హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్‌కు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటనలో సంయుక్త పత్రికా ప్రకటన

December 16th, 03:56 pm

హేషమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు.

ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ప్రధానమంత్రి భేటీ

December 10th, 10:50 pm

ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి శ్రీ ఏంటోనియో తజానీతో ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.

Prime Minister meets Prime Minister of Italy on the sidelines of G20 Summit 2025

November 23rd, 09:44 pm

PM Modi met PM of Italy Giorgia Meloni on the sidelines of G20 Summit in Johannesburg, South Africa. PM Meloni expressed solidarity with India on the terror incident in Delhi. Both leaders adopted the ‘India-Italy Joint Initiative to Counter Financing of Terrorism’ and positively assessed the developments in the bilateral Strategic Partnership across wide range of sectors.

సెప్టెంబర్ 25న ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి

September 24th, 06:33 pm

సెప్టెంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

జీ-7 సమావేశాల నేపథ్యంలో ఇటలీ ప్రధానమంత్రితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ మోదీ

June 18th, 02:59 pm

కెనడా దేశం కననాస్కిస్ లో జూన్ 17న జరిగిన 51వ జీ-7 సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ మోదీ, ఇటలీతో బలమైన స్నేహ సంబంధాలను కొనసాగిస్తామని, ఈ బంధం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం కలిగించగలదని పేర్కొన్నారు.

When growth is driven by aspirations, it becomes inclusive and sustainable: PM Modi at Rising Bharat Summit

April 08th, 08:30 pm

PM Modi addressed the News18 Rising Bharat Summit. He remarked on the dreams, determination, and passion of the youth to develop India. The PM highlighted key initiatives, including zero tax on income up to ₹12 lakh, 10,000 new medical seats and 6,500 new IIT seats, 50,000 new Atal Tinkering Labs and over 52 crore Mudra Yojana loans. The PM congratulated the Parliament for enacting Waqf law.

న్యూస్18 ‘రైజింగ్ భారత్ సమ్మిట్‌’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

April 08th, 08:15 pm

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో న్యూస్‌ 18 నిర్వహించిన ‘ఉషోదయ భారత్‌ శిఖరాగ్ర సదస్సు’ (రైజింగ్ భారత్ సమ్మిట్‌)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సదస్సు ద్వారా భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగాగల గౌరవనీయ అతిథులతో మమేకమయ్యే అవకాశం కల్పించిందంటూ నెట్‌వర్క్18 యాజమాన్యానికి ఆయన ఈ సందదర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి భారత యువత ఆకాంక్షలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ సదస్సు నిర్వహించడాన్ని ప్రశంసించారు. ఈ ఏడాది ఆరంభంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఇదే వేదికపై నిర్వహించిన ‘వికసిత భారత్‌ యువ నాయకత్వ గోష్ఠి’ ప్రాధాన్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా రూపుదిద్దాలనే యువత కలలు, సంకల్పం, అభినివేశం ఈ కార్యక్రమంలో ప్రస్ఫుటం కావడాన్ని ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించే 2047 నాటికి భారత్‌ పురోగమన పథాన్ని వివరిస్తూ అడుగడుగునా నిరంతర చర్చలు విలువైన అవగాహననిస్తాయని పేర్కొన్నారు. అమృత కాల తరాన్ని శక్తియుతం చేస్తూ.. మార్గదర్శకత్వం వహిస్తూ.. వేగంగా ముందుకు నడిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడల్లో 33 పతకాలను గెలిచిన భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి అభినందనలు

March 18th, 02:40 pm

ఇటలీలోని ట్యూరిన్‌లో నిర్వహించిన ‘ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడలు 2025’లో విశిష్ట ప్రదర్శనను కనబరచినందుకు భారతీయ క్రీడాకారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారతీయ క్రీడాకారుల బృందం 33 పతకాలను గెలిచి ప్రపంచ వేదికపై భారత్‌ గర్వపడేటట్లు చేసింది.

