రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం

July 04th, 12:50 pm

ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.

రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

July 04th, 12:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

March 29th, 11:30 am

ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.

‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి

September 06th, 01:00 pm

‘‘జల సంచాయ్ జన భాగీదారీ’’ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని సూరత్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా వాననీటిని సంరక్షించేందుకు రాష్ట్రంలో 24,800 వాన నీటి సంరక్షణ నిర్మాణాలను చేపడతారు. భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉండేందుకు దీనిని ఉద్దేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ అతి ముఖ్యమైన ఈ ప్రజా చైతన్య కార్యక్రమాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ గుజరాత్‌లో ఈ రోజు ప్రారంభించిందని తెలిపారు. వర్షాకాలం సృష్టించిన బీభత్సాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు దేశంలో అన్ని ప్రాంతాలూ ఇబ్బందులు పడ్డాయని శ్రీ మోదీ అన్నారు. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఏ తహశీల్‌లోనూ ఇలా కుండపోత వర్షం కురిసినట్లు ఎప్పుడూ వినలేదనీ, చూడలేదనీ ప్రధాని తెలిపారు. ఈసారి గుజరాత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గుజరాత్ వాసులు, దేశ ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఇంకా అనేక ప్రాంతాలు భారీ వర్షాల ప్రభావానికి ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.

‘‘జల్ సంచయ్ జన్ భాగీదారీ’’ని ప్రారంభించిన ప్రధానమంత్రి

September 06th, 12:30 pm

6న ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం’ లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

September 05th, 02:17 pm

గుజరాత్ లోని సూరత్ లో జరప తలపెట్టిన ‘జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం’ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం మధ్యాహ్నం 12.30 కి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రసంగిస్తారు.