Gujarat’s biggest strength is that it has kept development moving continuously for the past 25 years: PM Modi in Vav-Tharad
March 31st, 05:00 pm
PM Modi launched and dedicated multiple development projects in Vav-Tharad, Gujarat, worth nearly ₹20,000 crore. Addressing a large gathering, he highlighted initiatives across roads, railways, power, water supply, urban development, healthcare and tourism aimed at boosting connectivity, improving public services and accelerating socio-economic growth in the region while strengthening the vision of a Viksit Bharat.గుజరాత్‌లోని వావ్-థరద్‌లో ₹20,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం... శంకుస్థాపన.. దేశానికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 31st, 04:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా వావ్-థరద్‌లో ఉత్తర గుజరాత్ కోసం సుమారు ₹20,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో పవిత్ర నవరాత్రి వేడుక ఇప్పుడే ముగియగా, ఇవాళ భగవాన్ మహావీర్ జయంతి కూడానని గుర్తుచేశారు. అలాగే, అంబాజీ మాత, భగవాన్ శ్రీ ధరణీధర్‌లకు నివాళి అర్పించారు.భగవాన్ మహావీర్ సందేశాల్లో అద్భుతమైన స్ఫూర్తి ఉందటూ.. సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
March 31st, 10:41 am
సత్యం, సామరస్యం, సత్ర్పవర్తన, సమానత్వంతో కూడిన భగవాన్ మహావీర్ సందేశాలు అద్భుతమైన స్ఫూర్తిని కలిగిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహావీర్ మహోన్నత ఆలోచనలు మానవాళికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.గుజరాత్‌లోని గాంధీనగర్‌లో 'సమ్రాట్ సంప్రతి మ్యూజియం' ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
March 31st, 10:25 am
ఈ సభకు హాజరైన ఆచార్య భగవంత్ శ్రీ పద్మసాగర్ సూరీశ్వర్ జీ మహరాజ్ సాహెబ్, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గారు, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భాయ్ హర్ష్ సంఘవి గారు, పరమ పూజ్య ఆచార్య భగవంత్, పూజ్య సాధు భగవంత్, సాధ్విజీ భగవంత్, ఈ పవిత్ర సమావేశానికి హాజరైన అందరు ఆచార్యులు, ముని భగవంత్‌లు, గౌరవనీయ లోకోపకారులు, పండితులు, సోదరీ సోదరులారా!మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్‌లోని కోబా తీర్థ్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
March 31st, 10:15 am
భగవాన్ మహావీర్ జయంతి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని గుజరాత్‌లోని గాంధీనగర్, కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి సంగ్రహాలయ జైన వారసత్వ మ్యూజియాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘కోబా తీర్థం ఆధ్యాత్మిక ప్రశాంతతతో నిండి ఉంది. ఎందరో జైన మునులు, సాధువుల తపస్సు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. సృజన, సేవ ఇక్కడ సహజంగానే వికసిస్తాయి’’ అని శ్రీ మోదీ అన్నారు.మార్చి 31న పీఎం గుజరాత్ పర్యటన
March 30th, 11:05 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 31, 2026న గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఉదయం సుమారు 10 గంటలకు గాంధీనగర్‌లో సామ్రాట్ సంప్రతి మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం సుమారు 12:45 గంటలకు అహ్మదాబాద్‌లోని సనంద్‌లో కేన్స్ సెమికాన్ ప్లాంట్‌ను ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత వావ్-థరాడ్‌లో సాయంత్రం సుమారు 4 గంటలకు రూ. 20,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, వాటిని జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడ కూడా ప్రధానమంత్రి ప్రసంగించనున్నారు.'మన్ కీ బాత్'లో, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని అధిగమించడానికి 140 కోట్ల మంది భారతీయుల ఐకమత్యంపై విశ్వాసం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
