రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి.రాధాకృష్ణన్ సత్కార కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

December 01st, 11:15 am

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ సభలోని గౌరవనీయ సభ్యులందరికీ ఇది గర్వకారణమైన రోజు. ఈ సందర్భంగా మీకు మా సాదర స్వాగతం... మీ మార్గదర్శకత్వాన ఈ సభలో కీలకాంశాల చర్చకు, తద్వారా దేశాన్ని ప్రగతి పథంలో నడపడానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగా మీ అమూల్య మార్గదర్శనం లభించడం మాకందరికీ ఒక గొప్ప అవకాశం. ఈ మేరకు సభ తరపున, నా తరపున మీకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గౌరవనీయ సభ్యులందరూ ఈ ఎగువ (రాజ్య)సభ మర్యాదను సదా పరిరక్షిస్తారని, చైర్మన్‌గా మీ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుతారని వాగ్దానం చేస్తున్నాను.. ఇది మీకు నేనిస్తున్న హామీ.

రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌ సన్మాన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు

December 01st, 11:00 am

రాజ్యసభకు తొలిసారి అధ్యక్షత వహించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్వాగతం పలికారు. గౌరవ రాజ్యసభ సభ్యులందరికీ ఈ రోజు గర్వకారణమని ప్రధానమంత్రి అభివర్ణించారు. చైర్మన్‌కు సాదర స్వాగతం పలుకుతూ.. “సభ తరఫున, నా తరఫున మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా అభినందనలు, శుభకామనలు. అత్యున్నతమైన ఈ సభా మర్యాదను గౌరవ సభ్యులందరూ ఎప్పటి మాదిరే కాపాడతారని, మీతో వారంతా విజ్ఞతతో వ్యవహరిస్తారని అనుకుంటున్నాను. ఇందుకు నాదీ హామీ” అని శ్రీ మోదీ భరోసా ఇచ్చారు.

గుజరాత్‌లోని దేడియాపడలో గిరిజ‌న ఆత్మ‌గౌర‌వ దినోత్స‌వం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

November 15th, 03:15 pm

గిరిజన ఆత్మగౌరవ దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 15th, 03:00 pm

ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని గుజరాత్‌లోని దేడియాపాడలో జన్‌జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రసంగించారు. ఈ సందర్భంగా రూ.9,700 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నర్మదా మాత పవిత్ర భూమి ఇవాళ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందని, అక్టోబరు 31న ఇక్కడే సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా భారతదేశ ఏకత్వాన్ని, భిన్నత్వాన్ని చాటి చెప్పేందుకు భారత్ పర్వ్‌ను ప్రారంభించినట్లు శ్రీ నరేంద్ర మోదీ గుర్తుచేసుకున్నారు. ఈరోజు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా, భారత్ పర్వ్ పరమావధికి చేరుకుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఈ శుభ సందర్భంగా భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన గోవింద్ గురు ఆశీస్సులు ఈ కార్యక్రమంపై ఉంటాయని ప్రధానమంత్రి అన్నారు. వేదికపై నుంచి గోవింద్ గురుకు గౌరవ వందనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం దేవ్‌మోగ్రా మాత ఆలయాన్ని సందర్శించే అదృష్టం కలిగిందన్న ప్రధానమంత్రి.. ఆ మాత పాదాల వద్ద శిరస్సు వంచి ప్రణమిల్లినట్లు తెలిపారు.

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

November 15th, 08:22 am

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జార్ఖండ్ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సజీవ గిరిజన సంస్కృతికి ఆలవాలమైన పుణ్యభూమి జార్ఖండ్ అని ఆయన కొనియాడారు. భగవాన్ బిర్సా ముండా శౌర్య పరాక్రమాలను గుర్తుచేసిన ఆయన.. ధైర్యం, ఆత్మగౌరవం, అలుపెరుగని పోరాటాల స్ఫూర్తిదాయక గాథలతో కూడిన చరిత్ర ఈ పవిత్ర నేలకు ఉందని పేర్కొన్నారు.

ప్రధానితో జార్ఖండ్ గవర్నర్ భేటీ

November 10th, 06:43 pm

జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

'వందేమాతరం' స్ఫూర్తి భారతదేశ అమర చైతన్యంతో ముడిపడి ఉంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

October 26th, 11:30 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, అక్టోబర్ 31న సర్దార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు నివాళులర్పించారు. ఛత్ పూజ పండుగ, పర్యావరణ పరిరక్షణ, భారతీయ కుక్క జాతులు, భారతీయ కాఫీ, గిరిజన సమాజ నాయకులు మరియు సంస్కృత భాష యొక్క ప్రాముఖ్యత వంటి ఆసక్తికరమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. 'వందేమాతరం' పాట 150వ సంవత్సరం గురించి ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

స్వదేశీ ఉత్పత్తులు, వోకల్ ఫర్ లోకల్ : మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ పండుగ పిలుపు

September 28th, 11:00 am

ఈ నెల మన్ కీ బాత్ ప్రసంగంలో, భగత్ సింగ్ మరియు లతా మంగేష్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ వారికి నివాళులర్పించారు. భారతీయ సంస్కృతి, మహిళా సాధికారత, దేశవ్యాప్తంగా జరుపుకునే వివిధ పండుగలు, ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాల ప్రయాణం, పరిశుభ్రత మరియు ఖాదీ అమ్మకాల పెరుగుదల వంటి ముఖ్యమైన అంశాల గురించి కూడా ఆయన మాట్లాడారు. దేశాన్ని స్వావలంబన చేసుకునే మార్గం స్వదేశీని స్వీకరించడంలోనే ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.

