అస్సాంలోని దరంగ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 14th, 11:30 am
భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై! అస్సాం ప్రజల ఆదరణ పొందిన ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ సర్బానంద సోనోవాల్ గారు, అస్సాం ప్రభుత్వంలోని అందరు మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన సోదరీసోదరులకు నమస్కారం.అస్సాంలోని దరంగ్‌లో రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 14th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు అస్సాంలోని దరంగ్‌లో దాదాపు రూ.6,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ- అస్సాం ప్రగతి పయనంలో నేటి కార్యక్రమం చారిత్రక సందర్భమని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు దరంగ్ ప్రజలతోపాటు రాష్ట్ర పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.ఢిల్లీ పరిధిలోని యూఈఆర్-II, ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి విభాగాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
August 17th, 12:45 pm
కేంద్ర కేబినెట్‌లో నా సహచరుడు నితిన్ గడ్కరీ గారు, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ గారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ సక్సేనా గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు అజయ్ తమ్టా గారు, హర్ష మల్హోత్రా గారు, ఈ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ, హర్యానా ఎంపీలు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రియమైన సోదర సోదరీమణులారా...రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
August 17th, 12:39 pm
ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
August 16th, 08:55 am
కృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:52 pm
79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగం 103 నిమిషాల పాటు కొనసాగింది. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాల్లో ఇదే సుదీర్ఘమైనది. ఇందులో భాగంగా పలు నిర్ణయాత్మక ప్రకటనలు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను సాధించటంపై ఒక సాహసోపేతమైన రోడ్ మ్యాప్‌ను ఇచ్చారు. ప్రధానమంత్రి ప్రసంగం స్వావలంబన, ఆవిష్కరణ, ప్రజల సాధికారతపై దృష్టి సారించింది. ఇతరులపై ఆధారపడే స్థాయి నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, సాంకేతికతపరంగా అభివృద్ధి చెందిన, ఆర్థికంగా ధృడమైన దేశంగా మారిన భారత్ ప్రయాణాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
ఈ స్వాతంత్య్ర మహోత్సవం 140 కోట్ల ప్రజల సంకల్పాన్ని ప్రతిబింబిస్తూ జరుగుతున్న వేడుక. ఈ స్వాతంత్య్ర దినోత్సవం సమష్టి విజయానికి ప్రతీక. మనందరికీ గర్వకారణం. మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగే క్షణమిది. దేశంలో ఎప్పటికప్పుడు ఐక్యతా స్ఫూర్తి బలోపేతమవుతోంది. 140 కోట్ల భారతీయులు ఈ రోజు మువ్వన్నెల్లో మెరుస్తున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ రెపరెపలాడుతోంది. ఎడారులయినా, హిమాలయ శిఖరాలయినా, సముద్ర తీరాలయినా, లేదా జనసమ్మర్ధ ప్రాంతాలయినా.. అంతటా ఒకే నినాదం, ఒకే ఉత్సాహం. మనం ప్రాణం కన్నా మిన్నగా భావించే మాతృభూమి కీర్తనే మార్మోగుతోంది.India celebrates 79th Independence Day
August 15th, 06:45 am
PM Modi, in his address to the nation on the 79th Independence day paid tribute to the Constituent Assembly, freedom fighters, and Constitution makers. He reiterated that India will always protect the interests of its farmers, livestock keepers and fishermen. He highlighted key initiatives—GST reforms, Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana, National Sports Policy, and Sudharshan Chakra Mission—aimed at achieving a Viksit Bharat by 2047. Special guests like Panchayat members and “Drone Didis” graced the Red Fort celebrations.2047లో అభివృద్ధి చెందిన భారతదేశానికి మార్గం స్వావలంబన ద్వారానే సాగుతుంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
