80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాంగణం నుండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 04:44 pm
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈరోజు ఎర్రకోట ప్రాంగణం నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో, గత 12 సంవత్సరాలుగా తయారీ రంగం, డిజిటల్ వృద్ధి మరియు పౌర సేవల రంగాలలో భారతదేశం సాధించిన ప్రగతికి సంబంధించిన వివరణాత్మక నివేదికను ఆయన సమర్పించారు. జాతీయ ఆశయాలను సాధించడం కోసం ఏడు కీలక రంగాలతో కూడిన పరివర్తనాత్మక సప్తధారను కూడా ఆయన ఆవిష్కరించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
August 15th, 07:00 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి ప్రసంగం
August 15th, 06:50 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడి గుండె చప్పుడు, ప్రతి ఇల్లు త్రివర్ణ పతాక స్ఫూర్తితో, నూతన సంకల్పాలతో ప్రతిధ్వనిస్తున్నాయన్నారు. మహత్తర త్యాగ సంప్రదాయాన్ని మేల్కొలిపిన స్వాతంత్య సమరయోధులందరికీ, గొప్ప విప్లవకారులకు ప్రణమిల్లుతున్నా అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.భారతదేశం 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది
August 15th, 06:45 am
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల శక్తి, సంకల్పంతో 2047 నాటికి వికసిత భారత్‌ను నిర్మించాలనే కల గురించి మాట్లాడారు. శాంతి చట్టం, రైల్వే విద్యుదీకరణ, భారతదేశ వాణిజ్య ఒప్పందాలు, నక్సలిజం అంతం వంటి కీలకమైన కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. 'శక్తి కీ సప్తధార'ను స్వీకరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.రాజస్థాన్‌లోని బలోత్రాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా పీఎం ప్రసంగం
July 04th, 12:50 pm
ఈ నేల ఎంతోమంది వీరుల పరాక్రమాన్ని చూసింది. ఈ యుద్ధభూమిలోని ప్రతి అణువూ ఆత్మగౌరవానికే అగ్రతాంబూలం ఇవ్వాలని నేర్పింది. ఒక వ్యక్తిదైనా, దేశానిదైనా ఆత్మ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే... అది స్వావలంబన సాధించినప్పుడు, ఇతరులపై వీలైనంత తక్కువగా ఆధారపడినప్పుడు మాత్రమే. ఇవాళ రాజస్థాన్ సాక్షిగా భారత్ అభివృద్ధి చెందిన, స్వావలంబన దేశంగా మారే దిశగా కీలక అడుగు వేసింది. ఇవాళ ఈ రిఫైనరీని దేశానికి అంకితం చేశాం. ఈ రిఫైనరీ ఇక్కడి వేలాది మంది ప్రజలకు ఉపాధిని కల్పిస్తుంది. దీని ప్రారంభం సందర్భంగా నేను ప్రత్యేకంగా రాజస్థాన్ యువతకు అభినందనలు తెలియజేస్తున్నా.రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం.. దేశానికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
July 04th, 12:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని బలోత్రాలో ₹1.06 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయడంతోపాటు మరికొన్నిటిని దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడాన్ని అభినందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు వారి నిరంతర సహకార స్ఫూర్తిని కొనియాడారు. మండే వేసవిలో మలమలమాడ్చే ఎండలో ఇంద పెద్ద సంఖ్యలో హాజరయ్యారంటూ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి లభించిన అఖండ ఆమోదానికి ఈ భారీ జనసందోహమే నిదర్శనమని ప్రధానమంత్రి అభివర్ణించారు. “మా ప్రభుత్వ కృషిపై మీ తిరుగులేని విశ్వాసాన్ని చాటే ఈ అపార ఆదరాభిమానాలకుగాను ఈ రాజస్థాన్ గడ్డకు నేనెంతో రుణపడి ఉంటాను” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.పశ్చిమబెంగాల్... తారకేశ్వర్‌లో జరిగిన పశ్చిమబంగ దివస్ వేడుకల్లో పీఎం ప్రసంగం
June 20th, 05:13 pm
గవర్నర్ ఆర్.ఎన్.రవి, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి సువేందు అధికారి, వేదికపైనున్న ఇతర విశిష్ట ప్రతినిధులు, బెంగాల్ సోదరీసోదరులారా.. బాబా తారక్‌నాథ్ కొలువైన ఈ పవిత్ర భూమిపై పశ్చిమబెంగాల్ దినోత్సవం రోజున ఇక్కడ భారీ జన సందోహం... ఎన్నికలు, ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత ఇలా మీ ముందుకు రావటం నాకెంతో గర్వంగా ఉంది. బెంగాల్ గాలిలో తాజాదనం నిండింది. ఇక్కడి ప్రతి అణువూ సరికొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నట్లు ఉంది. సంకెళ్ల నుంచి బెంగాల్ విముక్తి పొందినట్లుగా, బెంగాల్ ఆత్మగౌరవం తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తోంది. సరికొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలనే బెంగాల్ సంకల్పానికి నేటి కార్యక్రమం, ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలే నిదర్శనం. ప్రజల ముఖాల్లోని వెలుగు, ప్రతి గ్రామంలో కనిపిస్తున్న ఆనందం, విశ్వాసం.. మీ సంతోషంలో భాగం పంచుకునేందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒక ఓటు, ఒక ఎన్నిక ఎంతటి మార్పు తీసుకురాగలదో బెంగాల్‌లో స‌్పష్టంగా తెలుస్తుంది.