ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్ రక్షణ మంత్రి భేటీ
August 20th, 09:04 pm
భారత్‌లో అధికారిక పర్యటన సందర్భంగా నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో జపాన్ రక్షణశాఖ మంత్రి షింజిరో కొయిజుమి సమావేశమయ్యారు.16వ భారత్-జపాన్ వార్షిక సదస్సు కోసం జపాన్‌లో ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా వెలువడిన నిర్ణయాలు
July 02nd, 10:39 pm
సెమీకండక్టర్లు, కీలక ఖనిజాలు, ఏఐతో కూడిన సమాచార, కమ్యూనికేషన్ సాంకేతికత, స్వచ్ఛ సాంకేతికత, ఔషధాలు వంటి కీలక రంగాల్లో ఉమ్మడి దృఢత్వాన్ని పెంపొందించడం కోసం ప్రాజెక్ట్ ఆధారిత సహకారాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. ఈ కీలక రంగంలో పెరుగుతున్న భారత్-జపాన్ జీటూజీ (ప్రభుత్వాల మధ్య), బీటూబీ (వ్యాపారాల మధ్య) భాగస్వామ్యాన్ని 'ఇండియా-జపాన్ ఫ్యాక్ట్ షీట్ 2.0' స్పష్టంగా తెలియజేస్తుంది.ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సు సందర్భంగా సంయుక్త ప్రకటన
July 02nd, 10:22 pm
జూలై 1 నుంచి 3, 2026 వరకు జరిగే ఇండియా-జపాన్ 16వ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు భారత ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధానమంత్రి గౌరవ శ్రీమతి తకాయిచి సనాయె భారత్‌కు విచ్చేశారు. ప్రధానమంత్రి తకాయిచితో పాటు ఉన్నతాధికారులు, సీఈఓలు, పరిశ్రమల ప్రముఖులతో పాటు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భారత్ పర్యటనకు వచ్చింది. ప్రధానమంత్రి తకాయిచి భారతదేశంలో అధికారికంగా పర్యటించటం ఇదే తొలిసారి.కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో సహకారంపై భారత్ - జపాన్ సంయుక్త ప్రకటన
July 02nd, 10:14 pm
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, పరిశ్రమలూ - వ్యాపారాలూ, పాలన, భద్రతా రంగాల్లో విప్లవాత్మక మార్పులను తెస్తూ.. సర్వోపయోగకర సాంకేతికతగా నేటి కాలాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తోందని భారత్, జపాన్ ప్రధానమంత్రులు వ్యాఖ్యానించారు. ఏఐ రూపకల్పన, అభివృద్ధి, విస్తరణ, పాలన అంశాల్లో నేడు మనం తీసుకునే నిర్ణయాలు.. భవిష్యత్తులో ఆవిష్కరణలు, సామాజిక సంక్షేమం, ఆర్థిక భద్రత, ప్రపంచ క్రమంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయని వారు అంగీకరించారు. ఈ అవగాహనే ప్రాతిపదికగా.. ఇరుదేశాల్లో ఆవిష్కరణలనూ, వృద్ధినీ పెంపొందించుకోవడంతోపాటు ఏఐ రంగంలో సామర్థ్యాన్నీ, పోటీతత్వాన్నీ పరస్పరం మెరుగుపరచుకునే దిశగా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు ఏకాభిప్రాయానికి వచ్చారు. తద్వారా సురక్షితమైన, భద్రమైన, విశ్వసనీయ, సమ్మిళిత, మానవుడే కేంద్రంగా ఉండే, సుస్థిరమైన, జవాబుదారీతనంతో కూడిన ఏఐ వ్యవస్థను నిర్మించాలని వారు సంకల్పించారు.సుస్థిర ఇంధన సామర్థ్యంపై భారత్-జపాన్ సంయుక్త ప్రకటన
July 02nd, 10:04 pm
జపాన్ ప్రధానమంత్రి గౌరవ సనాయే తకాయిచితో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి దృష్ట్యా... ఆసియాలో బాధ్యతాయుత శక్తులుగా, ప్రధాన ఇంధన వినియోగ దేశాలుగా కలిసి పనిచేయడం ద్వారా సుస్థిర ఇంధన సామర్థ్యాన్ని సంయుక్తంగా బలోపేతం చేసుకోవాలనే తమ ఉమ్మడి ఉద్దేశాన్ని వారు స్పష్టం చేశారు.భారత్ - జపాన్ వాణిజ్య ఫోరంను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
July 02nd, 03:35 pm
కొద్దిసేపటి క్రితమే, హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకి నూతన తయారీ కర్మాగారాన్ని మేం ప్రారంభించాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుజుకి కార్లలో దాదాపు మూడింట రెండు వంతులు భారతదేశంలోనే తయారవుతున్నాయి. అవి 100 పైగా దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి.జపాన్ ప్రధానమంత్రితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 02nd, 01:30 pm
ఆటోమొబైల్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ అన్ని రంగాల్లోనూ భారత్ వృద్ధి పయనంలో గత అనేక దశాబ్దాలుగా జపాన్ కీలక ఓ భాగస్వామి. పరస్పర విశ్వాసం, స్నేహబంధానికి ఇదొక అమూల్య పెన్నిధి.శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల అధినేతలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన ప్రధానమంత్రి
June 10th, 11:50 pm
హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన ప్రపంచ దేశాల నాయకులకు, అన్ని వర్గాల ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అభినందనలు ఎంతో ప్రభావితం చేశాయని, భారత్‌కు సేవ చేయటం, దేశాభివృద్ధి ప్రయాణంలో భాగస్వామి కావటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ప్రజల విశ్వాసమే తనకు ఎంతో బలమన్నారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు, 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటానికి, భారతదేశానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయటానికి మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు.ప్రధానమంత్రితో జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సమావేశం
May 26th, 08:13 pm
న్యూఢిల్లీలో ఈ రోజు జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తొషిమిత్సు మోతెగి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.ఫిబ్రవరి 16న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో- 2026'ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