July 27th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ ఒకసారి మన దేశ సాఫల్యాల గురించి, మన ప్రజల విజయాల గురించి మాట్లాడుకుందాం. గత కొన్ని వారాల్లో – క్రీడలలోనైనా, శాస్త్రవిజ్ఞానంలోనైనా, సంస్కృతిలోనైనా – ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. ప్రతి భారతీయుడినీ గర్వపడేలా చేసిన విషయాలివి. శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణాన్ని ముగించుకొని భూమిపైకి ఇటీవల విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భాన్ని దేశం యావత్తూ ఎంతో ఉత్సాహంగా గమనించింది. ఆయన భూమి పైకి తిరిగివచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా సంతోషాల వెల్లువ పెల్లుబికింది. ప్రతి హృదయంలో ఆనంద తరంగాలు పుట్టుకొచ్చాయి. దేశం అంతా గర్వంతో ఉప్పొంగిపోయింది. నాకు గుర్తుంది.... 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండింగ్ అయిన తర్వాత దేశంలో శాస్త్రవిజ్ఞానం పట్ల, అంతరిక్ష పరిశోధన పట్ల ఒక కొత్త ఆసక్తి పిల్లల్లో ఏర్పడింది. తాము కూడా అంతరిక్ష యాత్ర చేస్తామని, చంద్రునిపై దిగుతామని, అంతరిక్ష శాస్త్రవేత్తలం అవుతామని ఇప్పుడు చిన్నారులు కూడా చెప్తున్నారు.ప్రధానమంత్రి జన్మాష్టమి శుభాకాంక్షలు
August 26th, 08:16 am
జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. జై శ్రీకృష్ణ’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి పోస్ట్ చేశారు.అంతరిక్ష రంగ సంస్కరణల ద్వారా దేశంలోని యువత ప్రయోజనం పొందారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 25th, 11:30 am
మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్‌లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.జన్మాష్టమిసందర్భం లో ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
September 07th, 08:52 am
మంగళప్రదం అయినటువంటి సందర్భం జన్మాష్టమి ఈ రోజు న కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియజేశారు.గోవాలోని పనాజీలో హర్ ఘర్ జల్ ఉత్సవ్‌లో ప్రధాన మంత్రి వీడియో సందేశం
August 19th, 04:51 pm
గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జీ , కేంద్ర జల మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జీ , గోవా ప్రభుత్వంలోని ఇతర మంత్రులు , ఇతర ప్రముఖులు , మహిళలు మరియు పురుషులు , ఈ రోజు చాలా ముఖ్యమైన మరియు పవిత్రమైన రోజు. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబురాలు మిన్నంటాయి. దేశప్రజలందరికీ , ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీకృష్ణుని భక్తులందరికీ శుభాకాంక్షలు. జై శ్రీ కృష్ణజల్ జీవన్ మిశన్లో భాగం గా హర్ ఘర్ జల్ ఉత్సవ్ నుఉద్దేశించి వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 19th, 12:12 pm
జల్ జీవన్ మిశన్ లో భాగం గా జరిగిన హర్ ఘర్ జల్ ఉత్సవ్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం గోవా లోని పణజీ లో జరిగింది. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ తదితరులు ఉన్నారు. మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్బం లో శ్రీకృష్ణ భక్తుల కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.జన్మాష్టమినాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 19th, 10:02 am
మంగళకరమైన సందర్భం అయినటువంటి జన్మాష్టమి నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసిన లతా మంగేష్కర్ గారికి కృతజ్ఞతలు చెప్పిన - ప్రధానమంత్రి
August 30th, 09:53 pm
జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పిన లతా మంగేష్కర్ గారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.జన్మాష్టమి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 30th, 11:00 am
మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.భారతదేశ యువత కొత్తగా మరియు పెద్ద ఎత్తున ఏదైనా చేయాలని కోరుకుంటుంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
August 29th, 11:30 am
మన్ కీ బాత్ సందర్భంగా, ప్రధాన మంత్రి ధ్యాన్‌చంద్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు మరియు ప్రపంచ వేదికపై దేశాన్ని గర్వపడేలా చేసిన మన ఒలింపియన్ల గురించి మాట్లాడారు. దేశంలోని యువత రిస్క్ తీసుకొని ముందుకు సాగగల సామర్థ్యం కోసం ఆయన ప్రశంసించారు. మా నైపుణ్యం కలిగిన మానవశక్తి కృషిని ప్రధాన మంత్రి ప్రస్తావించారు మరియు భగవాన్ విశ్వకర్మకు నివాళులు అర్పించారు.జన్మాష్టమి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
August 11th, 08:14 pm
మంగళప్రదమైనటువంటి జన్మాష్టమి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.జన్మాష్టమి సందర్భం గా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 24th, 07:50 am
జన్మాష్టమి ని పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.