోత్సవం మరియు తనిఖీ తర్వాత, ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు.Double engine government knows how to set big goals and achieve them: PM Modi
December 28th, 01:49 pm
PM Narendra Modi inaugurated Kanpur Metro Rail Project and Bina-Panki Multiproduct Pipeline Project. Commenting on the work culture of adhering to deadlines, the Prime Minister said that double engine government works day and night to complete the initiatives for which the foundation stones have been laid.కాన్ పుర్ మెట్రోరైల్ ప్రాజెక్టు ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 28th, 01:46 pm
కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఆయన కాన్ పుర్ మెట్రో రైల్ ప్రాజెక్టు ను పరిశీలించారు. ఐఐటి మెట్రో స్టేశన్ నుంచి గీతా నగర్ వరకు మెట్రో లో ఆయన ప్రయాణించారు. ఆయన బీనా-పన్ కీ మల్టీ ప్రోడక్ట్ పైప్ లైన్ ప్రాజెక్టు ను కూడా ప్రారంభించారు. ఈ గొట్టపు మార్గం మధ్య ప్రదేశ్ లోని బీనా చమురు శుద్ధి కర్మాగారం నుంచి కాన్ పుర్ లోని పన్ కీ వరకు ఉండి, బీనా రిఫైనరీ నుంచి పెట్రోలియమ్ ఉత్పత్తులు ఈ ప్రాంతం లో అందుబాటు లోకి రావడానికి తోడ్పడనుంది. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురీ లు కూడా పాల్గొన్నారు.Embrace challenges over comforts: PM Modi at IIT, Kanpur
December 28th, 11:02 am
Prime Minister Narendra Modi attended the 54th Convocation Ceremony of IIT Kanpur. The PM urged the students to become impatient for a self-reliant India. He said, Self-reliant India is the basic form of complete freedom, where we will not depend on anyone.ఐఐటి కాన్ పుర్ 54వ స్నాతకోత్సవాని కి హాజరైన ప్రధాన మంత్రి; బ్లాక్ చైన్ ఆధారిత డిజిటల్ డిగ్రీ లనుఆయన ప్రారంభించారు
December 28th, 11:01 am
ఐఐటి కాన్ పుర్ లో ఈ రోజు న జరిగిన 54వ స్నాతకోత్సవాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరై, సంస్థాగత బ్లాక్ చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డిజిటల్ డిగ్రీ లను ఇచ్చారు.