February 15th, 02:21 pm
2026 ఫిబ్రవరి 16న సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026'ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.జపాన్ ప్రతినిధుల సభ ఎన్నికలలో మహత్తర విజయాన్ని సాధించినందుకు సనాయీ తాకాయిచీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
February 08th, 09:34 pm
జపాన్ ప్రతినిధుల సభ ఎన్నికలలో మహత్తర విజయాన్ని సాధించినందుకు సనాయీ తాకాయిచీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.అనువాదం: రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 05th, 05:35 pm
ఈ ధన్యవాద తీర్మానానికి మద్దతుగా నా భావాలను ఈ సభ ముందు ఉంచడం నా అదృష్టంగా భావిస్తున్నాను.రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సమాధానం
February 05th, 05:00 pm
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమాధానమిచ్చారు. ధన్యవాద తీర్మానానికి మద్దతుగా తన భావాలను సభతో పంచుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించిన ఆయన.. రాష్ట్రపతి ప్రసంగం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చెందిన భారత్ దిశగా సాగుతున్న ప్రయాణంలో గడిచిన ఏడాది కాలం అత్యంత వేగవంతమైన పురోగతిని సాధించిందని ఆయన పేర్కొన్నారు. దేశం సరైన దిశలో, గొప్ప వేగంతో దేశం ముందుకు సాగుతోందనీ.. సమాజంలోని అన్ని వర్గాల్లో, ప్రతి రంగంలోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అంశాలన్నింటినీ రాష్ట్రపతి సునిశితంగా, స్పష్టంగా వివరించారని శ్రీ మోదీ అన్నారు.భగవాన్ బుద్ధుని పవిత్ర పిప్రహ్వా అవశేషాల బృహత్తర అంతర్జాతీయ ప్రదర్శన ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 03rd, 12:00 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులైన గజేంద్ర సింగ్ షెకావత్ గారు, కిరణ్ రిజిజు గారు, రాందాస్ అథవాలే గారు, రావు ఇందర్‌జిత్ గారు... ఢిల్లీ ముఖ్యమంత్రికి ముందుగా నిర్ణయించిన వేరే కార్యక్రమం ఉన్నందున వారు వెళ్లిపోయారు... ఇక్కడ ఉన్న ఢిల్లీకి చెందిన ఇతర మంత్రులు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ సక్సేనా గారు, మహాశయులారా, గౌరవనీయ దౌత్య బృంద సభ్యులారా, బౌద్ధ పండితులారా, ధమ్మ అనుచరులారా, సోదరీ సోదరులారా...భగవాన్ బుద్ధుడికి సంబంధించిన పవిత్ర పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను న్యూఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 03rd, 11:30 am
న్యూఢిల్లీలోని రాయ్ పిథోరా కల్చరల్ కాంప్లెక్స్‌లో ఇవాళ ద లైట్ అండ్ ద లోటస్: రిలిక్స్ ఆఫ్ ద అవేకెన్డ్ వన్ పేరిట భగవాన్ బుద్ధునికి సంబంధించిన పవిత్రమైన పిప్రహ్వా అవశేషాల భారీ అంతర్జాతీయ ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. 125 ఏళ్ల తర్వాత భారత వారసత్వం తిరిగి వచ్చిందని, దేశ సంపద పునరాగమనం చేసిందన్నారు. నేటి నుంచి భారత ప్రజలు గౌతమ బుద్ధుడి పవిత్ర అవశేషాలను దర్శించుకుని, ఆయన ఆశీస్సులు పొందవచ్చని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ శుభ సందర్భంగా అతిథులకు స్వాగతం పలికిన శ్రీ నరేంద్ర మోదీ, శుభాకాంక్షలు తెలియజేశారు. బౌద్ధ సన్యాసులు, ధర్మ ఆచార‌్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రణామాలు తెలియజేశారు. వారి ఉనికి కార్యక్రమానికి కొత్త శక్తినిచ్చిందని తెలిపారు. 2026 ప్రారంభంలోనే ఈ పవిత్ర వేడుక జరగటం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. భగవాన్ బుద్ధుని ఆశీస్సులతో 2026వ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా శాంతి, సంపద, సామరస్యంతో నవశకానికి నాంది పలకాలని ఆకాంక్షించారు.జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ
November 23rd, 09:46 pm
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.జపాన్ ప్రధానమంత్రి శ్రీమతి హెచ్ఈ సానే తకాయిచీకి ప్రధానమంత్రి అభినందనలు; భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లటంపై చర్చ
October 29th, 01:14 pm
జపాన్ ప్రధానమంత్రి హెచ్ఈ సానే తకాయిచీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించారు.జపాన్ కొత్త ప్రధాని సానే తాకాయిచీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 21st, 11:24 am
జపాన్ ప్రధానమంత్రి పదవికి సానే తాకాయిచీ ఎన్నికైన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు. ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ భారత్, జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్నీ, ప్రపంచ స్థాయి భాగస్వామ్యాన్నీ మరింత బలపరుచుకోవాలన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు.ఇండియా మొబైల్ కాంగ్రెస్ 9వ సంచికను అక్టోబరు 8న ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 07th, 10:27 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2025 పరంపరలో 9వ సంచికను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 8న ఉదయం సుమారు 9:45 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభిస్తారు. ఇది ఆసియాలో టెలికం, మీడియా, టెక్నాలజీ రంగాలకు సంబంధించిన భారీ కార్యక్రమం.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!