ఇటలీ-ఇండియా ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029

November 19th, 09:25 am

శక్తిమంతమైన ఇండియా-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉమ్మడి కార్యాచరణ ద్వారా మరింత ముందుకు తీసుకువెళ్ళాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ నిర్ణయించారు. నవంబరు 18న బ్రెజిల్ లోని రియో డి జనీరో లో జరిగిన జీ-20 సమావేశానికి హాజరైన సందర్భంగా వారిరువురూ భేటీ అయ్యారు. మరింత స్పష్టతతో, నిర్ణీత సమయానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని భావించారు. ఇందుకోసం వారు వ్యూహాత్మక కార్యాచరణకు రూపకల్పన చేశారు.

ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలితో ప్రధానమంత్రి భేటీ

November 19th, 08:34 am

రియో డి జెనీరో లో జరుగుతున్న జి-20 సమావేశాల నేపథ్యంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ దేశ మంత్రిమండలి అధ్యక్షురాలు జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. 2024 జూన్, ఇటలీలోని ‘పూలీయా’ లో జార్జియా మెలోనీ అధ్యక్షతన ఏర్పాటైన జి-7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన భేటీ అనంతరం ఇరువురు నేతల మధ్య జరిగిన నేటి సమావేశం గత రెండేళ్ళలో అయిదోది. ఎన్నో సమస్యల మధ్య చేపట్టిన జి-7 అధ్యక్ష పదవికి సమర్ధమైన నేతృత్వం అందిస్తున్నందుకు శ్రీ మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీకి అభినందనలు తెలియజేశారు.

డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృత‌జ్ఞత‌లు

August 15th, 09:20 pm

భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years: PM in Srinagar

June 20th, 07:00 pm

PM Modi addressed ‘Empowering Youth, Transforming J&K’ programme in Srinagar. “The transformation in Jammu & Kashmir is a result of the work done by the government in the last 10 years”, the PM said. Pointing out that the women and people from lower income s in the region were deprived of their rights, the PM said that the present government worked towards bringing opportunities and restoring their rights by adopting the mantra of ‘Sabka Saath Sabka Vikas.’

‘‘యువతకు సాధికారత.. జ‌మ్ముక‌శ్మీర్ ప‌రివ‌ర్త‌న‌’’ పేరిట శ్రీనగర్‌లో నిర్వ‌హించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 20th, 06:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీనగర్‌లోని ‘షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్’ (ఎస్‌కెఐసిసి)లో ‘‘యువతకు సాధికారత.. జ‌మ్ముక‌శ్మీర్ ప‌రివ‌ర్త‌న‌’’ పేరిట నిర్వ‌హించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి సరఫరా సహా ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,500 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు (జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన ప‌థ‌కానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 200 మందికి నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ఈ కేంద్రపాలిత ప్రాంత యువ విజేతలతో కొద్దిసేపు ముచ్చటించారు.

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

June 18th, 05:32 pm

ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్, భగీరథ్ చౌదరి గారు, ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్, శాసనమండలి సభ్యుడు మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ భూపేంద్ర చౌదరి గారు, రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన నా రైతు సోదర సోదరీమణులు, కాశీక లోని నా కుటుంబ సభ్యులారా,

ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ లో ప్రధానమంత్రి ప్రసంగం

June 18th, 05:00 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ ను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద 9.26 కోట్ల మంది లబ్ధిదారులకు 17వ వాయిదా సొమ్ము రూ.20,000 కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే 30,000 మంది పైగా స్వయం సహాయక బృందాల సభ్యులకు కృషిసఖి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. టెక్నాలజీ సహాయంతో దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాలకు చెందిన రైతులు ఈ కార్యక్రమంతో అనుసంధానం అయ్యారు.

జి7 సమిట్ సందర్భం లో జపాన్ యొక్క ప్రధాని తోసమావేశమైన ప్రధాన మంత్రి

June 14th, 11:53 pm

ఇటలీ లోని అపులియా లో జి-7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ యొక్క ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో ఈ రోజు న ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.

