అస్సాంలో ఎన్ హెచ్ -715 లోని కాలీబోర్ - నుమాలిగఢ్ సెక్షన్‌ రహదారిని

October 01st, 03:26 pm

అస్సాంలో కాజీరంగా జాతీయ పార్కు (కేఎన్పీ) మార్గంలో ప్రతిపాదించిన వన్యప్రాణుల సంరక్షణ చర్యలను అమలు చేయడంతో సహా, జాతీయ రహదారి 715 లోని కాలీబోర్ - నుమాలిగఢ్ సెక్షన్ రహదారిని నాలుగు లైన్లుగా వెడల్పు చేయడానికి, మెరుగుపరచడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్ స్ట్రక్షన్ (ఈపీపీ) పద్ధతిలో మొత్తం 85.675 కిలోమీటర్ల పొడవున రూ 6957 కోట్ల పెట్టుబడి వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తారు.