March 29th, 11:30 am
ఈ నెల 'మన్ కీ బాత్' కార్యక్రమంలో, ప్రధాని మోదీ పశ్చిమ ఆసియా సంఘర్షణ గురించి ప్రస్తావిస్తూ, ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అందరూ ఐకమత్యంతో ఉండాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. పుకార్లకు లోనై తప్పుదోవ పట్టవద్దని, కేవలం ప్రభుత్వం అందించే సమాచారంపైనే ఆధారపడాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. అలాగే 'జ్ఞాన్ భారతం' సర్వే, క్రీడలు మరియు ఫిట్‌నెస్, నీటి సంరక్షణ, చేపల పెంపకం, సౌర విద్యుత్ వంటి కీలక అంశాలను కూడా ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించారు.శ్రీమద్ విజయరత్న సుందర సూరీశ్వర్‌జీ మహరాజ్ 500వ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధాని సందేశం
January 11th, 01:00 pm
ఈ పవిత్ర సమయంలో ముందుగా మనందరికీ స్ఫూర్తి ప్రదాత అయిన పూజ్య భువనభాను సూరీశ్వర్ జీ మహరాజ్ పాదపద్మాలకు ప్రణమిల్లుతున్నాను. ప్రశాంతమూర్తి సువిశాల్ గచ్చాధిపతి పూజ్య శ్రీమద్ విజయ రాజేంద్ర సూరీశ్వర్ జీ మహరాజ్ గారికి, పూజ్య గచ్చాధిపతి శ్రీ కల్పతరు సూరీశ్వర్ జీ మహరాజ్ గారికి, సరస్వతీ కృపా పాత్ర పరమ పూజ్య ఆచార్య భగవంత్ శ్రీమద్ విజయ రత్న సుందరసూరీశ్వర్ జీ మహరాజ్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన సాధుసంతులందరికీ... గౌరవపూర్వక వందనాలు.శ్రీమద్ విజయరత్న సుందర్ సురీశ్వర్ మహారాజ్ 500వ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 11th, 12:44 pm
శ్రీమద్ విజయరత్న సుందర్ సురీశ్వర్ మహారాజ్ 500వ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ పవిత్ర సందర్భంలో ముందుగా పూజనీయులైన భువనభాను సురీశ్వర్ మహారాజ్ పాదాలకు ప్రణమిల్లుతున్నానని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రశాంతమూర్తి సువిశాల గచ్ఛాధిపతి పూజనీయ శ్రీమద్ విజయ రాజేంద్ర సూరీశ్వర్ మహారాజ్, శ్రీ కల్పతరు సురీశ్వర్ మహారాజ్, సరస్వతీ కృపాపాత్ర పరమ పూజనీయ ఆచార్య భగవంత్ శ్రీమద్ విజయరత్న సుందర సురీశ్వ మహారాజ్ సహా కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి-సాధువులంరికీ సగౌరవ వందనమాచరించారు. అంతేకాకుండా ఊర్జా మహోత్సవ్ కమిటీ సభ్యులందరికీ ప్రశంసలతోపాటు అభినందనలు తెలిపారు.న్యూఢిల్లీలో నిర్వహించిన జ్ఞాన భారతం అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 12th, 04:54 pm
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ గారు, విద్యావేత్తలు, సోదరీసోదరులారా!‘జ్ఞాన భారతం’ పోర్టల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం
September 12th, 04:45 pm
