అస్సాం గౌహతిలో ఏర్పాటైన ఝుమోయిర్ బినందిని కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 24th, 06:40 pm

గౌరవనీయ అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వశర్మ, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు డాక్టర్ ఎస్. జయశంకర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా, ఇతర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, కళాకారులు, అస్సాం సోదర సోదరీమణులు...

అస్సాంలోని గౌహతిలో ఝుమోయిర్ బినందిని కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి

February 24th, 06:39 pm

అస్సాంలోని గౌహతిలో ఒక భారీ ఝుమోర్ కార్యక్రమం అయిన ‘ఝుమోర్ బినందిని 2025’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొన్నారు. ఆహూతులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ఈ కార్యక్రమంలో ఎటు చూసినా శక్తి, ఉత్సాహం, ఉత్సుకత వెల్లివిరుస్తున్నాయన్నారు. ఝుమోయిర్ కళాకారులు వారు పనిచేసే తేయాకు తోటల్లోని సుగంధాన్ని, శోభను తమ నృత్యంలో ఆవిష్కరించారంటూ ఆయన ప్రశంసలను కురిపించారు. ఝూమోయిర్‌తోనూ, తేయాకు తోటల సంస్కృతితోనూ ప్రజలకొక విశిష్ట అనుబంధం ఉన్నట్లే ఈ విషయంలో తాను కూడా ఇదే తరహా అనుభూతిని పొందానని ఆయన అభివర్ణించారు. ఇంత పెద్ద సంఖ్యలో కళాకారులు ఈ రోజు ప్రదర్శించిన ఝూమోయిర్ నృత్యం ఒక రికార్డును సృష్టించగలదని కూడా ఆయన అన్నారు. 2023లో తాను అస్సాంను సందర్శించినప్పుడు కూడా 11,000 మంది కళాకారులు బిహూ నృత్యం చేయగా అదొక రికార్డును సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. అది తాను మరచిపోలేని ఓ జ్ఞాపకమని చెబుతూ అలాంటి ఒక సమ్మోహక ప్రదర్శనను తిలకించడానికి తాను సంసిద్ధుడినై వచ్చినట్లు చెప్పారు. ఒక ఉజ్వల సాంస్కృతిక ప్రదర్శనను ఏర్పాటు చేసినందుకు అస్సాం ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ రోజు అస్సాంకూ, తేయాకు తోటల్లో పనిచేసేవారికి, వేడుకల్లో పాలుపంచుకొనే ఆదివాసీలకు గర్వించాల్సిన రోజు అని ఆయన అన్నారు. ఈ ప్రత్యేకమైన రోజున అందరికీ ఆయన తన శుభాకాంక్షలను తెలియజేశారు.