‘పశ్చిమబంగ దివస్’ సందర్భంగా హుగ్లీలో నిర్వహించిన వేడుకలకు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 20th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ‘పశ్చిమబంగ దివస్’ (పశ్చిమ బెంగాల్ దినోత్సవం) వేడుకల్లో పాల్గొన్నారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీతో చారిత్రక సంబంధం గల హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “పశ్చిమ బెంగాల్: వారసత్వం-సామరస్యం-అభివృద్ధి” ఇతివృత్తంగా రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని, సామాజిక ఐక్యతను, ప్రగతిపై ప్రజాకాంక్షలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహిస్తున్నారు.ఒడిశా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీఎం ప్రసంగం
June 20th, 01:10 pm
గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, గవర్నర్ శ్రీ హరిబాబు, ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రి శ్రీ మోహన్ చరణ్ మాఝీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ కనక్ వర్ధన్ సింగ్ డియో, శ్రీమతి ప్రవతి పరిదా, ఒడిశా మంత్రి శ్రీ గణేశ్ సింగ్ ఖుంటియా, శ్రీ కృష్ణ చంద్ర మోహపాత్ర, పార్లమెంటు సభ్యుడు శ్రీ నబా చరణ్ మాఝీ, శ్రీ మన్మోహన్ సమాల్, శ్రీ బైజయంత్ పాండా, ఇతర ప్రముఖులు, సోదరీసోదరులారా.ఒడిషాలో బీజేపీ ప్రభుత్వానికి రెండేళ్లు: మయూర్‌భంజ్ జిల్లా రాయ్‌రంగపూర్‌లో ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం.. శంకుస్థాపన
June 20th, 01:00 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషాలోని మయూర్‌భంజ్ జిల్లాలోగల పహాడ్‌పూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవిత్ర ‘సంథాలీ’, ‘హో’ గిరిజన తెగల పవిత్ర వృక్షదేవతారాధ్య (జహేరా) ప్రాంతాలలో ప్రార్థనలు చేశారు. అలాగే, అక్కడి నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పహాడ్‌పూర్ పాఠశాలను సందర్శించారు. ఒడిషాలో బీజేపీ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో “వికాస్ రా ధార-ఒడిషా సారా” (ఒడిషా రాష్ట్రమంతటా అభివృద్ధి స్రవంతి) ఇతివృత్తంగా మయూర్‌భంజ్ జిల్లాలోని రాయ్‌రంగపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారిద్దరూ పాల్గొన్నారు. ఇందులో భాగంగా శ్రీ మోదీ ₹47,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు కొన్నిటికి శంకుస్థాపన చేశారు.గరీబ్ కళ్యాణ్, ప్రజల సాధికారతే ధ్యేయంగా12 ఏళ్ల విప్లవాత్మక కార్యక్రమాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి
June 08th, 10:24 am
గత 12 ఏళ్లలో ఎన్నో మార్పులకు భారత్ సాక్ష్యంగా నిలిచిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పేదలు, సమాజంలో వెనుకబడిన వర్గాల సంక్షేమమే ఈ మార్పులన్నింటికీ మూలాధారమని స్పష్టం చేశారు. అంత్యోదయ ఆశయంతో మన ప్రభుత్వం స్ఫూర్తిని పొందిందని, దశాబ్దాలుగా వెనకబడిన వారికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడటమే తమ ప్రయత్నమని ప్రధానమంత్రి తెలిపారు.రోజ్‌గార్ మేళా ద్వారా నియామక పత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
May 23rd, 11:15 am
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతీ యువకులకు నేడు చాలా ముఖ్యమైన రోజు. 51,000 కంటే ఎక్కువ మంది యువత నేడు ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందుకున్నారు. మీరు దేశ అభివృద్ధి ప్రయాణంలో అత్యంత కీలకమైన, బాధ్యతాయుతమైన భాగస్వాములుగా మారుతున్నారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య, ఇతర అనేక రంగాల్లో సరికొత్త బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో మీరే కీలక పాత్ర పోషిస్తారు.రోజ్‌గార్ మేళా ద్వారా ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను పంపిణీ చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 23rd, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 19వ రోజ్‌గార్ మేళా (ఉగ్యోగ మేళా)లో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి పైగా యువతకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వేలాది మంది యువతీ యువకులకు ఇది అత్యంత ముఖ్యమైన రోజు అని అభివర్ణించారు. ప్రభుత్వ సేవలోకి కొత్తగా అడుగుపెడుతున్న వారికి స్వాగతం పలుకుతూ.. