ISRO’s technologies and partnerships serve not only India, but the wider world: PM Modi at International Space Summit
September 10th, 02:50 pm
Addressing the International Space Summit in Paris via VC, PM Modi highlighted India’s space journey and its vision for the future, from Chandrayaan-3 and Aditya-L1 to an Indian space station by 2035 and an Indian on the Moon by 2040. Rooted in “Vasudhaiva Kutumbakam”, he called for nations to explore, innovate and protect space together for all humanity.పారిస్‌లో అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 10th, 02:45 pm
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి సరైన సమయంలో సాదరంగా తనను ఆహ్వానించడంపై చొరవ చూపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తనకు లభించడంపై- “తొలి అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాలుపంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.ఈఓఎస్-05తో కూడిన జీఎస్ఎల్వీ-ఎఫ్17ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రోను ప్రశంసించిన ప్రధానమంత్రి
September 04th, 10:35 am
ఇస్రో ఈ రోజు సాధించిన మరో అద్భుత విజయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది దేశానికి గర్వ కారణమని ఆయన పేర్కొన్నారు.జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
August 23rd, 10:50 am
జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాని ఫ్రాన్స్ పర్యటన ఫలితాల జాబితా
June 14th, 09:32 pm
భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల రోడ్‌మ్యాప్-2030 ఆమోదంనార్వే ప్రధానమంత్రితో సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా భారత ప్రధానమంత్రి పత్రికా ప్రకటన
May 18th, 04:44 pm
గతేడాదే నేను నార్వేలో పర్యటించాల్సి ఉంది. అయితే, పహల్గాంలో ఉగ్రవాద దాడి కారణంగా ఆ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు నార్వే అండగా నిలిచింది. మన స్నేహబంధం శక్తికి ఇది నిదర్శనం. ఆ మద్దతు, సంఘీభావం పట్ల ఈ రోజు నార్వే పర్యటన సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.భారత్-కెనడా సంయుక్త ప్రకటన
March 02nd, 05:05 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు కెనడా ప్రధానమంత్రి మాననీయ మార్క్ కార్నీ ఫిబ్రవరి 27 నుంచి ఈ నెల 2వ తేదీ వరకూ భారతదేశంలో పర్యటించారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక కార్నీ తొలిసారి భారత్‌లో పర్యటించగా, 2018 తర్వాత కెనడా ప్రధానమంత్రి ఒకరు ద్వైపాక్షిక పర్యటన కోసం మన దేశానికి రావడం ఇదే మొదటిసారి. కెనడా ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు, రాష్ట్రాల అధినేతలు, అగ్రగామి పరిశ్రమల ‘సీఈవో’లతో కూడిన ఉన్నత స్థాయి బృందం కూడా ఆయన వెంట వచ్చింది.భారత్-ఇజ్రాయెల్ సంయుక్త ప్రకటన
February 26th, 07:44 pm
భారత్-ఇజ్రాయెల్ దేశాల మధ్యగల సాన్నిహిత్యం, సద్భావన, ప్రగాఢ వ్యూహాత్మక భాగస్వామ్యం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25-26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆయనతో పాటు సీనియర్ మంత్రులు, అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వెళ్లింది. ఈ సందర్భంగా 2017లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ చారిత్రక పర్యటనను, 2018లో ప్రధానమంత్రి నెతన్యాహు భారత పర్యటనను వారిద్దరూ గుర్తుచేసుకున్నారు. ఈ పర్యటనలతో రెండు దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారంలో నవశకం ప్రారంభమైంది. తద్వారా అత్యాధునిక సాంకేతికతలు, సైబర్ భద్రత, వ్యవసాయం, జల నిర్వహణ, ఆరోగ్యం, వ్యవస్థాపన, రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో ద్వైపాక్షిక బంధం విశేషంగా పురోగమించడంపై వారిద్దరూ హర్షం వెలిబుచ్చారు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని “శాంతి, ఆవిష్కరణ, శ్రేయస్సు దిశగా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి విస్తరించేందుకు ప్రధానమంత్రులిద్దరూ అంగీకరించారు.భారత్-ఫ్రాన్స్ సంయుక్త ప్రకటన