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ రోజు నిర్వహించిన ‘జ్ఞాన భారతం’ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత స్వర్ణయుగ పునరుజ్జీవనానికి విజ్ఞాన్ భవన్ సాక్ష్యంగా నిలుస్తోందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల కిందటే జ్ఞాన భారతం కార్యక్రమం గురించి తాను ప్రకటించగా, స్వల్ప వ్యవధిలోనే ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తుండటం విశేషమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంతో ముడిపడిన పోర్టల్‌ను కూడా ప్రారంభించామని శ్రీ మోదీ వెల్లడించారు. ఇది ప్రభుత్వం లేదా విద్యా వ్యవస్థ సంబంధిత కార్యక్రమం కాదని, భారతీయ సంస్కృతి-సాహిత్యం, చైతన్య గళంగా జ్ఞాన భారతం ఆవిర్భవిస్తుందని ప్రధానమంత్రి ప్రకటించారు. వేల తరాల సాలోచనా వారసత్వాన్ని ప్రస్తావిస్తూ- మహనీయులైన రుషులు, ఆచార్యులు, పండితుల జ్ఞానం, పరిశోధనలను ఆయన గుర్తుచేశారు. భారతీయ జ్ఞానం, సంప్రదాయాలు, శాస్త్రీయ వారసత్వానికి ఇది నిదర్శనమని స్పష్టం చేశారు. మనకు సంక్రమించిన ఈ సుసంపన్న వారసత్వాన్ని జ్ఞాన భారతం కార్యక్రమం ద్వారా డిజిటలీకరిస్తామని శ్రీ మోదీ వెల్లడించారు. దీనిపై ప్రజలకు అభినందించడంతోపాటు ఈ మిషన్ నిర్వహణ బృందం సభ్యులకు, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.సంవత్సరి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
August 27th, 06:20 pm
సంవత్సరి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్షమ, కరుణ, నిజాయితీగల మానవ సంబంధాల కాలాతీత విలువల గురించి ప్రధానంగా చెప్పారు.న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి వేడుక సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:15 am
పరమ శ్రాద్ధేయ ఆచార్య శ్రీ ప్రజ్ఞా సాగర్ మహరాజ్, శ్రావణబెళగొళ స్వామి శ్రీ చారుకీర్తి, మంత్రిమండలిలో నా సహచరులు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ శ్రీ నవీన్ జైన్, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ప్రియాంక్ జైన్, కార్యదర్శి శ్రీ మమతా జైన్, ట్రస్టీ పీయూష్ జైన్, ఇతర విశిష్ట ప్రముఖులు, గౌరవనీయ సాధువులు, సోదరీసోదరులారా... జై జినేంద్ర!ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహరాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగం
June 28th, 11:01 am
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈరోజు జరిగిన ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక చిరస్మరణీయమైన సందర్భాన్ని నేడు మనమంతా చూస్తున్నాం.. ఇది ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మునిరాజ్ శతాబ్ది ఉత్సవాల పవిత్రతను స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు. పూజ్య ఆచార్య అమర స్ఫూర్తితో నిండిన ఈ కార్యక్రమం అపూర్వమైన స్ఫూర్తిదాయక వాతావరణాన్ని కల్పిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారందరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి.. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే అవకాశం దక్కడం తనకూ సంతోషం కలిగించిందన్నారు.ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలు... రేపు న్యూఢిల్లీలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి
June 27th, 05:06 pm
ఆచార్య విద్యానంద్ జీ మహారాజ్ శతజయంతి ఉత్సవాలను రేపు.. అంటే ఈ నెల 28న.. ఉదయం దాదాపు 11 గంటలకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు.భగవాన్ మహావీర్ ఆదర్శాల విస్తృత ప్రభావాన్ని మహావీర్ జయంతి సందర్భంగా స్మరించుకొన్న ప్రధానమంత్రి
April 10th, 03:30 pm
మహావీర్ జయంతి ఈ రోజు. కలకాలం ప్రేరణాత్మకంగా నిలిచే భగవాన్ మహావీర్ బోధనలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకొన్నారు. ఆయన ప్రబోధాలు తన జీవనాన్ని కూడా విస్తారంగా ప్రభావితం చేశాయని ప్రధాని అన్నారు.మహావీర్ జయంతి సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి నివాళులు
April 10th, 08:44 am
