ఇజ్రాయెల్ అధ్యక్షునితో భారత ప్రధానమంత్రి సమావేశం
February 26th, 09:00 pm
2017లో తాను ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు, అలాగే 2023లో దుబాయ్‌లో సమావేశాల సందర్భంగా అధ్యక్షుడు హెర్జోగ్‌తో జరిపిన భేటీలను శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భారత్ - ఇజ్రాయెల్ సంబంధాలను శాంతి, ఆవిష్కరణ, అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచడం అనేది ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త ఆరంభమని ఇరువురు నేతలు పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న ప్రగాఢమైన నమ్మకానికి, పంచుకున్న ప్రజాస్వామ్య విలువలకు, విశిష్టమైన స్నేహానికి నిదర్శనమని వారు అభివర్ణించారు. వాణిజ్యం, సాంకేతికత, ఆవిష్కరణలు, సంస్థలు, రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటి రంగాలలో ప్రస్తుతం కొనసాగుతున్న సహకారం పట్ల ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
February 25th, 08:28 am
నా మిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ ఆహ్వానం మేరకు ఆ దేశంలో 2026 ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అధికారికంగా పర్యటిస్తాను.ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
February 24th, 05:34 pm
ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించడంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25వ, 26వ తేదీల్లో ఇజ్రాయెల్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఇజ్రాయెల్‌కు వెళ్లడం ఇది రెండో సారి కానుంది.జెరూసలేం లో ప్రధానిని కలిసిన ప్రతిపక్ష నాయకుడు నేస్సేట్ ఐజాక్ హెర్జోగ్
July 05th, 07:32 pm
జెరూసలేం లో ప్రధానమంత్రిని ఇశ్రాయేలు ప్రతిపక్ష నాయకుడు నేస్సేట్ ఐజాక్ హెర్జోగ్ కలుసుకున్నారు