మార్చి 28న పీఎం ఉత్తరప్రదేశ్ పర్యటన
March 26th, 09:52 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 28, 2026న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 11:30కి గౌతమబుద్ధ నగర్‌లోని జేవార్ వద్దనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, టెర్మినల్ భవనాన్ని పరిశీలిస్తారు. 12 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ఫేజ్-Iను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.ఉత్తరప్రదేశ్, హర్యానా మధ్య ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (ఢిల్లీ-ఫరీదాబాద్-బల్లభ్‌గఢ్-సోహ్నా అనుసంధాన రహదారి) నుంచి జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణానికి సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
March 10th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇవాళ జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలో ఉత్తరప్రదేశ్, హర్యానా మధ్య ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే (ఢిల్లీ-ఫరీదాబాద్-బల్లభ్‌గఢ్-సోహ్నా అనుసంధాన రహదారి) నుంచి జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ కనెక్టివిటీ నిర్మాణం కోసం సవరించిన అంచనా వ్యయం రూ.3630.77 కోట్లకు ఆమోదం లభించింది.