ఐటీబీపీ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

October 24th, 10:05 pm

ఐటీబీపీ( ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హిమవీరులందరితో పాటు వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ భద్రతా దళం దేశానికి ఎంతో సేవ చేసిందన్న ఆయన.. ధైర్యం, క్రమశిక్షణ, విధి పట్ల వారు చూపించే అచంచలమైన నిబద్ధతను ప్రశంసించారు. విపత్తు సహయక, ఉపశమన మిషన్ల విషయంలో సంసిద్ధతతో ఉండే తీరు, చూపించే కరుణను కూడా మెచ్చుకున్న మోదీ.. ఇవి వారి అత్యుత్తమ సేవా, మానవత్వ స్ఫూర్తిని తెలియజేస్తున్నాయన్నారు.

ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హిమవీరులకు ప్రధాని శుభాకాంక్షలు

October 24th, 10:41 am

ఐటీబీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐటీబీపీ హిమవీరులు, వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. పరాక్రమానికి, నిబద్ధతకు ఐటీబీపీ ప్రతీక అని ఆయన అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సామాజిక సహాయ కార్యక్రమాల్లో వారు చేస్తున్న కృషిని కొనియాడారు. ఇది ప్రజలకు గర్వకారణమని, స్ఫూర్తిదాయకమని నింపుతుందని తెలిపారు.