PM Modi expresses gratitude to world leaders for birthday wishes
September 17th, 03:03 pm
The Prime Minister Shri Narendra Modi expressed his gratitude to the world leaders for greetings on his 75th birthday, today.ట్రినిడాడ్ అండ్ టొబాగోకు ప్రధాని అధికారిక పర్యటనపై సంయుక్త ప్రకటన
July 05th, 09:02 am
గత 26 ఏళ్లలో భారత ప్రధానమంత్రి ఆ దేశంలో చేపట్టిన తొలి ద్వైపాక్షిక పర్యటన ఇది. ట్రినిడాడ్ అండ్ టొబాగోకు భారతీయుల వలస వెళ్లి180 ఏళ్లు (1845లో) నిండిన నేపథ్యంలో ఈ కీలక పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య చిరకాల మైత్రికి ప్రాతిపదికగా నిలిచిన బలమైన నాగరికతా సంబంధాలు, ఉత్తేజకరమైన ప్రజా సంబంధాలు, ఉమ్మడి ప్రజాస్వామిక విలువలను ఈ పర్యటన మరోసారి ప్రపంచానికి చాటింది.ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి
July 04th, 11:51 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని రెడ్ హౌస్‌లో ట్రినిడాడ్ టొబాగో రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసాతో భేటీ అయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయం సాధించి రెండోసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెకు అభినందనలు తెలిపారు. తనకు అపూర్వ స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు.ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 09:30 pm
గర్వించదగిన ప్రజాస్వామ్యానికీ, స్నేహపూర్వక దేశానికి ప్రతినిధులుగా ఎన్నికైన మీ ముందు నిలబడటం నాకు ఎంతో గౌరవంగా ఉంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
July 04th, 09:00 pm
ట్రినిడాడ్ అండ్ టొబాగో పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. సెనేట్ అధ్యక్షులు వాడే మార్క్, దిగువ సభ స్పీకర్ జగదేవ్ సింగ్ ఆహ్వానం మేరకు హాజరైన ఆయన.. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించారు. భారతదేశం, ట్రినిడాడ్ అండ్ టొబాగో ద్వైపాక్షిక సంబంధాలలో ఇది ఒక కీలక కార్యక్రమంగా నిలిచిపోతుంది.PM Modi conferred with highest national award, the ‘Order of the Republic of Trinidad & Tobago
July 04th, 08:20 pm
PM Modi was conferred Trinidad & Tobago’s highest national honour — The Order of the Republic of Trinidad & Tobago — at a special ceremony in Port of Spain. He dedicated the award to the 1.4 billion Indians and the historic bonds of friendship between the two nations, rooted in shared heritage. PM Modi also reaffirmed his commitment to strengthening bilateral ties.ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా ఇచ్చిన సంప్రదాయ విందుకు హాజరైన ప్రధాని
July 04th, 09:45 am
ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా ఆతిథ్యమిచ్చిన సంప్రదాయ విందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని ఇచ్చిన విందులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీకి ఆహారాన్ని సొహారీ ఆకులో వడ్డించారు. ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో పౌరులకు ముఖ్యంగా భారతీయ ముూలాలున్న వారికి సాంస్కృతికంగా విశిష్టత కలిగిన అంశం.రామ మందిరం నమూనా, పవిత్ర జలాన్నీ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రికి బహూకరించిన ప్రధానమంత్రి
July 04th, 08:57 am
అయోధ్యలోని రామ మందిరం నమూనాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసాకు బహుమతిగా ఇచ్చారు. తన గౌరవార్థం ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి ఇచ్చిన విందు సందర్భంగా, ఈ కానుకను శ్రీ మోదీ ఆమెకు అందజేశారు. సరయూ నదికి చెందిన పవిత్ర జలాన్నీ, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్‌ను నిర్వహించిన సందర్భంగా సేకరించిన పవిత్ర జలాన్నీ ప్రధానమంత్రి ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రికి బహూకరించారు.ట్రినిడాడ్, టొబాగో దేశంలోని ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 04th, 05:56 am
ఈ సాయంత్రం వేళ ఇలా మీ అందరినీ కలవడం గర్వాన్నీ, అమితానందాన్నీ ఇస్తోంది. చక్కని ఆతిథ్యమిచ్చి, నా గురించి ఆత్మీయంగా మాట్లాడిన ప్రధానమంత్రి కమ్లా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు!ట్రినిడాడ్ టొబాగోలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 04:40 am
ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ మోదీని ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమ్లా ప్రెసాద్ బిసెసా స్వాగతిస్తూ, ట్రినిడాడ్ టొబాగోలో అత్యున్నత జాతీయ పురస్కారమైన ‘‘ద ఆర్డర్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ టొబాగో’’తో ఆయనను సత్కరించనున్నట్లు ప్రకటించారు. ఈ గౌరవాన్ని తనకు ఇస్తున్నందుకు ఆమెతో పాటు ట్రినిడాడ్ టొబాగో ప్రజానీకానికి తన హృదయపూర్వక కృతజ్ఞతలను ప్రధానమంత్రి తెలియజేశారు.ట్రినిడాడ్ టొబాగోలో ఆధికారిక పర్యటనకు గాను పోర్ట్ ఆఫ్ స్పెయన్‌కు చేరుకొన్న ప్రధానమంత్రి
July 04th, 02:16 am
ట్రినిడాడ్ టొబాగోలో గురు, శుక్రవారాల్లో.. అంటే 2025 జులై 3, 4 తేదీల్లో.. ఆధికారిక పర్యటన కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు చేరుకొన్నారు. 1999 తరువాత, భారతదేశ ప్రధానమంత్రి ఒకరు ట్రినిడాడ్ టొబాగోలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇరుదేశాల మధ్య ఉన్న లాంఛనపూర్వక, సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకొని శ్రీ నరేంద్ర మోదీకి ప్రధానమంత్రి గౌరవ కమ్లా ప్రెసాద్ బిసెసా స్వయంగా స్వాగతం పలికారు. ఆమెతో పాటు మంత్రిమండలి సభ్యులు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రికి సంప్రదాయబద్ధ గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.ట్రినిడాడ్, టొబాగోలో ఎన్నికల విజయంపై శ్రీమతి కమలా పెర్సాద్-బిస్సేస్సార్‌ను అభినందించిన ప్రధాని
April 29th, 03:02 pm
ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీమతి కమలా పెర్సాద్- బిస్సేస్సార్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్ - ట్రినిడాడ్, టొబాగో మధ్య చరిత్రాత్మకంగా సన్నిహిత, కుటుంబ సంబంధాలున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.