బీహార్‌లోని భక్తియార్‌పూర్ - రాజ్‌గిర్ - తిలైయ్య సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ ను (104 కి.మీ)

September 24th, 03:05 pm

బీహార్‌లోని భక్తియార్‌పూర్ - రాజ్‌గిర్ - తిలైయ్య సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ ను డబ్లింగ్ చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఆమోదం తెలిపింది. 104 కిలోమీటర్ల పొడవున్న ఈ రైల్వే లైను ప్రాజెక్టును రూ. 2,192 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్నారు.

బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల మీదుగా... భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ) డబ్లింగ్ రూ.3,169 కోట్ల వ్యయం... క్యాబినెట్ ఆమోదం

September 10th, 03:05 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన సమావేశంలో బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని భాగల్పూర్-దుమ్కా-రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ (177 కి.మీ.)ను మొత్తం సుమారు రూ.3,169 కోట్ల వ్యయంతో డబ్లింగ్ చేసేందుకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది.

ఆగస్టు 22న బిహార్, పశ్చిమ బెంగాల్ లో పర్యటించనున్న ప్రధాని

August 20th, 03:02 pm

ఆగస్టు 22న బీహార్, పశ్చిమ బెంగాల్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బిహార్ లోని గయలో ఉదయం 11 గంటలకు రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభించనున్నారు. అక్కడే రెండు రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించి, సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత గంగా నదిపై నిర్మించిన ఆంటా- సిమారియా వంతెనను సందర్శించి ప్రారంభిస్తారు.

శ్రీ శిబు సోరెన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

August 04th, 10:27 am

శ్రీ శిబు సోరెన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. గిరిజన తెగలు, పేదలు, అణగారిన వర్గాల వారిని సాధికార పరచడంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడారు.

జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో రోడ్డు ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

July 29th, 10:34 am

జార్ఖండ్‌లోని దేవ్‌ఘర్‌లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.

భారతీయ రైల్వేల్లో రెండు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు మంత్రిమండలి ఆమోదం... ఝార్ఖండ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఏడు జిల్లాలకు ఈ ప్రాజెక్టులతో మేలు... సుమారు 318 కి.మీ. మేర పెరగనున్న ప్రస్తుత రైల్వే నెట్‌వర్క్

June 11th, 03:05 pm

రైల్వే మంత్రిత్వ శాఖ రూ.6,405 కోట్ల మొత్తం వ్యయంతో ప్రతిపాదించిన రెండు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన గల ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు:-

అనువాదం: 17వ పౌర సేవల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం

April 21st, 11:30 am

నా మంత్రివర్గ సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, శ్రీ శక్తికాంత దాస్ గారు, డాక్టర్ సోమనాథన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్‌కు చెందిన సహచరులు, మహిళలు, పెద్దలు.. !

17వ సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 21st, 11:00 am

ఈ రోజు న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో 17వ సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సివిల్ సర్వెంట్లనుద్దేశించి ప్రసంగించారు. ప్రజాపాలన (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌)లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి శ్రేష్ఠత అవార్డులను ప్రదానం చేశారు. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ మోదీ, సివిల్ స‌ర్వీసెస్ డే సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ సంవ‌త్సరం రాజ్యాంగం 75వ సంవత్సరాల వేడుకలు, స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ 150వ జ‌యంతి ఉత్సవాల సంద‌ర్భంగా సివిల్ సర్వీసెస్ డే మరింత విశిష్ఠతను సంతరించుకుందన్నారు. అలనాడు 1947 ఏప్రిల్ 21న సర్దార్ పటేల్ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ, సర్దార్ సివిల్ సర్వెంట్లను ‘భారత దేశ ఉక్కు కవచం’గా అభివర్ణించారని గుర్తు చేశారు. పూర్తి అంకితభావంతో పని చేస్తూ, క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే పాలనా యంత్రాంగాన్ని పటేల్ కోరుకున్నారని చెప్పారు. వికసిత్‌ భారత్‌ ఆశయ సాకారంలో సర్దార్ పటేల్ ఆదర్శాలు దారిదీపాలంటూ, పటేల్ దార్శనికత, వారసత్వానికి హృదయపూర్వక నివాళి అర్పించారు.

ప్రధానమంత్రితో జార్ఖండ్ గవర్నర్ సమావేశం

March 18th, 12:09 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గాంగ్వార్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ కు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

November 28th, 07:27 pm

జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ప్రధానమంత్రితో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి భేటీ

November 26th, 05:21 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్, ఆ రాష్ట్ర ఎమ్ఎల్ఏ గా ఎన్నికైన శ్రీమతి కల్పన సోరెన్ ఈ రోజు సమావేశమయ్యారు.

Maharashtra has witnessed the triumph of development, good governance, and genuine social justice: PM Modi

November 23rd, 10:58 pm

Prime Minister Narendra Modi addressed BJP workers at the party headquarters following the BJP-Mahayuti alliance's resounding electoral triumph in Maharashtra. He hailed the victory as a decisive endorsement of good governance, social justice, and development, expressing heartfelt gratitude to the people of Maharashtra for trusting BJP's leadership for the third consecutive time.