వారణాసిలో 72 వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 04th, 01:00 pm

ఉత్తరప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, యూపీ ప్రభుత్వ మంత్రులు - సోదరులు రవీంద్ర జైస్వాల్, దయాశంకర్, గిరీష్ యాదవ్, బనారస్ మేయర్ - సోదరుడు అశోక్ తివారీ, ఇతర ప్రజాప్రతినిధులు, వాలీబాల్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, దేశం నలుమూలల నుంచి నుండి విచ్చేసిన క్రీడాకారులు, కాశీలో ఉన్న నా కుటుంబ సభ్యులకు నమస్కారం.

వారణాసిలో 72వ జాతీయ వాలీబాల్ పోటీలను వీడియో మాధ్యమం ద్వారా ప్రారంభించిన ప్రధాని

January 04th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న 72వ జాతీయ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన క్రీడాకారులందరికీ స్వాగతం పలికి అభినందించడం పట్ల వారణాసి పార్లమెంటు సభ్యునిగా సంతోషంగా ఉందని తెలిపారు. నేటి నుంచి నగరంలో జాతీయ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులు ఎంతో కష్టపడి ఈ జాతీయ స్థాయి పోటీలకు వచ్చారని.. రాబోయే రోజుల్లో వారణాసి గడ్డపై వారి కృషికి పరీక్ష ఎదురుకానుందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి జట్లు ఇక్కడకు చేరుకున్నాయని.. ఇది 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోందని అభివర్ణించారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న వారందరికీ ప్రధాన మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

పోలిష్ కబడ్డీ క్రీడాకారులతో ప్రధాన మంత్రి సమావేశం

August 22nd, 09:48 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పోలాండ్ లోని వార్సాలో పోలెండ్ కబడ్డీ ఫెడరేషన్ అధ్యక్షుడు మీహాల్ ష్పిజ్ కోవ్, సభ్యురాలు అన్నా కాల్బార్చిక్ తో సమావేశమయ్యారు. పోలాండ్‌లో కబడ్డీని పురోగమనంలోనూ, యూరప్‌లో క్రీడను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలోనూ ష్పిజ్ కోవ్, కాల్బార్చిక్‌లు అంకితభావంతో కృషి చేశారని ప్రధాన మంత్రి ప్రశంసించారు. భారతదేశం, పోలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడంలో క్రీడల పాత్ర ఎంతో ఉందని ప్రధాని అన్నారు.