ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
February 22nd, 01:30 pm
బాబా ఔఘర్‌నాథ్ పుణ్యభూమి, విప్లవనేల మీరట్‌లో ఇవాళ వికసిత్ ఉత్తరప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు నూతనోత్తజం పరుగులు పెడుతోంది. తొలిసారిగా ఒకే వేదిక నుంచి నమో భారత్ రాపిడ్ రైలు, మెట్రో సర్వీసులు ప్రారంభమమయ్యాయి. అభివృద్ధి చెందిన భారతదేశంలోని రవాణా వ్యవస్థకు ఇది అద్భుతమైన ఉదాహరణ. నగరంలో ప్రయాణించేందుకు మెట్రో, జంట నగరాల అనుసంధానానికి అత్యాధునిక నమో భారత్ రైలు అందుబాటులోకి వచ్చాయి. అభివృద్ధిలో ఉత్తరప్రదేశ్ కీలకఘట్టానికి చేరుకున్నందుకు నాకు సంతృప్తిగా ఉంది.భారత తొలి నమో భారత్ ఆర్ ఆర్ టీ ఎస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ; ఢిల్లీ - మీరట్ నమో భారత్ కారిడార్ జాతికి అంకితం
February 22nd, 01:12 pm
మీరట్‌లో నమో భారత్ రాపిడ్ రైల్, మీరట్ మెట్రో మార్గాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును 'వికసిత ఉత్తరప్రదేశ్' 'వికసిత భారత్' కోసం ఒక సరికొత్త శక్తిగా ఆయన అభివర్ణించారు. భారతదేశంలో ఒకే ప్లాట్‌ఫారమ్ నుంచి రాపిడ్ రైల్, మెట్రో సర్వీస్ రెండూ ఒకే రోజు ప్రారంభం కావడం ఇదే తొలిసారి.