అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో ప్రధానమంత్రి భేటీ
July 06th, 01:48 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అర్జెంటీనా అధ్యక్షుడు గౌరవ జేవియర్ మిలీతో భేటీ అయ్యారు. కాసా రోసాడాకు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు మిలీ సాదరంగా స్వాగతం పలికారు. నిన్న బ్యూనస్ ఎయిర్స్ చేరుకున్న ప్రధానమంత్రికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. 57 సంవత్సరాల తర్వాత అర్జెంటీనాలో భారత ప్రధానమంత్రి తొలి ద్వైపాక్షిక పర్యటన కావడంతో ఈ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో భారత్-అర్జెంటీనా సంబంధాలకు ఇది ఒక కీలక సంవత్సరం. తమకు ఆత్మీయ స్వాగతం పలికిన అధ్యక్షుడు మిలీకి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.PM Modi arrives in Buenos Aires, Argentina
July 05th, 07:23 am
Prime Minister Narendra Modi arrived in Argentina a short while ago. He will hold bilateral talks with President Milei.ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి వీడ్కోలు సందేశం
July 02nd, 07:34 am
జూలై 6,7 తేదీల్లో రియో డి జనీరోలో ఏర్పాటైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి నేను హాజరవుతాను. ఆర్థికంగా పైకెదుగుతున్న దేశాల మధ్య సహకారం పెంపొందించే వేదికగా బ్రిక్స్ పాత్రను గుర్తెరిగిన భారత్, వ్యవస్థాపక దేశంగా తన నిబద్ధతను మరోసారి చాటుతోంది. శాంతి, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు నెలకొన్న నిష్పక్షపాత, సమాన అధికారాలు గల ప్రపంచ నిర్మాణం ఆశయంగా సభ్య దేశాలు కృషిని కొనసాగిస్తాయి. ఇక, సమావేశాల నేపథ్యంలో నేను పలు ప్రపంచ నేతలతో సమావేశమవుతాను. ఆరు దశాబ్దాల వ్యవధి తరువాత భారత ప్రధాని చేపట్టే ద్వైపాక్షిక అధికారిక పర్యటనలో భాగంగా నేను బ్రెస్సీలియా వెళ్ళనున్నాను. బ్రెజిల్ దేశంతో గల సన్నిహిత సంబంధాల బలోపేతం కోసం నేను ఈ అవకాశాన్ని వినియోగించుకుంటాను. గ్లోబల్ సౌత్ ప్రాధాన్యాలను ముందుకు తీసుకువెళ్ళే అవకాశాలను నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వాతో చర్చిస్తాను.ఘనా, ట్రినిడాడ్ - టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాల్లో పర్యటించనున్న ప్రధానమంత్రి (జూలై 02 - 09)
June 27th, 10:03 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 2, 3 తేదీల్లో ఘనాలో పర్యటించనున్నారు. ఘనాలో ఇదే ఆయనకు తొలి ద్వైపాక్షిక పర్యటన. మూడు దశాబ్దాల అనంతరం భారత ప్రధానమంత్రి ఘనాలో పర్యటించడం ఇదే ప్రథమం. ఈ పర్యటనలో భాగంగా బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని సమీక్షించడం.. ఆర్థిక, ఇంధన, రక్షణ రంగాల్లో సహకారం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడం, అభివృద్ధిలో సహకారాత్మక భాగస్వామ్యం వంటి అంశాలపై ఘనా అధ్యక్షుడితో ప్రధానమంత్రి చర్చించనున్నారు. ఈ పర్యటన.. ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరచడం, ఈసీవోడబ్ల్యూఏఎస్ (ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్), ఆఫ్రికన్ యూనియన్‌లతో భారత్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం పట్ల ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.అర్జెంటీనా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ మోదీ
November 20th, 08:09 pm
రియో డి జనీరో లో జరుగుతున్న జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవంబర్ 19న అర్జెంటీనా (ఆర్జెంటీన్ రిపబ్లిక్) అధ్యక్షుడు శ్రీ జేవియర్ మిలే తో సమావేశమయ్యారు.అర్జెంటీనా అధ్యక్ష ఎన్నికల లో గెలిచినందు కు గాను శ్రీ జేవియర్ మిలయ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
November 20th, 05:00 pm
‘‘అధ్యక్ష ఎన్నికల లో గెలుపు ను సాధించినందుకు గాను శ్రీ @JMilei కి ఇవే అభినందన లు. భారతదేశం-అర్జెంటీనా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని వైవిధ్యభరితం గా తీర్చిదిద్దడం కోసం మరియు ఆ భాగస్వామ్యాన్ని విస్తరించడం కోసం మీతో కలసి పాటు పడాలని నేను ఆశ పడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.