February 18th, 08:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌరవనీయ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 17 నుంచి 19 వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కృత్రిమ మేధ (ఏఐ)పై ‘ఇండియా ఇంపాక్ట్ సమ్మిట్-2026’ సహా ప్రధానమంత్రి మోదీతో ద్వైపాక్షిక చర్చల్లోనూ ఆయన పాల్గొన్నారు. అంతేగాక 17న ముంబైలో ‘భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ వార్షికోత్సవం-2026’ను వారిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. మాక్రాన్ ప్రస్తుతం నాలుగోసారి భారత్ పర్యటనకు రాగా, ప్రధానమంత్రి మోదీ 2025 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లివచ్చారు.‘వికసిత భారత్ యువ సారథుల చర్చాగోష్ఠి-2026’ ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 12th, 06:45 pm
కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు, ఎంపీలు, వికసిత భారత్ యువ సారథుల పోటీ విజేతలు, ఇతర ప్రముఖులు, దేశం నలుమూలల నుంచి విదేశాల నుంచి హాజరైన నా యువ మిత్రులందరూ ఇక్కడ ఓ కొత్త అనుభూతిని పొంది ఉంటారు. మీరంతా అలసిపోలేదా? ఇప్పటికి రెండు రోజుల నుంచి అదేపనిగా ప్రసంగాలు వింటూనే ఉన్న మీకు మరోసారి వినడం అలసట అనిపిస్తోందా? ఏదేమైనా, పత్రికా సమావేశం సందర్భంగా నేను చెప్పాల్సిందేమిటో ఇప్పటికే చెప్పేశాను. నేను తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేనాటికి మీలో చాలామంది పుట్టి కూడా ఉండరని నేను అనుకుంటున్నా. ఇక 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి మీలో అధికశాతం ఇంకా పిల్లలుగానే ఉండి ఉంటారు. అయితే, ముఖ్యమంత్రిగా లేదా ఇవాళ ప్రధానమంత్రిగా యువతరంపై నాకు సదా అపారమైన నమ్మకం. మీ సామర్థ్యం, ప్రతిభ నుంచి నాకెప్పుడూ నవ్యోత్తేజం లభిస్తూంటుంది. ఈ నేపథ్యంలో వికసిత భారత్ స్వప్న సాకార సారథ్యం బాధ్యతను మీరు స్వీకరిస్తారని నేను ఆశిస్తున్నా.‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 12th, 06:30 pm
న్యూఢిల్లీలో ‘వికసిత్ భారత్ యువ నాయకుల చర్చావేదిక - 2026’ ముగింపు సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రసంగించారు. శ్రీ మోదీ ప్రసంగిస్తూ, తాను ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, నేటి యువ పౌరులలో చాలా మంది ఇంకా పుట్టలేదని, అలాగే, 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, వారిలో ఎక్కువ మంది చిన్న పిల్లలుగానే ఉన్నారని తెలిపారు. గడచిన కాలంతో నిమిత్తం లేకుండా యువతరంపై తన నమ్మకం స్థిరంగా, అచంచలంగా ఉందని ఆయన చెప్పారు. “మీ సామర్థ్యం, మీ ప్రతిభ, మీ బలం నుంచే నేను ఎల్లప్పుడూ శక్తిని పొందాను. ఈ రోజు మీరందరూ అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధన పగ్గాలను చేతబట్టారు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.ఎల్‌వీఎం3-ఎం6 ద్వారా బ్లూబర్డ్ బ్లాక్-2ను విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను అభినందించిన ప్రధాని
December 24th, 10:04 am
ఎల్‌వీఎం3-ఎం6 వాహక నౌక ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన అంతరిక్ష శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. భారత భూభాగం అత్యంత బరువైన ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి. ఇది భారత అంతరిక్ష ప్రయాణంలో గర్వించదగిన విజయమని, ఆత్మనిర్భర భారత్ దిశగా చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుందని శ్రీ మోదీ పేర్కొన్నారు.అనువాదం: ఒమన్‌లోని భారతీయ సమాజం, విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
December 18th, 12:32 pm
మీ యువ ఉత్సాహం, శక్తి ఇక్కడి వాతావరణాన్ని నిజంగా ఉత్తేజపరిచాయి. ఈ హాల్ సరిపోకపోవటంతో పక్కనే ఉన్న హాల్‌లోని తెరలపై ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న సోదరీసోదరులందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత దూరం వచ్చి కూడా ఈ హాల్‌లోకి ప్రవేశించలేకపోయినందుకు వారు ఏమనుకుంటున్నారో మీరు ఊహించొచ్చు.ఒమన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
December 18th, 12:31 pm