మహావీర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా భగవాన్ మహావీర్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. భగవాన్ మహావీర్ సదా అహింసకూ, సత్యానికీ, కరుణకూ ప్రాధాన్యాన్నిచ్చారనీ, ఆయన ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలకు శక్తిని ప్రసాదిస్తున్నాయనీ శ్రీ మోదీ అన్నారు. ప్రాకృత భాషకు ప్రభుత్వం కిందటేడాది ప్రాచీన భాష హోదాను ఇచ్చిందనీ, ఈ నిర్ణయానికి ప్రశంసలు లభించాయనీ ఆయన అన్నారు.నవ్కార్ మహామంత్ర దివస్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
April 09th, 08:15 am
మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సు స్థిరంగా ఉంది. శాంతి మాత్రమే ఉంది. అద్భుతమైన అనుభూతి. మాటలకు చాలనిది - ఆలోచనలకు అతీతమైనది - నవ్కార్ మహామంత్రం ఇంకా మనస్సులో మార్మోగుతోంది. నమో అరిహంతాణం. నమో సిద్ధాణం. నమో ఆయర్యాణం. నమో ఉవజ్ఝాయాణం. నమో లోయే సవ్వసాహుణం. ఒకే స్వరం, ఒకే ప్రవాహం, ఒకే శక్తి, ఎలాటి హెచ్చుతగ్గులూ లేవు. కేవలం స్థిరత్వం మాత్రమే. అంతా సమభావమే. అలాంటి చైతన్యం, ఒకే విధమైన లయ, అంతర్గతంగా ఒకే విధమైన కాంతి. నవ్కార్ మహామంత్రం ఆధ్యాత్మిక శక్తిని నేను ఇప్పటికీ అనుభూతి చెందుతున్నాను. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఇలాంటి సామూహిక మంత్రోచ్ఛారణకు సాక్షిగా ఉన్నాను. ఈ రోజు తిరిగి నాకు అదే స్థాయిలో అదే అనుభూతి కలిగింది. ఈ సారి లక్షలాది పవిత్రాత్మలు ఒకే చైతన్యంతో కలిశాయి. ఒకే మాటలు కలసి పలికాయి. ఒకే శక్తి కలసి మేల్కొంది. భారత్‌లోనే కాదు - విదేశాల్లోనూ కూడా. ఇది నిజంగా అపూర్వమైన సంఘటన.నవ్‌కార్ మహామంత్ర దివస్ ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
April 09th, 07:47 am
న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ఈరోజు ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ కర్ మహామంత్ర దివస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానసిక శాంతిని, స్థిరచిత్తాన్ని అందించే సామర్థ్యం గల నవ్ కర్ మంత్రం.. దివ్యమైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుందని అన్నారు. మంత్ర పఠనం వల్ల సిద్ధించే నిర్వికార స్థితి మాటలకు, ఆలోచనలకు అతీతమైనదని, చేతనలో, అంతరాత్మలో ఆ భావన స్థిర నివాసం ఏర్పరుచుకుంటుందని అన్నారు. పవిత్రమైన నవ్‌కార్ మంత్రంలోని పంక్తులను చదివి వినిపించిన శ్రీ మోదీ- సంయమనం, స్థితప్రజ్ఞత, మనసు-అంతరాత్మల మధ్య సమన్వయం సాధించే నిరంతరాయ శక్తిప్రవాహంగా మంత్రశక్తిని అభివర్ణించారు. తన సొంత ఆధ్యాత్మిక అనుభూతిని గురించి చెబుతూ, నవ్ కర్ మంత్రం ఇప్పటికీ తన అంతరాళాల్లో ప్రభావాన్ని చూపుతూనే ఉందన్నారు. కొన్నేళ్ళ కిందట బెంగుళూరులో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో జరిగిన సామూహిక మంత్ర పఠన ప్రభావం ఇప్పటికీ తనని వీడి పోలేదన్నారు. దేశ విదేశాల్లోని పవిత్ర హృదయాలు ఒకే చైతన్యంతో ఒక సామూహిక అనుభవంలో భాగమవడం తిరుగులేని అనుభూతి అని సంతోషం వెలిబుచ్చారు. ఈ సామూహిక చర్య ద్వారా ఒకే లయలో ఒదిగే పంక్తుల పఠనం అసాధారమైన శక్తిని వెలువరించి మాటల్లో చెప్పలేని దివ్యానుభూతిని కలిగిస్తుందని శ్రీ మోదీ చెప్పారు.ఏప్రిల్ 9న న్యూఢిల్లీలో నవ్కార్ మహామంత్ర దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి
April 07th, 05:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 9వ తేదీన ఉదయం 8 గంటలకు న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే నవ్కార్ మహామంత్ర దివస్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు