పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై రాజ్యసభలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

March 24th, 02:05 pm

పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, దాని వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితుల గురించి మనందరికీ తెలిసిందే. ఈ రోజు, నేను పార్లమెంటు ఎగువ సభ ముందు, నా తోటి పౌరుల ముందు నిలబడి, ఈ ఉద్రిక్త పరిస్థితులపై ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తున్నాను. మూడు వారాలకు పైగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని సృష్టించింది. భారతదేశానికి కూడా ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మన వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లాంటి అత్యవసర వస్తువుల సాధారణ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దాదాపు కోటి మంది భారతీయులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. ఉపాధి పొందుతున్నారు. వారి భద్రత, జీవనోపాధి భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు. ఇది కూడా భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, రాజ్యసభ నుంచి శాంతి, చర్చల ప్రాధాన్యం ప్రపంచానికి తెలియజెప్పేలా ముక్తకంఠంతో మన స్వరం వినిపించడం అవసరం.

పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణలను ఉద్దేశించి రాజ్యసభలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 24th, 02:00 pm

పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ, ఇవాళ రాజ్యసభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. మూడు వారాలుగా కొనసాగుతోన్న ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొందని, ఇది భారతదేశానికి కూడా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ ఘర్షణలు భారత వాణిజ్య మార్గాలకు అంతరాయం కలిగిస్తున్నాయని.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల వంటి నిత్యావసరాల సరఫరాపై ప్రభావం చూపుతున్నట్లు పీఎం శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు నివసిస్తూ, అక్కడ పనిచేస్తున్నారని.. వారి భద్రత, జీవనోపాధి ప్రధానంగా ఆందోళన కలిగించే అంశంగా మారినట్లు పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన విదేశీ నౌకల్లో అధిక సంఖ్యలో భారత సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత పార్లమెంటులోని ఎగువ సభ నుంచి శాంతి, చర్చలపై ఉమ్మడి స్వరాన్ని వినిపించటం అత్యంత అవసరం అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేసారు.

అనువాదం: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలపై లోక్‌సభలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

March 23rd, 02:15 pm

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, వాటి వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై మాట్లాడటానికి నేను ఈ గౌరవనీయ సభ ముందుకు వచ్చాను. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. గత రెండు మూడు వారాలుగా శ్రీ జైశంకర్ గారు, శ్రీ హర్దీప్ పూరీ గారు ఈ విషయంపై అవసరమైన తాజా సమాచారాన్ని ఈ సభకు అందించారు. ఇప్పుడు ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై దీని ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభానికి త్వరితగతిన పరిష్కారం అన్వేషించాలని ప్రపంచమంతా అన్ని పక్షాలను కోరుతోంది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై లోక్‌సభలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

March 23rd, 02:00 pm

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, దాని వల్ల భారత్ ఎదుర్కొంటున్న విస్తృత సవాళ్లపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్‌సభలో ప్రసంగించారు. ఈ సంక్షోభం మూడు వారాలకు పైగా కొనసాగుతోందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, మానవ జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. దీనిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పరిస్థితి తీవ్రత గురించి వివరిస్తూ.. ‘‘ఈ సంక్షోభాన్ని వీలైనంత తర్వగా పరిష్కరించాలని అన్ని పక్షాలకు ప్రపంచమంతా విజ్ఞప్తి చేస్తోంది’’ అన్నారు.

ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి

March 21st, 04:26 pm

ప్రాంతీయ పరిణామాలు, ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంపై ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్‌లో మాట్లాడారు.

ఇరాన్ అధ్యక్షునితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 12th, 11:38 pm

ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెశ్కియన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో మాట్లాడారు.

LDF and UDF have deprived Keralam of its youth power: PM Modi in Ernakulam

March 11th, 03:00 pm

Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.

PM Modi addresses a mega public meeting in Ernakulam, Keralam

March 11th, 02:20 pm

Amid a massive gathering in Ernakulam today, Prime Minister Narendra Modi said the enthusiasm and confidence of the people reflected a strong aspiration for Keralam’s development and a new political direction in the state. He emphasised that the aspirations of the people clearly indicate a desire for faster growth and new opportunities.

2030 వైపు: ఉమ్మడి భారతదేశం-యూరోపియన్ యూనియన్ సమగ్ర వ్యూహాత్మక అజెండా

January 27th, 06:48 pm

2026 జనవరి 27న న్యూఢిల్లీలో జరిగిన 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంలో ఆమోదించబడిన ఉమ్మడి భారతదేశం-ఈయు సమగ్ర వ్యూహాత్మక అజెండా, భాగస్వాములిద్దరికీ మరియు విస్తృత ప్రపంచానికి పరస్పర ప్రయోజనకరమైన, కాంక్రీట్ మరియు పరివర్తనాత్మక ఫలితాలను అందించడానికి ఈయు-భారతదేశ సహకారాన్ని విస్తృతం చేయడం, లోతుగా చేయడం మరియు మెరుగైన సమన్వయం చేయడం ద్వారా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.

భారతదేశం - యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడి భారతదేశ అధికారిక పర్యటన మరియు 16వ ఇండియా-ఈయు శిఖరాగ్ర సమావేశంపై ఈయు సంయుక్త ప్రకటన

January 27th, 06:15 pm

ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ 77వ భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథులుగా భారతదేశానికి రాష్ట్ర పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన సందర్భంగా, మైలురాయి భారతదేశం-ఈయు ఎఫ్టిఏ పై చర్చలు విజయవంతంగా ముగిసినందుకు నాయకులు ప్రశంసించారు మరియు 2030 వైపు: భారతదేశం-ఈయు ఉమ్మడి సమగ్ర వ్యూహాత్మక అజెండాను ఆమోదించారు.

సెప్టెంబర్ 25న ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా-2025లో పాల్గొననున్న ప్రధానమంత్రి

September 24th, 06:33 pm

సెప్టెంబర్ 25న సాయంత్రం 6:15 గంటలకు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న వరల్డ్ ఫుడ్ ఇండియా 2025లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

ప్రధానమంత్రితో ఫోన్‌లో మాట్లాడిన ఇరాన్ అధ్యక్షుడు

June 22nd, 05:27 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఇరాన్ అధ్యక్షుడు శ్రీ మసూద్ పెజెష్కియన్ ఈ రోజు టెలిఫోన్‌లో మాట్లాడారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది

April 24th, 03:29 pm

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.

ఢిల్లీలో ‘జహాన్-ఎ-ఖుస్రో-2025’ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

February 28th, 07:31 pm

ఈ రోజు ‘జహాన్-ఎ-ఖుస్రో’ కార్యక్రమానికి హాజరు కావడం సహజంగానే నాకెంతో ఆనందం కలిగించింది. ఖుస్రోకు వసంత రుతువు ఎంతో ఇష్టమైన కాలం. ఇవాళ ఢిల్లీలో విరిసిన ఈ వసంతం ప్రాంగణ వాతావరణమంతటా అలముకుంది. హజ్రత్ ఖుస్రో మాటల్లోనే చెబితే-

సూఫీ సంగీతోత్సవం ‘జహాన్-ఎ-ఖుస్రో-2025’కు హాజరైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 28th, 07:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూఫీ సంగీతోత్సవం “జహాన్-ఎ-ఖుస్రో-2025”లో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని సుందర్ నర్సరీలో ఇవాళ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ- హజ్రత్ అమీర్ ఖుస్రో సుసంపన్న వారసత్వానికి ప్రతీక అయిన ఈ వేడుకలో మానసిక ఉల్లాసం ఉప్పొంగడం అత్యంత సహజమన్నారు. ఖుస్రోకు ఎంతో ఇష్టమైన వసంత రుతు సుగంధం కాలానికి మాత్రమే పరిమితం కాదని, నేడిక్కడ జహాన్-ఎ-ఖుస్రో కార్యక్రమ ప్రాంగణంలో వీచే గాలిలోనూ అది వ్యాపించిందని అభివర్ణించారు.

Prime Minister meets with the President of the Islamic Republic of Iran

October 22nd, 09:24 pm

PM Modi met Iran's President Dr. Masoud Pezeshkian on the sidelines of the 16th BRICS Summit in Kazan. PM Modi congratulated Pezeshkian on his election and welcomed Iran to BRICS. They discussed strengthening bilateral ties, emphasizing the Chabahar Port's importance for trade and regional stability. The leaders also addressed the situation in West Asia, with PM Modi urging de-escalation and protection of civilians through diplomacy.

ఇరాన్ అధ్యక్షుని తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీనరేంద్ర మోదీ

November 06th, 06:14 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయ్యద్ ఇబ్రాహిమ్ రయీసీ తో ఈ రోజు న టెలిఫోన్ మాధ్యం ద్వారా సంభాషించారు.

బ్రిక్స్ విస్తరణపై ప్రధానమంత్రి ప్రకటన

August 24th, 01:32 pm

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు ప్రప్రథమంగా నా మిత్రుడు, అధ్యక్షుడు రమఫోసాను నేను హృద‌యపూర్వకంగా అభినందిస్తున్నాను. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సు సందర్భంగా అనేక సానుకూల ఫలితాలు రావడం నాకు ఆనందంగా ఉంది.

ఇరాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశాధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ సయ్యద్‌ ఇబ్రహీం రైజీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ

August 18th, 06:07 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఇరాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశాధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ సయ్యద్‌ ఇబ్రహీం రైజీతో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ అనేక ద్వైపాక్షిక, ప్రాంతీయ ప్రాధాన్యాంశాలపై చర్చించారు. భారత-ఇరాన్‌ల మధ్య బలమైన స్నేహసంబంధాలకు చారిత్రక, నాగరికతాపరమైన సాన్నిహిత్యంతోపాటు ప్రజల మధ్యగల బలమైన బంధం మద్దతునిచ్చాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

July 04th, 12:30 pm

ఈ రోజు న జరుగుతున్న ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాని కి మీ అందరికి ఇదే స్నేహపూర్వక స్వాగతం. గడచిన రెండు దశాబ్దాలు గా యావత్తు ఆసియా ప్రాంతం లో శాంతి కి, సమృద్ధి కి మరియు అభివృద్ధి కి ఎస్ సిఒ ఒక ముఖ్యమైన వేదిక గా ఉంటున్నది. ఈ ప్రాంతాని కి మరియు భారతదేశాని కి మధ్య వేల సంవత్సరాలు గా సాంస్కృతిక సంబంధాలు మరియు ఉభయ పక్షాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఏర్పడి అవి మన యొక్క ఉమ్మడి వారసత్వాని కి ఒక సజీవ తార్కాణం గా నిలచాయి. మనం ఈ ప్రాంతాన్ని ‘‘విస్తారిత ఇరుగు పొరుగు బంధం’’ గా చూడం, మనం దీనిని ‘‘విస్తారిత కుటుంబం’’ లా ఎంచుతున్నాం.