జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 18th, 05:03 pm

జూన్ 17న కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు శ్రీ ఆంటోనియో కోస్టాతో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమై, అర్ధవంతమైన చర్చలు జరిపారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

June 18th, 03:17 pm

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కొరియా రిపబ్లిక్ అధ్యక్షుడు శ్రీ లీ జే మ్యాంగ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, గ్రీన్ హైడ్రోజన్, నౌకా నిర్మాణంతో పాటు మరిన్ని రంగాల్లో భారత్, కొరియా రిపబ్లిక్ కలసి పనిచేయాలని కోరుకొంటున్నాయని శ్రీ మోదీ అన్నారు.

జీ-7 సమావేశాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధ్యక్షులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 03:05 pm

జూన్ 17న కెనడా కననాస్కిస్ లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలతో సమావేశమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజా, బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లులా డిసిల్వాతో భేటీ కావడమే కాకుండా, సుహృద్భావపూర్వక వాతావరణంలో అర్ధవంతంగా చర్చలు జరిగాయి.

జీ-7 సమావేశాల్లో భాగంగా ఐరోపా కమిషన్ అధ్యక్షురాలితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 03:04 pm

జూన్ 17న కెనడా… కననాస్కిస్ లో జరిగిన జీ-7 సమావేశాల్లో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డర్ లెయన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫలవంతమైన చర్చలు నిర్వహించారు.

జీ-7 సమావేశాల నేపథ్యంలో జపాన్ ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

June 18th, 03:00 pm

జూన్ 17న కెనడా కననాస్కిస్ వేదికగా జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని శ్రీ షిగేరు యిషిబాతో సమావేశమై లోతైన చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరిన్ని రంగాలకు విస్తరించాలన్న నిబద్ధతకు ఇరు దేశాలూ కట్టుబడి ఉన్నాయని నేతలిద్దరూ పునరుద్ఘాటించారు.

జీ-7 సమావేశాల నేపథ్యంలో ఇటలీ ప్రధానమంత్రితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ మోదీ

June 18th, 02:59 pm

కెనడా దేశం కననాస్కిస్ లో జూన్ 17న జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ మోదీ, ఇటలీతో బలమైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని, ఈ బంధం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం కలిగించగలదని పేర్కొన్నారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ

June 18th, 02:57 pm

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అనేక అంశాలపై నేతలు ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకొన్నారు. మన భూమి హితాన్ని కోరుతూ భారత్, ఫ్రాన్స్ సన్నిహితంగా పనిచేస్తూనే ఉంటాయని వారు ఉద్ఘాటించారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాటామంతీ

June 18th, 02:55 pm

కెనడాలోని కననాస్కిస్‌లో ఈ నెల 17న జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ కైర్ స్టార్మర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. భారత్, బ్రిటన్‌ల సంబంధాలు దృఢతరంగా మారుతున్నాయనీ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన రెండు దేశాలూ ఎంతగా పురోగమించిందీ ఈ పరిణామం చాటిచెబుతోందనీ శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షునితో ప్రధానమంత్రి మాటామంతీ

June 18th, 02:51 pm

ఈ నెల 17న కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామాఫోజాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 02:49 pm

ఈ నెల 17వ తేదీన కెనడాలోని కననాస్కిస్‌లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంధోనీ అల్బనీజ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.

జీ7 శిఖరాగ్ర సమావేశంలో ఇంధన భద్రతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

June 18th, 11:15 am

జీ-7 శిఖరాగ్ర సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించి.. అపూర్వ స్వాగతం పలికిన ప్రధానమంత్రి కార్నీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జీ-7 కూటమి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న చారిత్రాత్మక సందర్భంలో మా మిత్రులందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను.

Prime Minister Narendra Modi addresses the G7 Outreach Session

June 18th, 11:13 am

PM Modi participated in the Outreach Session of the G7 Summit in Kananaskis and addressed a Session on 'Energy Security.' The PM highlighted that energy security was among the leading challenges facing future generations. While elaborating on India's commitment to inclusive growth, he noted that availability, accessibility, affordability and acceptability were the principles that underpinned India's approach to energy security.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ

June 18th, 08:02 am

అల్బెర్టాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా, ఈ రోజు జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నీ‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జర్మనీ ఛాన్సలర్‌తో భారత ప్రధాని భేటీ

June 17th, 11:58 pm

కెనడాలోని కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా గౌరవ జర్మనీ ఛాన్సలర్ శ్రీ ఫ్రెడరిక్ మెర్జ్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సమావేశమయ్యారు. ఈ ఏడాది మే నెలలో ఛాన్సలర్ గా మెర్జ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఎన్నికలలో విజయం సాధించి, పదవీ బాధ్యతలు స్వీకరించిన జర్మనీ ఛాన్సలర్‌ను భారత ప్రధానమంత్రి అభినందించారు. గతవారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై జర్మనీ ప్రభుత్వం సానుభూతి వ్యక్తం చేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

June 17th, 11:54 pm

కెనడాలో కననాస్కిస్‌లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మెక్సికో అధ్యక్షురాలు డాక్టర్ క్లౌడియా షైన్‌బామ్ పార్డోతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ నేతలు ఇద్దరూ సమావేశం కావడం ఇదే మొదటి సారి. మెక్సికో అధ్యక్షురాలి చరిత్రాత్మక గెలుపును దృష్టిలో పెట్టుకొని, ప్రధానమంత్రి ఆమెకు అభినందనలు తెలిపారు.

జూన్ 15 నుండి 19 వరకు సైప్రస్ రిపబ్లిక్, కెనడా మరియు క్రొయేషియాలో పర్యటించనున్న ప్రధాని మోదీ

June 14th, 11:58 am

ప్రధాని మోదీ జూన్ 15-16 తేదీలలో సైప్రస్‌లో, జూన్ 16-17 తేదీలలో జీ-7 శిఖరాగ్ర సమావేశానికి కెనడాకు మరియు జూన్ 18న క్రొయేషియాకు వెళతారు. ప్రధాని మోదీ సైప్రస్ అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో చర్చలు జరుపుతారు మరియు లిమాసోల్‌లో వ్యాపార నాయకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తరువాత కెనడాలో, జీ7 శిఖరాగ్ర సమావేశంలో, ప్రధాని మోదీ జీ-7 దేశాల నాయకులతో అభిప్రాయాలను మార్పిడి చేసుకుంటారు. క్రొయేషియాలో, ప్రధాని మోదీ పీఎం ప్లెన్కోవిక్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు మరియు క్రొయేషియా అధ్యక్షుడు జోరాన్ మిలనోవిక్‌తో సమావేశమవుతారు.

కననాస్కిస్‌లో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధానమంత్రిని ఆహ్వానించిన కెనడా ప్రధాని శ్రీ మార్క్ కార్నే

June 06th, 07:12 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కెనడా ప్రధానమంత్రి శ్రీ మార్క్ కార్నే ఫోన్ చేసి మాట్లాడారు.