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య వంటి రంగాలతో సహా పలు రంగాల్లో దేశ అభివృద్ధికి వారు అందించబోయే కీలక సహకారాన్ని ప్రస్తావించారు. ‘‘రాబోయే సంవత్సరాల్లో వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో మీరందరూ కీలక పాత్ర పోషిస్తారు’’ అని శ్రీ మోదీ స్పష్టం చేశారు.గుజరాత్‌లోని వడోదరాలో సర్దార్‌ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎం ప్రసంగం
May 11th, 06:15 pm
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 11th, 06:00 pm
గుజరాత్‌లోని వడోదరలో సర్దార్ ధామ్ వసతి గృహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. వడోదరలోని సర్దార్ ధామ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సోమనాథ్ ఆలయ 75వ ప్రతిష్ఠాపన వార్షికోత్సవాలను నిర్వహించుకొంటున్న రోజునే విద్యా సంస్థల ప్రారంభోత్సవం, ఆధ్యాత్మిక స్మరణ జరగడం శుభపరిణామన్నారు. డాక్టర్ దుష్యంత్, దక్ష్ పటేల్ భవన సముదాయాన్ని, బోధనా సహాయక పథకాన్ని ప్రారంభించారు. వివిధ విద్యా సంబంధమైన ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. వీటిన్నింటినీ భవిష్యత్తులో యువతకు అవకాశాన్ని కల్పించే వేదికలుగా వర్ణించారు. ‘‘కొన్ని గంటల క్రితమే, ప్రభాస్ పటాన్‌లో సోమనాథ్ అమృత మహోత్సవాల్లో నేను పాల్గొన్నాను. ఇక్కడ పరివర్తనాత్మక విద్యా సంస్థలను ప్రారంభించుకుంటున్నాం. చారిత్రక వారసత్వం, ప్రగతి రెండూ కలసి ముందుకు సాగుతాయనడానికి ఇదే నిదర్శనం’’ అని శ్రీ మోదీ అన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 28th, 05:30 pm
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులోని నా సహచరులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, ఉత్తరప్రదేశ్ పార్లమెంటు సభ్యులు, యూపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ పంకజ్ చౌదరి గారు, జిల్లా పంచాయత్ చైర్‌పర్సన్ సోదరి పూనం మౌర్య గారు, వేదికపై ఉన్న కాశీ నగర మహిళా కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇక్కడికి విచ్చేసిన నా తల్లులు, సోదరీమణులు, ఆడబిడ్డలు అందరికీ నమస్కారం.వారణాసిలో మహిళా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 28th, 05:00 pm
ఈ రోజు వారణాసిలో జరిగిన మహిళా సదస్సులో భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. అక్కడ ఆయన వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు.ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తరప్రదేశ్‌లో ప్రధానమంత్రి పర్యటన
April 26th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 28-29 తేదీల్లో ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 28 సాయంత్రం సుమారు 5 గంటలకు వారణాసిలో జరిగే మహిళా సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. అక్కడ ఆయన సుమారు రూ. 6,350 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభనుద్దేశించి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు.Criminals who have been sheltered under TMC will be punished: PM Modi in Jadavpur, West Bengal
April 24th, 11:45 am
Addressing a massive public meeting in Jadavpur, West Bengal, PM Modi highlighted the scale of participation in the first phase of polling. He asserted that TMC may not even open its account in the first phase and urged voters in the second phase to give a decisive mandate for BJP for a developed Bengal. He also raised concerns about the situation in Jadavpur University and touched upon local issues affecting people.PM Modi ignites Dum Dum and Jadavpur with fiery addresses
April 24th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed two massive public gatherings in Dum Dum and Jadavpur, West Bengal, delivering high-energy speeches that resonated strongly with the people of the state. He congratulated the citizens on the visible wave of change and asserted that the first phase of polling had already signaled a decisive shift in the state’s political landscape.