జి-7 సదస్సు నేపథ్యంలో ఇటలీ ప్రధానితో ప్రధానమంత్రి సమావేశం

June 14th, 11:40 pm

రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి రాజకీయ సంప్రదింపులు క్రమబద్ధంగా సాగుతుండటంపై దేశాధినేతలిద్దరూ సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమయంలో భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రగతిని సమీక్షించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం పురోగమిస్తుండటంపై సంతోషం వ్యక్తం చేశారు. పరిశుభ్ర ఇంధనం, తయారీ, అంతరిక్షం, శాస్త్ర-సాంకేతిక, టెలికాం, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు తదితర రంగాల్లో సుస్థిర సరఫరా శ్రేణి నిర్మాణం దిశగా వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్‌మార్క్ వంటి అంశాల్లో సహకార చట్రం రూపకల్పన సంబంధిత పారిశ్రామిక సంపద హక్కుల (ఐపిఆర్) ఒప్పందంపై ఇటీవల సంతకాలు పూర్తికావడంపై వారిద్దరూ హర్షం ప్రకటించారు.

జి-7 విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు పాఠం

June 14th, 09:54 pm

మున్ముందుగా నన్ను ఈ శిఖరాగ్ర సదస్సుకు ఆహ్వానించడంతోపాటు అత్యంత గౌరవ మర్యాదలతో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు ప్రధానమంత్రి మెలోనీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే చాన్సలర్ ఓలాఫ్ షోల్ట్స్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ జి-7 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకమైనదేగాక, దీనికెంతో చారిత్రక ప్రాధాన్యం కూడా ఉంది. ఆ మేరకు కూటమి 50వ వార్షికోత్సవం సందర్భంగా గౌరవనీయ మిత్రులైన జి-7 దేశాధినేతలందరికీ నా మనఃపూర్వక శుభాభినందనలు తెలుపుతున్నాను.

జి-7 సదస్సులో కృత్రిమ మేధ ఇంధనం ఆఫ్రికా మధ్యధరా ప్రాంతం అంశాలపై విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

June 14th, 09:41 pm

ఇటలీలోని అపులియాలో జి-7 సదస్సులో భాగంగా ఇవాళ కృత్రిమ మేధ, ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం తదితర అంశాలపై నిర్వహించిన విస్తృత సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా తొలుత జి-7 కూటమి 50వ వార్షికోత్సవ మైలురాయిని అందుకోవడంపై ఆయన అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ- మానవాళి చరిత్రలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియలో తాను మూడోసారి ఎన్నికైన తర్వాత ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరుకావడం తనకెంతో సంతృప్తినిచ్చిందని ప్రధాని హర్షం వెలిబుచ్చారు. మానవ కేంద్రక విధాన ప్రాతిపదికగా ఉన్నపుడే సాంకేతిక పరిజ్ఞానం విజయవంతం కాగలదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు సేవా ప్రదానం కోసం డిజిటల్ సాంకేతికత వినియోగంలో భారత్ సాధించిన విజయాలను సభికులతో ప్రధాని పంచుకున్నారు.

జి7 సమిట్ సందర్భం లో యూక్రేన్ అధ్యక్షుని తోసమావేశమైన ప్రధాన మంత్రి

June 14th, 04:25 pm

ఇటలీ లో జి7 శిఖర సమ్మేళనం జరుగుతున్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూక్రేన్ యొక్క అధ్య‌క్షుడు శ్రీ‌ వొలొదిమీర్ జెలెన్ స్కీ తో 2024 జూన్ 14 వ తేదీ న ఒక ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రి తాను మూడో సారి పదవీ బాధ్యతల ను చేపట్టినందుకు అధ్యక్షుడు శ్రీ వొలొదిమీర్ జెలెన్ స్కీ హృదయపూర్వక శుభాకాంక్షల ను తెలిపినందుకు ఆయన కు ధన్యవాదాలను పలికారు.