ఒడిశాలోని ఝార్సుగూడలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 27th, 11:45 am

ఇక్కడి కొంతమంది యువ మిత్రులు అనేక కళాకృతులను తీసుకువచ్చారు. ఒడిశాకు కళ పట్ల ఉన్న ప్రేమ ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మీ అందరి నుంచి నేను ఈ కానుకలను స్వీకరిస్తాను.. ఈ కానుకలన్నీ మీ నుంచి సేకరించమని నా ఎస్‌పీజీ సహచరులను నేను అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పేరు, చిరునామాను వెనుక రాసి ఇస్తే మీకు కచ్చితంగా నా నుంచి ఒక లేఖ వస్తుంది. అక్కడ వెనకాల ఒక అబ్బాయి చాలాసేపు ఏదో పట్టుకుని ఉన్నట్లు నేను చూస్తున్నాను. అతని చేతులు నొప్పి పెట్టవచ్చు.. దయచేసి అతనికి సహాయం చేసి దానిని కూడా సేకరించండి. వెనక మీ పేరు, చిరునామా రాసి ఉంటే, నేను కచ్చితంగా మీకు లేఖ రాస్తాను. ఈ కళాకృతులను తయారు చేసినందుకు.. మీ అభిమానానికీ.. యువతీయువకులకు, చిన్న పిల్లలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

September 27th, 11:30 am

ఒడిశాలోని ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత నవరాత్రి పండగ రోజుల్లో మాతా సమలేయ్, మాతా రామచండీలు కొలువైన పవిత్ర భూమిని సందర్శించి.. ఇక్కడి ప్రజలను కలిసే అదృష్టం తనకు లభించిందని శ్రీ మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తల్లులు, ఆడపడుచులు పాల్గొనడం ఆనందంగా ఉందన్న ప్రధానమంత్రి.. వారి ఆశీర్వాదాలే నిజమైన బలమన్నారు. ప్రజలకు వందనాలు తెలిపిన ఆయన.. అందరికీ శుభాకాంక్షలూ తెలిపారు.

ఈ నెల 27 ఒడిశాలో ప్రధానమంత్రి పర్యటన

September 26th, 09:05 pm

టెలికాం కనెక్టివిటీ రంగంలో స్వదేశీ టెక్నాలజీతో.. దాదాపు రూ.37,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 97,500కి పైగా మొబైల్ 4జీ టవర్లను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసిన 92,600కి పైగా 4జీ టెక్నాలజీ ప్రాంతాలు కూడా వీటిలో భాగంగా ఉన్నాయి. డిజిటల్ భారత్ నిధి కింద 18,900కి పైగా 4జీ ప్రాంతాలకు నిధులు సమకూర్చగా.. మారుమూల, సరిహద్దు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని అనుసంధానం లేని దాదాపు 26,700 గ్రామాలను ఇవి అనుసంధానిస్తూ 20 లక్షలకు పైగా కొత్త చందాదారులకు సేవలు అందిస్తాయి. ఈ టవర్లు సౌరశక్తితో పనిచేస్తూ.. దేశంలో అతిపెద్ద గ్రీన్ టెలికాం సైట్‌ల సమూహంగా, సుస్థిరమైన మౌలిక సదుపాయాల్లో కీలక ముందడుగుగా నిలుస్తాయి.