మస్కట్‌లో అక్కడి భారతీయుల భారీ సమావేశాన్నుద్దేశించి ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వివిధ భారతీయ పాఠశాలలకు చెందిన సుమారు 700 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒమన్‌లో భారతీయ పాఠశాలలను నెలకొల్పి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్‌లోని కుటుంబాలు, మిత్రుల తరఫున వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మీయంగా, వర్ణశోభితంగా తనకు స్వాగతం పలికిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒమన్‌లో స్థిరపడిన భారత్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను కలవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. వైవిధ్యమే భారతీయ సంస్కృతికి మూలమనీ, భారతీయులు ఏ సమాజంతోనైనా కలిసిపోవడానికి ఈ వైవిధ్యమే కారణమని వ్యాఖ్యానించారు. ఒమన్‌లో భారతీయ సమాజానికి లభిస్తున్న గౌరవాన్ని ప్రస్తావిస్తూ.. సహజీవనం, సహకారం భారతీయ ప్రవాసుల విశేష లక్షణమని ప్రధానమంత్రి ప్రశంసించారు.ప్రజల సమిష్టి ప్రయత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 'మన్ కీ బాత్' ఒక అద్భుతమైన వేదిక: ప్రధాని మోదీ
November 30th, 11:30 am
ఈ నెల మన్ కీ బాత్‌లో, రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, వందేమాతరం 150వ వార్షికోత్సవం, అయోధ్యలో ధర్మ ధ్వజ ఆవిష్కరణ, ఐఎన్‌ఎస్ 'మహే' ప్రవేశం మరియు కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవం వంటి నవంబర్‌లో జరిగిన కీలక సంఘటనలను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు & తేనె ఉత్పత్తి, భారతదేశ క్రీడా విజయాలు, మ్యూజియంలు మరియు సహజ వ్యవసాయం వంటి అనేక ముఖ్యమైన అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. కాశీ-తమిళ సంగమంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ప్రధాని కోరారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
November 27th, 11:01 am
కేబినెట్‌లో నా సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.జి. భరత్ గారు, ఇన్-స్పేస్ చైర్మన్ శ్రీ పవన్ గోయెంకా గారు, స్కైరూట్ బృందం, ఇతర ప్రముఖులు, సోదరీ సోదరులారా...!Prime Minister Shri Narendra Modi inaugurates Skyroot’s Infinity Campus in Hyderabad via video conferencing
November 27th, 11:00 am
PM Modi inaugurated Skyroot’s Infinity Campus in Hyderabad, extending his best wishes to the founders Pawan Kumar Chandana and Naga Bharath Daka. Lauding the Gen-Z generation, he remarked that they have taken full advantage of the space sector opened by the government. The PM highlighted that over the past decade, a new wave of startups has emerged across perse sectors and called upon everyone to make the 21st century the century of India.అనువాదం: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి సంభాషణ
November 06th, 10:15 am
ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఇవాళ దేవ్ దీపావళి.. గురుపూర్ణిమ కూడా. అందుకే ఇది నిజంగా చాలా ముఖ్యమైన రోజు.ఐసీసీ మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్లతో ప్రధానమంత్రి సంభాషణ
November 06th, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని లోకకల్యాణ్ మార్గ్, 7లో ఐసీసీ మహిళా ప్రపంచ కప్ 2025 ఛాంపియన్లతో నిన్న ముచ్చటించారు. 2025 నవంబర్ 2, ఆదివారం జరిగిన తుదిపోరులో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించింది. దేవ దీపావళి, గురు పర్వ్ రెండింటినీ నిర్వహించుకొనే ఈ రోజు చాలా ముఖ్యమైనదంటూ.. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సదస్సు-2025లో ప్రధానమంత్రి ప్రసంగం
November 03rd, 11:00 am
ఈరోజు జరిగే కార్యక్రమం సైన్స్‌కు సంబంధించింది. అయితే ముందుగా నేను క్రికెట్‌లో భారత్ సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడతాను. యావత్ భారతం తమ క్రికెట్ జట్టు విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఇది భారత మహిళల జట్టుకు మొట్టమొదటి ప్రపంచ కప్. మన మహిళా క్రికెట్ జట్టును నేను అభినందిస్తున్నాను. మేం మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం. మీ విజయం దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువతకు స్ఫూర్తినిస్తుంది.