జర్మనీ విదేశాంగ మంత్రితో భారత ప్రధాని భేటీ

September 03rd, 08:40 pm

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌తో భేటీ అయ్యారు. ‘‘భారత్, జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా, చైతన్యవంతమైన ఆర్థిక వ్యవస్థలుగా.. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణ, సుస్థిరత, తయారీ, రవాణా సహా ఉమ్మడి ప్రయోజనాలున్న అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు విస్తృత అవకాశాలు స్పష్టంగా మన కళ్లముందున్నాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.